sirevenela
-
గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను...
గ్రంథపు చెక్క బిడ్డకి పెళ్ళి చేసి, అత్తారింటికి సాగనంపేటప్పుడు, అమ్మానాన్నా చేతనయిన మేరకి చీరాసారే పెట్టుకుంటారు. అక్కడితో ఆగక, కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకుంటారు. పిల్లకి పెళ్ళి చేయడం అనేది, చేయక తప్పని తప్పుపని కాదు కాబట్టి అది మంచిపనే. సంతోషించదగ్గ పనే. కానీ ఇన్నాళ్లూ పెంచుకున్న పేగుబంధం, ఇంటి పేరు మార్చుకుని మరో ఇంటికి వెళ్ళిపోతూ కలిగించిన అనుభూతిలోని తియ్యని చేదు అది. ఈ అంపకాల సన్నివేశంలో ఓ కంట పన్నీరు ఓ కంట కన్నీరూను. పాట రాయడం నా వృత్తి మాత్రమే కాదు. ప్రవృత్తి కూడా. ‘గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె! గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె!’ అని ఎప్పుడో పాతికేళ్ళ క్రితం రాసుకున్నాను. పాట రాసి, అడిగిన అయ్య చేతిలో పెట్టేసి పనైపోయిందనుకోమంటే, నా మనస్సూరుకోదు. ఆ పాటకి ఎంత మేరకి ఎలాంటి ఆదరణ లభించింది, ఆశించిన మేరకి, ఆదరణ లభించక ఏ మూల మూగపోయిందో అన్న ఆరాటం నన్ను కుదురుగా ఉండనివ్వక, ‘మూవీ మేనా’లో సాగనంపేసిన తర్వాత కూడా, అప్పుడప్పుడు నా పాటని మోసుకు వెళ్ళిన గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను. - సిరివెన్నెల సీతారామశాస్త్రి (‘సిరివెన్నెల తరంగాలు’ నుంచి) -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం బృందం: ఓ... హనీ... అ: ఐ లవ్ యూ బృం: ఓ... హనీ... అ: ఐ నీడ్ యూ చరణం : 1 అ: నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా అమృతం నింపె నాలో నీ చిరుస్పర్శ ఆమె: ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా రెప్పనేదాటి రావే కలలో ఆశ అ: పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసి కలకోసం ఆ: సర్లేకాని చీకట్లోనె చేరుకోని నువ్వుకోరె అవకాశం అ: తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ॥చూడు॥ చరణం : 2 అ: వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది ఎదలో రాగం ఆ: స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం అ: ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం దక్కినంత ఆనందం ఆ: అయ్యోపాపం ఎక్కడ్లేని ప్రేమరోగం తగ్గదేమో ఏమాత్రం అ: తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ॥చూడు॥ చిత్రం : నీ స్నేహం (2002) రచన : సిరివెన్నెల సంగీతం : ఆర్.పి.పట్నాయుక్ గానం : రాజేష్, ఉష, బృందం -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఇద్దరు: మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ॥ మంచు తెర లే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా... ఓ... ॥ చరణం : 1 ఆమె: నాలో కులుకులు కులుకులు రేపే లోలో తెలియని తలపులు రేపే పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది అతడు: నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆ: ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా అ: ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా ఆ: మరి తయ్యారయ్యి ఉన్న వయ్యారంగా సయ్యంటు ఒళ్లోకి వాలంగా అ: దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా ఆ: ప్రతిక్షణం పరవశం కలగగా ఓ...॥ చరణం : 2 అ: ఆడే మెరుపుల మెలికల జాణ పాడే జిలిబిలి పలుకుల మైనా రాణి తొలకరి చినుకులలోన తుళ్లే థిల్లానా ఆ: రేగే తనువుల తపనలపైన వాలే చినుకుల చమటల వాన మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన అ: బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా ఆ: అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా అ: ఇక వెయ్యేళ్లైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా ఆ: నువ్వు వెళ్లాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్లు కట్టేయనా అ: కాలమే కదలక నిలువగా... ఓ... ॥ చిత్రం : శుభాకాంక్షలు (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : బాలు, చిత్ర, బృందం