Government Degree College
-
మోడల్ పేపరే.. సెమిస్టర్ ప్రశ్నపత్రం!
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి అటానమస్ హోదా కలిగిన స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలను అధికారులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఐదు రోజుల క్రితం సెమిస్టర్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన రెండవ సంవత్సరం బీఎస్సీకి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా (టైటిల్ ఆఫ్ ది కోర్స్), బీ.కాం రెండవ సంవత్సరానికి సంబంధించి ఈ–కామర్స్, వెబ్ డిజైనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క పరీక్ష 75 మార్కులకు జరిపారు. అటానమస్ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలు చేరొకచోట రూపొందించాల్సి ఉంది. అయితే, ఆ రెండు పరీక్షలకు ముందు విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) ప్రశ్నపత్రాలనే సెమిస్టర్–3 పరీక్షలకు కూడా ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదా అధికారి అలసత్వం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని సమాచారం. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్ జీవనజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రశ్నపత్రాలు తమ కళాశాలలో ముద్రించడం లేదని తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగిందేమో విచారణ చేస్తామని వెల్లడించారు. -
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్‌లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
‘ఏ’ గ్రేడ్‌లో ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యా రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రవేశాలు కలి్పస్తూ ‘ఫ్యూచర్ రెడీనెస్’ కాన్సెప్‌్టతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ‘నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్’ (న్యాక్) గుర్తింపు సాధనలో ముందంజలో నిలుస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలంటే అందరికీ చిన్న చూపే. పాతికేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన కాలేజీలు కూడా ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి దైన్య స్థితికి చేరాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పాతబడిపోయిన భవనాలు, సరైన సౌకర్యాలు లేని తరగతి గదులు, పనికిరాని లే»ొరేటరీలు, బోధన సిబ్బంది లేమి వంటి సమస్యలతో వీటిలో చేరాలంటేనే భయపడే పరిస్థితి. న్యాక్ అక్రిడిటేషన్ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రమే. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను రూపుదిద్దారు. దీంతో ప్రభుత్వ కాలేజీలు మళ్లీ నూతనంగా కనిపిస్తున్నాయి. ఉన్నత విలువలను సంతరించుకొని, విద్యా బోధనలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొంది, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న కాలేజీల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే న్యాక్ సర్టిఫికెట్ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనం. రాజమండ్రి (అటానమస్), నగరి, విశాఖపట్నం (మహిళా), రేపల్లె, ఒంగోలు (మహిళా) ప్రభుత్వ కళాశాలలకు, ఎయిడెడ్‌లో ఏలూరులోని మహిళా సెయింట్ థెరిస్సా కళాశాల, నర్సాపురం వైఎన్ డిగ్రీ కళాశాలకు ఏకంగా ఏ–ప్లస్ గ్రేడ్ లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రవేశాలు భేష్.. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఇందులో 2020 తర్వాత 15 కొత్త కళాశాలలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 55 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్య సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా అరకు డిగ్రీ కళాశాలలో 100 శాతం, పాడేరులో 99.70 శాతం, చింతపల్లిలో 97 శాతం, గుమ్మలక్ష్మీపురంలో 92 శాతం ప్రవేశాలు నమోదవడం విశేషం. వీటితో పాటు రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలకు యూజీసీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘కాలేజీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ (సీపీఈ)’ గుర్తింపు సైతం లభించింది. అనంతపురం, కడప అటానమస్ కళాశాలలు ‘డీబీటీ’ స్టార్‌గా ఎంపికయ్యాయి. ఏప్రిల్ నాటికి ‘సెంచరీ’ న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలంటే యూ జీసీ (2ఎఫ్/12బీ స్టేటస్) గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో కేవలం 57 కళాశాలలకు మాత్రమే యూజీసీ స్టేటస్ లేదు. వీటిల్లో కొత్తగా పెట్టిన కాలేజీలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వచ్చినవి, అరకొర సిబ్బంది కొరత, అడ్మిషన్లు.. ఇలా చిన్న సాంకేతిక లోపాలు, కారణాలతో యూజీసీ స్టేటస్‌కు దూరంగా ఉన్నాయి. ఈ కళాశాలలను అభివృద్ధి చేస్తూనే మిగిలిన 109 కళాశాలల్లో ఏప్రిల్ నాటికి వంద కళాశాలలకు న్యాక్ గుర్తింపు తీసుకొచ్చేలా ‘కళాశాల విద్య’ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘ఇప్పటికే 61 కళాశాలలకు న్యాక్ గ్రేడ్ సాధించాం. మరో రెండు కళాశాలలకు రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా 13 కళాశాలలు న్యాక్ బృందం పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాయి. 14 కళాశాలలు న్యాక్ గుర్తింపు కోసం సమగ్ర సమాచార నివేదికను రూపొందించాయి. 17 కళాశాలలు సమాచారాన్ని తయారు చేస్తున్నాయి. ప్రతి కళాశాలను మా అకడమిక్ ఆఫీసర్లతో కూడిన టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. డేటాను స్వయంగా విశ్లేషిస్తూ న్యాక్ బృందం అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్తపడుతోంది’ అంటూ ఓఎస్డీ డాక్టర్ కె.విజయ్ బాబు చెప్పారు. వీటితో పాటు 56 ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో 18 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉండగా.. త్వరలోనే మిగిలిన వాటికీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. -
వేతన బకాయిల్లేవు.. రెన్యూవల్ లేదు
సాక్షి ప్రతినిధి నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. గతేడాది పనిచేసిన కాలపు బకాయిలను ఇవ్వకపోవడంతోపాటు ఇప్పుడు కాలేజీలను తెరిచినా విధుల్లోకి తీసుకోకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను ఇటీవల ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. డిగ్రీ అధ్యాపకుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు సబెక్టు బోధించే అధ్యాపకులు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అవసరం ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 1,200 మంది రెగ్యులర్ లెక్చరర్లు, 830 కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వారు కాకుండా అదనంగా మరో 1,940 మంది లెక్చరర్ల అవసరం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగిస్తున్నారు. 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల అవసరం ఉన్నా గత ఏడాది 719 మంది గెస్ట్ లెక్చరర్లనే ఆన్లైన్ బోధన కోసం తీసుకున్నారు. వారికి ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల చొప్పున నెలకు రూ.21,600 గరిష్టంగా చెల్లిస్తున్నారు. గతేడాది రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లతోపాటు గెస్ట్ లెక్చరర్లు కూడా ఆన్లైన్ బోధన చేపట్టారు. వారికి ఆ పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటివరకూ అందలేదు. అప్పులు చేసి పూట వెళ్లదీయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నెల రోజులు అవుతున్నా.. ఈ విద్యా సంవత్సరంలో గత నెలలో వివిధ యూనివర్సిటీల పరిధిలో తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా గెస్ట్ లెక్చరర్లను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఉపాధి ఉంటుందా? లేదా? అన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాల వారీగా గతేడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల సంఖ్య ఇలా.. ఆదిలాబాద్–3, భద్రాద్రి కొత్తగూడెం–17, హైదరాబాద్–133, జగిత్యాల–10, జనగామ–6, జయశంకర్ భూపాలపల్లి–8, జోగులాంబ గద్వాల–32, కామారెడ్డి–29, కరీంనగర్–27, ఖమ్మం–18, కొమురంభీం ఆసిఫాబాద్–6, మహబూబాబాద్–14, మహబూబ్‌నగర్–51, మంచిర్యాల–11, మెదక్–17, మేడ్చల్–14, ములుగు–6, నాగర్‌కర్నూలు–32, నల్లగొండ–46, నారాయణపేట్–17, నిర్మల్–5, నిజామాబాద్ –31, పెద్దపల్లి–10, రాజన్న సిరిసిల్ల–3, రంగారెడ్డి–16, సంగారెడ్డి–45, సిద్దిపేట–51, సూర్యాపేట–4, వికారాబాద్–16, వనపర్తి–20, వరంగల్ రూరల్–3, వరంగల్ అర్బన్–13, యాదాద్రి భువనగిరి–5 -
గెస్ట్ లెక్చరర్లపై చిన్నచూపు
సాక్షి, కామారెడ్డి : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను ఆహ్వానించింది. గతేడాది ఆగస్టు 14న విధుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి గెస్ట్ లెక్చరర్లుగా విధుల్లో చేరిన వారు రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. నిరుద్యోగులుగా ఉన్న తమకు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు దొరికాయని సంబరపడ్డారు. 2018–19 విద్యా సంవత్సరం ముగిసిపోవడమే కాకుండా 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ వారికి వేతనాలు మంజూరు కాలేదు. జీతాలు రాకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 30 మంది... కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 30 మంది గెస్ట్ లెక్చరర్లుగా ఉద్యోగాల్లో చేరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తే ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పద్ధతిని తీసుకువచ్చింది. గెస్ట్ లెక్చరర్లకు వారి పని గంటలను బట్టి వేతనాలను చెల్లించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఒక్కో గెస్ట్ లెక్చరర్‌కు నెలకు రూ.21,600 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గెస్ట్ లెక్చరర్ నెలలో 72 గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సెలవు దినాలకు వేతనం లేదు. ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచి గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం చేస్తుకున్న ఒప్పందం ప్రకారం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని 30 మంది గెస్ట్ లెక్చరర్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు మంజూరు చేయాలి గెస్ట్ లెక్చరర్ల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి. రెగ్యులర్, కాం ట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వం సూచించిన ప్రకారం విధులకు హాజరవుతున్నాం. పాఠాలు భోదిస్తున్నాం. జీతాలు రాకపోవడంతో చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయం గమనించాలి. - రాంప్రసాద్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
స్వీపర్‌పై చెయ్యి చేసుకున్న ప్రిన్సిపాల్
కర్నూలు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీపర్‌పై ప్రిన్సిపాల్ పీవీ హరిబాబు చేయి చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో 1994 నుంచి స్వీపర్‌గా మాదం శెట్టి చిన్న వెంకమ్మ విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి కళాశాలలో వేసిన లైట్లు ఎందుకు ఆర్పలేదని ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నుంచి వెళ్లిపోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించినట్లు ఆమె వాపోయారు. అయితే వెంకమ్మ తమకు మౌఖికంగా ఫిర్యాదు చేశారని, లిఖిత పూర్వకంగా చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఓబులేసు తెలిపారు. ఇదిలా ఉండగా కేసు పెట్టకుండా కొందను వ్యక్తులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ పోస్టర్
ఆవిష్కరించిన మంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రూపొందించిన పోస్టర్‌ను గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, అధ్యాపకులు, ప్రోత్సాహకాలను పేర్కొంటూ దీనిని రూపొం దించారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభమవడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారం చేపట్టినట్లు టీజీసీజీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవయ్య, సురేందర్‌రెడ్డి తెలిపారు. -
నెలాఖరులోపు 20 నోటిఫికేషన్లు..
2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ ఈ నెలాఖరులోగా మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్– 1, గ్రూప్– 3 పోస్టులతో పాటు మరికొన్ని ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువరించనుంది. మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్– 3లో 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు, గ్రూప్–3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక గ్రూప్– 1 కింద 94 పోస్టులకు కూడా ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 504 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే డిప్యూటీ సర్వేయర్లు 259, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 100, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 49, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 77, మెడికల్ ఆఫీసర్లు 53 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. -
డిగ్రీ పరీక్ష
పరీక్ష సెంటర్ సూచికల డిస్ప్లేతో సమస్య ఒకేసారి వచ్చిన విద్యార్థులు ఆత్రుతలో పరస్పరం తోపులాట కొందరికి స్వలంగా గాయాలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష సౌకర్యాలు లేక ఇబ్బందులు పలమనేరు/యూనివర్సిటీక్యాంపస్: పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం ఎస్వీ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సర తొలి సెమిస్టర్ పరీక్షలు గందరగోళంగా మారారుు. హాల్టిక్కెట్ల కాపీలను కళాశాల సిబ్బంది ఒకేచోట అది కూడా కిందిభాగంలో అంటించారు. దీంతో విద్యార్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం మీరిపోవడంతో విద్యార్థులను ఎక్కడబడితే అక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రారుుంచారు. నోటీస్‌బోర్డులు పెట్టకపోవడమే కారణం... పలమనేరులోని ఎనిమిది ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలం బెరైడ్డిపల్లె, వీకోటలకు చెందిన చెందిన 12 కళాశాల 2300 మంది విద్యార్థులకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా ఎస్వీయూ నిర్ణరుుంచిం ది. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకోసం 80 గదులు ఏర్పాటు చేశారు. ఏ గదిలో ఎవరికి పడిందో తెలుసుకునేందుకు హాల్ టికెట్ల నెంబర్లను ఒకేచోట.. అది కూడా విద్యార్థులకు కనిపించకుండా అంటించారు. బుధవారం ఉదయం 8-45కు లోనికి పంపగానే వారంతా తమ సెంటర్లను చూ సేం దుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎక్కువ మంది విద్యార్థినులు కావడంతో గాజులు పగిలినవారు, ఒకరిపై మరొకరుపడి, దుస్తులు చిరిగినవారు ఉన్నారు. ఇంకొందరు గాయపడ్డారు. తొక్కిసలాట జరుగుతుంటే ఒక కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. విద్యార్థులు, తల్లిదండ్రులపట్ల అతడు అతిగా ప్రవర్తించడం మరింత గందరగోళానికి కారణమైంది. ఇక్కడి డిగ్రీ కళాశాలలోని గదుల్లో 300మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది. 2300 మందితో ఎలా పరీక్ష రా రుుంచాలో అధ్యాపకులకు అర్థం కాలేదు. కళాశాల వరండాలు, ల్యాబ్, లైబ్రరీ, స్టోర్‌రూమ్, చివరకు అధ్యాపకుల విశ్రాం తిగదితోపాటు కొంత ఖాళీస్థలం లోనూ కూర్చోబెట్టారు. గందరగోళానికి కారణమేమిటంటే... ఎస్వీ యూనివర్సిటీ అనుబంధానికి సంబంధించి ఈ యేడాది యూనివర్సిటీ అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మే నెలలోనే అనుబంధానికి దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్‌లో తనిఖీలు నిర్వహించి సెప్టెంబర్‌లో అనుబంధం ఇచ్చారు. పాత పద్ధతికి అలవాటు పడిన కొన్ని కళాశాలలు అనుబంధానికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరి కొన్ని ’ రిటర్న్ ఆఫ్ మెట్రిక్లేట్స్’ యూనివర్సిటీకి సమర్పించలేదు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో అనుబంధం లేని కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. సాఫ్ట్వేర్ సంస్థ తప్పిదాల వల్ల అనుబంధం లేని విద్యార్థులు సైతం పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చిపరీక్షలు రారుుంచాలి. కొన్ని కళాశాలలు తప్పును సరిదిద్దుకున్నారుు. రెండు కళాశాలలు మినహా అన్ని కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చారు. బి.కొత్త కోటలోని రెండు ప్రయివేట్ కళాశాలలు మాత్రం అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు. ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఈ రెండు కళాశాలల్లోని విద్యార్థులు బుధవారం పరీక్ష రాయలేక పోయారు. దీంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్వీయూలో ఆందోళన చేశారు. రిజిస్ట్రార్ చాం బర్ ముట్టడించారు. కళాశాలల యాజమాన్యాలతో ఎస్వీయూ అధికారులు చర్చిం చారు. ఆ రెండు కళాశాలలకు లక్ష రూపాలయల జరిమానాతో పాటు, 40 వేల రూపాయల అఫిలియేషన్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. గురువారం నుంచి జరిగే పరీక్షలకు అనుమతించారు. -
2,340 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కసరత్తు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన కళాశాల విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,340 లెక్చరర్ పోస్టుల భర్తీకి కళాశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దీంతోపాటు కొత్త పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే... ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో మంజూరైన 2,761 పోస్టుల్లో 1,105 ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక కొత్త డిగ్రీ కాలేజీలకు 1,235 లెక్చరర్లు అవసరమంటూ ప్రతిపాదనలు పంపించింది. చాయిస్ బేస్డ్ క్రెడిటస్ సిస్టమ్‌లో సెమిస్టర్ విధానం అమలు చేస్తున్నందున ప్రతి 90 రోజులకు ఒకసారి పరీక్షలుంటాయి. కాబట్టి పక్కాగా విద్యా బోధన అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోస్టులు మంజూరు చేయాలని శాఖ కోరింది. మరోవైపు 802 కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్పైనా కసరత్తు చేస్తోంది. దీంతోపాటు 400 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించడం ద్వారా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవిపోగా మిగిలిన పోస్టులను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా (25 శాతమే) భర్తీ చేసే ఆలోచనలు చేస్తోంది. ఆన్లైన్లో మూల్యాంకనం... రాష్ట్రంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనంలో సమూల సంస్కరణలు తీసుకువచ్చేందుకు కళాశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది అధ్యాపకులు సరిగ్గా పేపర్లు దిద్దడం లేదన్న విమర్శలున్నాయి. డిస్క్రి ప్టివ్ పరీక్షలు కావడంతో ఒక్కో లెక్చరర్ ఒక్కో విధంగా మార్కులు వేస్తున్నారు. పైగా కాంట్రాక్టు లెక్చరర్లు కొంతమందికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన లేకపోవడం, కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సీనియర్ లెక్చరర్లను వాల్యుయేషన్‌కు పంపించకపోవడం వంటి కారణాల వల్ల మార్కుల విధానంలో తేడాలు వస్తున్నట్లు శాఖ గుర్తించింది. ఈ క్రమంలో ఇలాంటి సమస్యలకు ఆన్లైన్ విధానంతోనే చెక్ పెట్టవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్ పేర్కొన్నారు. ఈ విధానంలో విద్యార్థుల జవాబు పత్రాలను స్కాన్ చేసి ఒకే స్థాయి కెపాసిటీ కలిగిన సీనియర్ లెక్చరర్లకు మాత్రమే పేపర్లను పంపించి ఆన్లైన్లో మూల్యాంకనం చేయించాలని భావిస్తున్నారు. తద్వారా మూల్యాంకనం కోసం వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో తనకు పంపించిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, మార్కుల వివరాలను అప్లోడ్ చేసే వీలుంటుంది. కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ విధానంపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు శాఖ చర్యలు చేపడుతోంది. ఆన్లైన్ వాల్యుయేషన్ విధానాన్ని మొదటిగా అమలు చేసేందుకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. -
ఆ.. ఎలుకలే కదా!
కేవీఆర్‌లో పందికొక్కులు రెండు రోజుల్లో తొమ్మిదిమంది ఆసుపత్రిపాలు పాములు, ఎలుకలతోవిద్యార్థుల అవస్థలు హాస్టల్ చుట్టూఅపరిశుభ్ర వాతావరణం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నఅధికారులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ హాస్టల్ వసతి ఉండడంతో మహిళల విద్యాభ్యాసానికి అనుకూలంగా భావిస్తారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకునే వీలుంది. ఈ కారనంగా గ్రామీణ విద్యార్థినులు దాదాపుగా ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. 2015-16 విద్యా సంవత్సరంలో 1,100 మంది విద్యార్థినులు ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అయితే హాస్టల్లో అధికారులు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాన్‌టీచింగ్ స్టాఫ్ ఇష్టారాజ్యం సాగుతోంది. అసలే హాస్టల్ భవనం పాతది కావడం.. దీనికి తోడు పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఎలుకలు, పందికొక్కులు, పాముల సంచారం అధికమైంది. ముఖ్యంగా ఎలుకల బెడద అధికమవడంతో విద్యార్థినులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. మూడు రోజుల క్రితం ఎలుకలు కొరకడంతో 9 మంది విద్యార్థినులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. బుధవారం 5గురు, గురువారం నలుగురు ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో ఎలుకల సమస్యతో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ప్రిపరేషన్ హాలిడేస్ పేరిట సొంతూళ్లకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలుకలు ఎవరిళ్లలో లేవంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా విద్యార్థినులే హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లేదనే సాకులతో సరిపుచ్చుతున్నారు. గోడ కూలి ఏడాది హాస్టల్ భవనాల సమీపంలోని కేసీ కెనాల్ వైపున్న గోడ కూలి ఏడాది గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయించేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాత్రిళ్లు బయటి వ్యక్తులు లోపలికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది. హాస్టల్‌కు సమీపంలోనే సారా తయారీ ప్రాంతమైన బంగారుపేట ఉండటంతో మందుబాబుల సంచారం ఈ ప్రాంతంలో అధికంగా ఉంటోంది. అయినప్పటికీ విద్యార్థినుల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. ఎవరింట్లో ఎలుకలు ఉండవు ఎలుకలు ఎవరింట్లో ఉండవు. అందరిండ్లలో ఉంటాయి. హాస్టల్లో కూడా అంతే. విద్యార్థినులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలేదు. అందువల్లే ఎలుకల సంచారం అధికమైంది. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం నా దృష్టికి రాలేదు - పురుషోత్తమరెడ్డి, ప్రిన్సిపాల్ -
ఆడిపాడిన పల్లెసొగసు..
