womens college
-
జాహ్నవి కాలేజీలో బతుకమ్మ సంబురాలు (ఫోటోలు)
-
మహిళా కాలేజీకి మంచిరోజులు..
-
మహిళా కాలేజీని చుట్టుముట్టి.. గోడ దూకి రచ్చ రచ్చ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్, స్టాఫ్ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలిపారు. Men climbing over the walls to get into Miranda House during an open fest. What followed was horrible. Cat-calling, groping, sexist sloganeering and more. Men entering safe spaces to harass gender minorities is nothing new, but they out do themselves every time. pic.twitter.com/UkMAuJZKVU — Sobhana (@sobhana__) October 15, 2022 ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర! -
బిహార్‌లోనూ హిజాబ్ లొల్లి
ముజఫర్‌పూర్: హిజాబ్ తొలగించేందుకు నిరాకరించినందుకు టీచర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ విద్యార్థిని ఆరోపించడం బిహార్‌లో దుమారం రేపింది. ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్శన్ దాస్ మహిళా కాలేజీలో ఆదివారం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష పాసైన వారే ఇంటర్ ఫైనల్ పరీక్షకు అర్హులవుతారు. చెవులు కనిపించేలా హిజాబ్‌ను తొలగించాలని ఓ ఇన్విజిలేటర్‌గా వచ్చిన టీచర్ కోరగా పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని తిరస్కరించింది. దీంతో, టీచర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారంటూ ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై పరీక్ష నిర్వాహకులు రెండు వర్గాల వారితో మాట్లాడి సర్ది చెప్పి పంపించారు. విద్యార్థులు కొందరు మొబైళ్లు, హెడ్ ఫోన్లతో పరీక్ష హాల్లోకి వస్తున్నారని, బ్లూటూత్‌ను ధరిస్తున్నారనే అనుమానంతోనే ఇన్విజిలేటర్ ఆమెను హిజాబ్‌ను చెవులు కనిపించేలా వెనక్కి తప్పించాలని అడిగారే తప్ప, తీసివేయాలని కాదని కాలేజీ ప్రిన్సిపాల్ కాను ప్రియ తెలిపారు. సదరు విద్యార్థిని చేసిన ఆరోపణలు అవాస్తవాలని తమ విచారణలో తేలిందని అన్నారు. -
బుర్ఖా బంద్.. అతిక్రమిస్తే రూ.250 ఫైన్..!
పట్నా : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్నాలోని ఓ మహిళా కళాశాల నిర్వాకం చర్చనీయాంశమైంది. ముస్లిం విద్యార్థినిలు బుర్ఖా ధరించి కళాశాలకు రావొద్దని జేడీ మహిళా కాలేజీ హుకుం జారీ చేసింది. దాంతోపాటు తప్పని సరిగా డ్రెస్ కోడ్ పాటించాలని కాలేజీ యాజమాన్యం నోటీసులో పేర్కొంది. సోమవారం నుంచి శుక్రవారం డ్రెస్‌కోడ్ తప్పనిసరని.. నిబంధనలు అదిక్రమిస్తే రూ.250 పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేసింది. (చదవండి : బురఖా బ్యాన్పై వెనక్కి తగ్గిన సంజయ్) శనివారం ఒక్కరోజు డ్రెస్‌కోడ్ నుంచి మినహాయింపునిస్తున్నామని నిర్వాహకులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థినిలు ఈరోజు (శనివారం) నిరసనకు దిగారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు కాలేజీ ప్రిన్సిపల్ శ్యామా రాయ్‌ని వివరణ కోరగా.. నోటీసులను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. -
వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం!
సాక్షి, గుంటూరు : హాస్టల్ చీఫ్ వార్డెన్, వార్డెన్ల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. గుంటూరు నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఆహారం కల్తీ కారణంగా 75 మంది విద్యార్థినులు సోమవారం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు నాజ్ సెంటర్ దగ్గర ఉన్న మహిళా కళాశాలలో ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాలలు ఉంటాయి. డిగ్రీ కళాశాలకు అనుసంధానంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉంది. దీనికి చీఫ్ వార్డెన్‌గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్‌గా లెక్చరర్ కమలకరుణ వ్యవహరిస్తున్నారు. హాస్టల్లో 400 మంది డిగ్రీ, 280 మంది ఇంటర్, ఒకేషనల్ విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యారికి హాస్టల్ ఫీజు కింద సుమారు రూ.1700 ఇస్తారు. నాసిరకమైన చికెన్.. హాస్టల్లో వారానికి ఒక్కసారి విద్యార్థినులకు చికెన్ పెడతారు. ఆదివారం రాత్రి విద్యార్థులకు పెట్టిన చికెన్ నాసిరకంగా ఉందని, అందులో గ్రేవీ కోసం శనగపిండి కలిపారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఆదివారం తిన్న నాసిరకం చికెన్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రికి సుమారు 75 మంది విద్యార్థులు జీజీహెచ్‌లో చేరారు. మధ్యాహ్నం నుంచి అస్వస్తతకు గురైన విద్యార్థులు వస్తుండటంతో వైద్యులు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వారికి వైద్య చికిత్సలు అందించారు. రాత్రి వండిన ఆహారం కూడా కల్తీ కావడంతో మరో 30 మందికి పైగా విద్యార్థినులు జీజీహెచ్‌కు వచ్చారు. ఆదివారం రాత్రి మిల్మేకర్, టమాటా కర్రీ, అన్నం తిన్న మరి కొందరు విద్యార్థులు కొద్ది సేపటికే వాంతులు చేసుకుని కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. పట్టించుకోని చీఫ్ వార్డెన్, వార్డెన్ ఆహారం కల్తీ జరిగి విద్యార్థినులు వరుసగా అస్వస్థతకు గురవుతుంటే ఇంటర్, ఒకేషనల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు. నీటి కాలుష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపణలు రావడంతో నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ఈఈ శాంతరాజు, డీఈ రమణ, ఏఈ పవన్, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి రాత్రి తిన్న ఆహారం కల్తీ అయి విద్యార్థులు వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గుర్తించారు. అక్కడ వారిని పట్టించుకునే వారు ఎవ్వరు లేకపోవడంతో వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ పిలి పించి జీజీహెచ్‌కు తరలించారు. ఆహారం కల్తీ అయి విద్యార్థులు ఉదయం నుంచి అస్వస్తతకు గురవుతున్న ప్రిన్సిపాల్, విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు. చాలా రోజులుగా ఫిర్యాదులు.. హాస్టల్లో ఆహార కాంట్రాక్టర్ రామకృష్ణ సరిగా ఆహారం పెట్టడం లేదని చాలా రోజులుగా చీఫ్‌వార్డెన్ అయిన ప్రిన్సిపాల్, డెప్యూటీ వార్డెన్, వార్డెన్లకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నామని విద్యార్థినులు తెలిపారు. తక్కువ రేటుకు వచ్చే నాణ్యత లేని కూరగాయలు, బియ్యం, ఇతర సరుకు, చికెన్‌తో వంట చేస్తుంటారని, ఈ విషయమై అనేకమార్లు ఫిర్యాదులు చేసినా తనకు సంబంధం లేదని ప్రిన్సిపాల్ సమాధానమిచ్చారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన రామకృష్ణ గత ప్రభుత్వ హయాంలో ఫుడ్ కాంట్రాక్టును దక్కించుకున్నాడని, ఆదివారం కూడా నిల్వ ఉంచిన చికెన్‌ను తక్కువ ధరకు తీసుకువచ్చి విద్యార్థినులకు వండి వడ్డించారని సమాచారం. మినరల్ వాటర్ ప్లాంట్‌ను రాత్రి 7 గంటల తర్వాత ఆపి వేస్తారని, దీంతో పైపుల్లో వచ్చే నీటినే తాగుతుంటామని విద్యార్థినులు పేర్కొన్నారు. 15 రకాల శాంపిళ్ల సేకరణ ఆహారం కల్తీపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఆహార నియంత్రణ శాఖ అధికారి ఖాజామోహిద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌కు చేరుకుని 15 రకాల శాంపిళ్లను సేకరించారు. రాత్రి కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో మళ్లీ అక్కడకు చేరుకుని మినరల్ వాటర్, రాత్రి వండిన ఆహార శాంపిల్స్‌ను సేకరించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు చంద్రగిరి ఏసురత్నం పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫా రాత్రంతా ఆస్పత్రిలోనే ఉండి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. -
మహిళా విద్యకు చిరునామా
గుంటూరు ఎడ్యుకేషన్: మహిళలు విద్యావంతులైతే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంక్షించిన మహానీయుల ఆశయాలకు సాక్ష్యంగా గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భాసిల్లుతోంది. బ్రిటీషు వారి హయాంలో స్థాపించిన ఈ సరస్వతీ నిలయం ఏడున్నర దశాబ్దాల చరిత్ర సొంతం చేసుకుని మహిళాభివృద్ధి లక్ష్యంగా ప్రగతి పథంలో పురోగమిస్తోంది. డిగ్రీ, పీజీ కోర్సులతో విద్యార్థినులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ జిల్లాకే మణిహారంగా నిలిచింది. బ్రిటీషు పాలకుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి సాక్షిగా నిలిచి, చెక్కు చెదరని భవన నిర్మాణాలతో వర్థిల్లుతున్న కళాశాల గతంలో నాక్ నుంచి ‘ఏ’ గ్రేడ్ పొందగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదాతో కొనసాగుతోంది. 1942లో బ్రిటీషు వారి పాలనలో స్థాపించిన కళాశాల విలువలతో కూడిన విద్యా విధానంతో, ప్రైవేటు రంగానికి దీటుగా ప్రగతిపథంలో దూసుకెళుతూ రాష్ట్రంలోని అతికొద్ది ప్రభుత్వ కళాశాలల్లో ఒకటిగా నిలిచింది. ప్రత్యేకించి కోస్తాంధ్రలో పురాతన చరిత్ర గల ఏకైక మహిళా విద్యాసంస్థగా ప్రసిద్ధి చెందిన కళాశాలగా ప్రగతి పథంలో పయనిస్తోంది. గుంటూరు నగరంలోని సాంబశివపేటలో 16 ఎకరాల సువిశాల స్థలంలో స్థాపించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాణ్యమైన విద్యకు నిలయంగా భాసిల్లుతోంది. ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, రీడింగ్ రూం, జవహర్ విజ్ఞాన కేంద్రం (జేకేసీ) వంటి పూర్తిస్థాయి వసతులతో పాటు సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ కాలానుగుణమైన కోర్సులతో ముందుకెళుతోంది. యూజీ స్థాయిలో 24, నాలుగు పీజీ కోర్సులతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ లేబరేటరీల ద్వారా విద్యార్థినులకు ప్రయోగాత్మక విద్యను అందిస్తోంది. అటానమస్‌తో స్వతంత్ర హోదా... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో ఒకటిగా ఉన్న మహిళా కళాశాల అభివృద్ధికి యూజీసీ ఇచ్చిన స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా ఊతం ఇచ్చింది. 2014–15 విద్యాసంవత్సరం నుంచి స్వతంత్రంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని, పరీక్షలను సైతం తానే నిర్వహిస్తోంది. తద్వారా యూజీసీ ద్వారా నేరుగా నిధులు పొంది, కళాశాలలో నూతన భవన నిర్మాణం, ప్రయోగశాలలు, విద్యార్థినులకు ఉపాధి కల్పించేందుకు కాలానుగుణంగా కోర్సుల రూపకల్పన అంతా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం చేతుల్లోనే ఉంటుంది. ఆధునిక విద్యను అందించేందుకు కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం యూజీసీ స్థానంలో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్చితార్ శిక్షా అభియాన్ (రూసా) నిధులు మంజూరు చేస్తోంది. నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్య అటానమస్ హోదా పొందిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఫీజులను స్వయంగా నిర్ణయించుకునే అధికారం ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం అమలుపరిచే ఫీజులనే వసూలు చేసేందుకు నిర్ణయించారు. సాధారణ బీఏ, బీకాం కోర్సులకు రూ.1151 స్పెషల్ బీఏ కోర్సుకు రూ.2171, బీకాం (కంప్యూటర్స్)కు రూ.4151, బీఎస్సీ కోర్సుకు రూ.1276, బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులకు రూ.4276 చొప్పున ఫీజులను నిర్ణయించారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్ ఫీజు కింద ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. కళాశాలకు అనుబంధంగా ఉన్న జవహర్ విజ్ఞాన కేంద్రం (జేకేసీ) విద్యార్థినుల్లో భాషా, భావ వ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. డిగ్రీ విద్యతో పాటు జేకేసీ శిక్షణ పొందిన విద్యార్థినులకు ప్రతి ఏటా వివిధ కార్పొరేట్ సంస్థలతో క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కాలాను గుణమైన కోర్సులు కాలానుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టడంలో కళాశాల ముందంజలో ఉంటోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూజీ స్థాయిలో కొత్తగా బీఏలో హిస్టరీ, పాలిటిక్స్, ఇంగ్లిష్ ఫర్ డిజిటల్ ఏజ్ కలయికతో ఇంగ్లిష్ మీడియం, హిస్టరీ పాలిటిక్స్, ఫంక్షనల్ తెలుగు కోర్సును తెలుగు మీడియంలో ప్రవేశపెట్టారు. బీకాంలో బ్యాంకింగ్, ఇన్సూ్యరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సు, బీఎస్సీలో కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సు, మ్యాథ్స్, కంప్యూటర్స్, మల్టీమీడియా కోర్సు, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సు, మ్యాథ్స్, కంప్యూటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు అందుబాటులోకి తెచ్చారు. ఏడాదికి రెండు సెమిస్టర్ల విధానం స్వయం ప్రతిపత్తి హోదా పొందిన కళాశాలలో ఏడాదికి రెండు సెమిస్టర్ల విధానం అమలు పరుస్తున్నారు. కళాశాలలో రెండువేల మంది విద్యార్థినులు చదువుతుండగా, సబ్జెక్టుల బోధనకు 85 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుతూనే విద్యార్థినులు ఉపాధిని చూపే యాడ్ ఆన్ కోర్సులను సైతం నేర్చుకునే అవకాశం ఉంది. యూజీసీ ద్వారా> మూడేళ్ల కాల పరిమితిలో ఫొటోషాప్, వెబ్ డిజైనింగ్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంతో విద్యార్థినులు తమకు నచ్చిన వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవచ్చు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే విద్యార్థినులకు కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో వసతి సదుపాయం ఉండగా, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం పొందే వీలుంది. ఈనెల 24, 25 తేదీల్లో నాక్ బృంద సందర్శన ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపారు. కళాశాలలో విద్యాబోధన, మౌలిక వసతులు, ప్రయోగశాలలు, నైపుణ్యాల పెంపుదలకు చేపడుతున్న చర్యలు, ఉద్యోగావకాశాల కల్పన, అధ్యాపకుల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని నాక్ కళాశాలలకు గ్రేడ్లు ఇస్తుంది. గతంలో 2011–2016 మధ్య కాలంలో నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు సాధించిన మహిళా కళాశాల మరోసారి నాక్ గుర్తింపు కోసం పంపిన ప్రతిపాదనలపై ఈనెల 24,25 తేదీల్లో నాక్ బృందం కళాశాలకు రానుంది. ఈ నేపథ్యంలో కళాశాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారెడ్డి, అధ్యాపకులు నిమగ్నమయ్యారు. విద్యార్థినుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట ఘన చరిత్ర కలిగిన మహిళా కళాశాలలో అందిస్తున్న విద్యాబోధన విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేదిగా ఉంటోంది. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ శిక్షణ కల్పిస్తున్నాం. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. కాలేజ్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌లెన్స్ (సీపీఈ) ప్రోగ్రాం కింద మంజూరైన రూ.1.20 కోట్ల నిధులతో కళాశాలలో విద్యాపరమైన సదుపాయాలను కల్పిస్తున్నాం. మరోసారి నాక్ ‘ఏ’ గ్రేడ్ కోసం కృషి చేస్తున్నాం.– డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ -
సిద్ధార్థ మహిళా కళాశాలలో ‘మిస్ ఫెట్-2018’
-
మాతృభాషను మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది. చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు. మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: కోఠి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేగింది. హాస్టల్లోకి వెళ్తున్న ఓ విద్యార్థినిని ఇద్దరు అగంతకులు కిడ్నాప్ చేయడానికి యత్నించారు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. అప్రమత్తమైన తోటి విద్యార్థినులు ఓ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు.. ఆమెను తమ వెంట తీసుకెళ్లడానికి యత్నించారు. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి బిగ్గరగా కేకలు వేసింది. తోటి విద్యార్థినులు వెంటనే స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. హాస్టల్ సమీపంలో వీధిలైట్లు లేకపోవడంతో.. పోకిరీల బెడద ఎక్కువైందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆకట్టుకున్న యువజనోత్సవాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్ కళాశాలలో గురువారం జరిగిన ఎన్ఎస్ఎస్ జోనల్ యువజనోత్సవాల్లో విద్యార్థలు సందడి చేశారు. రాజమహేంద్రవరం పరిధిలోని 15 కళాశాలల నుంచి 120 మంది విద్యార్థినులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పీవీ కృష్ణారావు విచ్చేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎన్ఎస్ఎస్ యువజనోత్సవాలు విద్యార్థుల్లో ఐక్యమత్యతను పెంచుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జంధ్యాల లలితభారతి మాట్లాడుతూ యువజనోత్సవాలు విద్యార్థుల్లో అంతరంగికంగా దాగిఉన్న ప్రతిభను వెలికితీస్తాయన్నారు. అనంతరం వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫోక్ డ్యాన్స, భరతనాట్యం, గ్రూప్డ్యాన్సలు, సోలోసాంగ్స్లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఆర్థికవిధానం, రూ.500, రూ.1000 నోట్ల రద్దు, స్వచ్ఛభారత్ వంటివాటిపై పోటీలు నిర్వహించారు. వీటిలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థినులు వకృ్తత్వం, వ్యాసరచన, పద్యరచన, క్విజ్, వాగ్వివాదం, సోలో శాస్రీ్తయనృత్యం, పోటీల్లో ఆదిత్య మహిళా కళాశాల విద్యార్థినులు, చిత్రకళ, జానపద నృత్యాలలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు, రంగోలి, ఏకపాత్రాభినయంలో ఎస్కేఆర్ కళాశాల విద్యార్థినులు, మిమిక్రీలో ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థినులు ప్రథమ బహమతులు సా«ధించాయి.ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎ.సుగుణ, డాక్టర్ వి.లక్ష్మి, డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ విజయలక్ష్మి, డీజీ.భవానీ వ్యవహరించారు. -
కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ మహిళా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎంపీసీ గ్రూప్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాత్విక మంగళవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేకనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని తోటి విద్యార్థులు అంటున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద పాము కలకలం
సుల్తాన్‌బజార్: ఎప్పుడూ జనసంచారం ఉండే కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద శుక్రవారం ఓ నాగు పాము కలకలం సృష్టించింది. ఏదో మింగిన పాము చాలా నెమ్మదిగా పాకుతూ వెళ్తూ స్థానికుల కంటపడటంతో వారు భయందోళనకు గురై పరుగుతీశారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పామును పట్టుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉమెన్స్ కళాశాలలోని పొదల్లోంచి ఈ పాము వచ్చి ఉంటుందని అక్కడి సెక్యూరిటీ గార్డులు పేర్కొన్నారు. -
ఓయూ ఉమెన్స్ కళాశాలకు అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. యూజీసీ నుంచి ‘కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్(సీపీఈ)’ గుర్తింపు లభించింది. 1924లో ఏర్పాౖటెన ఈ కళాశాలలో నాణ్యమైన బోధన, ఉత్తమ పరిశోధనలు, మెరుగైన మౌలిక వసతుల తీరుపై సంతృప్తి చెందుతూ యూజీసీ సీపీఈతో సత్కరించింది. 2016–21 వరకు సీపీఈ చెల్లుబాటు అవుతుంది. ఈ ఐదేళ్ల కాలానికిగాను యూజీసీ నుంచి కళాశాలకు రూ. 1.50 కోట్లు నిధులు అందనున్నాయి. వీటితో కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుకోవడం, కొత్త కోర్సుల ఏర్నాటు, లైబ్రరీ ఎక్స్టెన్షన్, ల్యాబ్ అప్‌గ్రేడ్ తదితర కార్యక్రమాలను చేపట్టే వీలుంది. రెండేళ్ల క్రితం న్యాక్ ద్వారా రెండో సారి ‘ఏ’ గ్రేడ్ సొంతం చేసుకున్న కళాశాలకు సీపీఈ గుర్తింపు దక్కడం విశేషం. ‘నాణ్యమైన బోధన, విస్తృత స్థాయిలో మౌలిక వసతులున్న దృష్ట్యా సీపీఈ గుర్తింపు దక్కడం చాలా సంతోషం. 92 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలకు సీపీఈ హోదా దక్కడం ఇది మూడోసారి. ఈ గుర్తింపుతో మా బాధ్యత మరింత పెరిగింది’ అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీత పేర్కొన్నారు. -
రండి బాబూ..రండి!
మంచిర్యాల సిటీ : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 11 ఉన్నాయి. మంచిర్యాల, నిర్మ ల్, ఆదిలాబాద్‌లో మహిళా కళాశాలలు ఉండగా మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, భైంసా పట్టణాల్లో పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 50 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలోనే సీట్లు పూర్తిస్థాయిలో నిండాయి. అదనపు సీట్ల కోసం ఆ కళాశాల ప్రిన్సిపాల్ యునివర్సిటీని కోరడం విశేషం. లక్సెట్టిపేటలో ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండటం తో ప్రభుత్వ కళాశాలలో ఎవరు చేరడం లేదు. చెన్నూర్, నిర్మల్, ఆదిలాబాద్, భైంసా కళాశాలల్లో కొంత మేరకు పరవాలేదు. ఇక ప్రైవేట డిగ్రీ కళాశాల యాజ మాన్యాలు ప్రైవేటు జూనియర్ కళాశాలల మద్దతు, ప్రైవేటు పీఆర్వోలను నియమించుకోవడం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, బ్యాగులు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, బోధన రు సుం వస్తుంది కాబట్టి మా కళాశాలలో కేవలం బదిలీ సర్టిఫికెట్టు ఇస్తే సరిపోతుందని భరోసా ఇస్తున్నారు. విచ్చలవిడిగా అనుమతులు యూనివర్సిటీ నుంచి విచ్చలవిడిగా ప్రైవే టు కళాశాలలకు అనుమతులు రావడంతోనే ప్రభుత్వ కళాశాలల అడ్మిషన్లకు గం డి పడుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బోధన రుసుంతో లాభాలు ఉండటంతో ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు కలిపి ఒక్కో కళాశాలకు నెలకు సుమారు రూ.12 నుంచి 15 లక్షల వరకు వ్యయం అవుతుంది. ప్రిన్సిపాల్ వేతనం రూ.ఒక లక్షకు పైన ఉన్న కళాశాలలు ఉన్నాయి. అంటే జిల్లాలోని కళాశాలల వ్యయం నెల కు సుమారు రూ.1.50 కోట్లు అంటే ఏడాదికి 18 కోట్లు అవుతుంది. బోధన రుసుంలో ఎంత తేడా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుం మంజూరు చేస్తుంది. ఏటా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చవివే విద్యార్థులు ప్రథమ 16 వేలు, ద్వితీయ 13 వేలు, తృతీయ 11వేల మంది ఉంటారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు 5 వేలకు మించరు. 35 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వారే. ప్రభుత్వ కళాశాలలో ఆర్ట్స్ చదివే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు బోధన రుసుం రూ.35.25 లక్షలు, సైన్స్ చదివే 2 వేల మందికి మూడేళ్లకు రూ.25.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లో ఆర్ట్స్ చదివే 20వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.9 కోట్లు, సైన్స్ చదివే 10 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.7.50 కోట్లు, బీకాం(కంప్యూటర్) చది వే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.2.40 కోట్లు, బీఎస్సీ(కంప్యూటర్) చదివే 2 వేల మందికి రూ.2.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ కళాశాల లకు రుసుం రూ.60.75 లక్షలు చెల్లిస్తుండగా, ప్రైవే టు కళాశాలలకు రూ.21.10 కోట్లు చెల్లిస్తున్నారు.