పామును డబ్బాలో వేసిన దృశ్యం
సుల్తాన్‌బజార్: ఎప్పుడూ జనసంచారం ఉండే కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద శుక్రవారం ఓ నాగు పాము కలకలం సృష్టించింది. ఏదో మింగిన పాము చాలా నెమ్మదిగా పాకుతూ వెళ్తూ స్థానికుల కంటపడటంతో వారు భయందోళనకు గురై పరుగుతీశారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పామును పట్టుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉమెన్స్ కళాశాలలోని పొదల్లోంచి ఈ పాము వచ్చి ఉంటుందని అక్కడి సెక్యూరిటీ గార్డులు పేర్కొన్నారు.