మంచిర్యాల సిటీ : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 11 ఉన్నాయి. మంచిర్యాల, నిర్మ ల్, ఆదిలాబాద్‌లో మహిళా కళాశాలలు ఉండగా మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, భైంసా పట్టణాల్లో పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 50 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలోనే సీట్లు పూర్తిస్థాయిలో నిండాయి.
అదనపు సీట్ల కోసం ఆ కళాశాల ప్రిన్సిపాల్ యునివర్సిటీని కోరడం విశేషం. లక్సెట్టిపేటలో ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండటం తో ప్రభుత్వ కళాశాలలో ఎవరు చేరడం లేదు. చెన్నూర్, నిర్మల్, ఆదిలాబాద్, భైంసా కళాశాలల్లో కొంత మేరకు పరవాలేదు. ఇక ప్రైవేట డిగ్రీ కళాశాల యాజ మాన్యాలు ప్రైవేటు జూనియర్ కళాశాలల మద్దతు, ప్రైవేటు పీఆర్వోలను నియమించుకోవడం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, బ్యాగులు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, బోధన రు సుం వస్తుంది కాబట్టి మా కళాశాలలో కేవలం బదిలీ సర్టిఫికెట్టు ఇస్తే సరిపోతుందని భరోసా ఇస్తున్నారు.
విచ్చలవిడిగా అనుమతులు
యూనివర్సిటీ నుంచి విచ్చలవిడిగా ప్రైవే టు కళాశాలలకు అనుమతులు రావడంతోనే ప్రభుత్వ కళాశాలల అడ్మిషన్లకు గం డి పడుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బోధన రుసుంతో లాభాలు ఉండటంతో ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు కలిపి ఒక్కో కళాశాలకు నెలకు సుమారు రూ.12 నుంచి 15 లక్షల వరకు వ్యయం అవుతుంది. ప్రిన్సిపాల్ వేతనం రూ.ఒక లక్షకు పైన ఉన్న కళాశాలలు ఉన్నాయి. అంటే జిల్లాలోని కళాశాలల వ్యయం నెల కు సుమారు రూ.1.50 కోట్లు అంటే ఏడాదికి 18 కోట్లు అవుతుంది.
బోధన రుసుంలో ఎంత తేడా..
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుం మంజూరు చేస్తుంది. ఏటా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చవివే విద్యార్థులు ప్రథమ 16 వేలు, ద్వితీయ 13 వేలు, తృతీయ 11వేల మంది ఉంటారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు 5 వేలకు మించరు. 35 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వారే.
ప్రభుత్వ కళాశాలలో ఆర్ట్స్ చదివే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు బోధన రుసుం రూ.35.25 లక్షలు, సైన్స్ చదివే 2 వేల మందికి మూడేళ్లకు రూ.25.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లో ఆర్ట్స్ చదివే 20వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.9 కోట్లు, సైన్స్ చదివే 10 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.7.50 కోట్లు, బీకాం(కంప్యూటర్) చది వే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.2.40 కోట్లు, బీఎస్సీ(కంప్యూటర్) చదివే 2 వేల మందికి రూ.2.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ కళాశాల లకు రుసుం రూ.60.75 లక్షలు చెల్లిస్తుండగా, ప్రైవే టు కళాశాలలకు రూ.21.10 కోట్లు చెల్లిస్తున్నారు.
రండి బాబూ..రండి!
Published Fri, Jul 18 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement