ఈ పాటకు ట్యూన్ తెలుసా? | Today Song subhakankslu movie | Sakshi
Sakshi News home page

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

Published Thu, Feb 20 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

పల్లవి :

ఇద్దరు: మనసా పలకవే
   మధుమాసపు కోయిలవై
 చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై    ॥
 మంచు తెర లే తెరుచుకుని
 మంచి తరుణం తెలుసుకుని
 నవ్వులే పువ్వులై విరియగా... ఓ...    ॥
 
 చరణం : 1

 ఆమె: నాలో కులుకులు కులుకులు రేపే
 లోలో తెలియని తలపులు రేపే
 పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది
 అతడు: నీలో మమతల మధువుని చూసి
 నాలో తరగని తహతహ దూకి
 నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
 ఆ: ఆరారు కాలాల వర్ణాలతో
   నీరాజనం నీకు అందించనా
 అ: ఏడేడు జన్మాల బంధాలతో
   ఈనాడు నీ ఈడు పండించనా
 ఆ: మరి తయ్యారయ్యి ఉన్న వయ్యారంగా
   సయ్యంటు ఒళ్లోకి వాలంగా
 అ: దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ
   చిన్నారి వన్నెల్ని ఏలంగా
 ఆ: ప్రతిక్షణం పరవశం కలగగా ఓ...॥
 
 చరణం : 2

అ: ఆడే మెరుపుల మెలికల జాణ
 పాడే జిలిబిలి పలుకుల మైనా
 రాణి తొలకరి చినుకులలోన తుళ్లే థిల్లానా
 ఆ: రేగే తనువుల తపనలపైన
 వాలే చినుకుల చమటల వాన
 మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన
 అ: బంగారు శృంగార భావాలతో
   పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
 ఆ: అందాల మందార హారాలతో
   నీ గుండె రాజ్యాన్ని పాలించనా
 అ: ఇక వెయ్యేళ్లైన నిన్ను విడిపోనంటూ
   ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
 ఆ: నువ్వు వెళ్లాలన్న ఇంక వీల్లేదంటూ
   స్నేహాల సంకెళ్లు కట్టేయనా
 అ: కాలమే కదలక నిలువగా... ఓ...
 ॥
 
 చిత్రం : శుభాకాంక్షలు (1997), రచన : సిరివెన్నెల
 సంగీతం : కోటి, గానం : బాలు, చిత్ర, బృందం

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement