
‘హలో బేబీ’కథ విని ఆశ్చర్యపోయాను. ఇలాంటి చిత్రానికి నేను సంగీతం అందించలేకపోయినందుకు బాధపడుతున్నాను’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రంగా హలో బేబీ తెరకెక్కుతుంది. ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలోని ఒక పాటను కోటి లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ కథ చాలా బాగుంది. ప్రతిఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది. ఇంతగొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ,యూనిట్‌కి అభినందనలు. ఈ చిత్రాన్ని విజయంవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. రాంగోపాల్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య కీర్తి ప్రధాన పాత్ర పోషించింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment