వైవిధ్యమైన కథాంశంతో...
అలనాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ‘శరభ’ చిత్రం తెరకెక్కింది. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వినికుమార్ సహదేవ్, గిరీష్ కపాడియా ఈ చిత్రాన్ని నిర్మించారు.. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిచిన చిత్రమిది. కోటిగారు మంచి పాటలిచ్చారు. ముఖ్యంగా 500మంది జూనియర్ ఆర్టిస్టులు, యాభై మంది డ్యాన్సర్స్‌తో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కించిన జానపద పాట ఆకట్టుకుంటుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఫైట్ కథకు కీలకంగా నిలుస్తుంది.
వాకాడ అప్పారావుగారి సహకారంతో నిర్మాణం సులువుగా జరిగింది’’ అని పేర్కొన్నారు. ‘‘సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రమణ సాల్వ, సహ నిర్మాత: సురేష్ కపాడియా.