-
డిగ్రీ కాలేజీకి నిధులిచ్చేందుకు సీఎం హామీ
- కాలేజీ ఆస్తుల పత్రాలు అప్పగింత - కమిటీ సభ్యుల రాజీనామా - జేఏసీ కన్వీనర్ జగన్నాథం వెల్లడి కామారెడ్డి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రహరీ నిర్మాణానికి నిధులిచ్చేందుకు సీఎం అంగీకరించారని జేఏసీ నేతలు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తూ కాలేజీ కమిటీ చేసిన తీర్మాన ప్రతులను ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసి అప్పగించారు. ఈ మేరకు జేఏసీ డివిజన్ కన్వీనర్ జి.జగన్నాథం‘సాక్షి’కి తెలి పిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కాలేజీ కమిటీ ఇచ్చిన రాజీనామా పత్రాలను అప్పగించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ స్థలానికి ప్రహరీ నిర్మాణానికి అవసరమై న నిధులు ఇస్తానని, వెంటనే సర్వే చేయించి అంచనాలు రూపొందించి తనకు అప్పగించాలని సీఎం ప్రభుత్వ విప్ గోవర్ధన్‌కు తెలిపారన్నారు. ప్రభుత్వ విప్ గోవర్ధన్‌తోపాటు డీసీఎంఎస్ చైర్మన్ ఎంకే ముజీబొద్దిన్, టీఆర్ఎస్ నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్రావ్, జేఏసీ నేతలు డాక్టర్ వి.శంకర్, మంద వెంకట్రాంరెడ్డి, వీఎల్ నర్సింహారెడ్డి, క్యాతం సిద్దరాములు తదితరులు సీఎంను కలిశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. -
రండి బాబూ..రండి!
మంచిర్యాల సిటీ : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 11 ఉన్నాయి. మంచిర్యాల, నిర్మ ల్, ఆదిలాబాద్‌లో మహిళా కళాశాలలు ఉండగా మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, భైంసా పట్టణాల్లో పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 50 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలోనే సీట్లు పూర్తిస్థాయిలో నిండాయి. అదనపు సీట్ల కోసం ఆ కళాశాల ప్రిన్సిపాల్ యునివర్సిటీని కోరడం విశేషం. లక్సెట్టిపేటలో ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండటం తో ప్రభుత్వ కళాశాలలో ఎవరు చేరడం లేదు. చెన్నూర్, నిర్మల్, ఆదిలాబాద్, భైంసా కళాశాలల్లో కొంత మేరకు పరవాలేదు. ఇక ప్రైవేట డిగ్రీ కళాశాల యాజ మాన్యాలు ప్రైవేటు జూనియర్ కళాశాలల మద్దతు, ప్రైవేటు పీఆర్వోలను నియమించుకోవడం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, బ్యాగులు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, బోధన రు సుం వస్తుంది కాబట్టి మా కళాశాలలో కేవలం బదిలీ సర్టిఫికెట్టు ఇస్తే సరిపోతుందని భరోసా ఇస్తున్నారు. విచ్చలవిడిగా అనుమతులు యూనివర్సిటీ నుంచి విచ్చలవిడిగా ప్రైవే టు కళాశాలలకు అనుమతులు రావడంతోనే ప్రభుత్వ కళాశాలల అడ్మిషన్లకు గం డి పడుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బోధన రుసుంతో లాభాలు ఉండటంతో ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు కలిపి ఒక్కో కళాశాలకు నెలకు సుమారు రూ.12 నుంచి 15 లక్షల వరకు వ్యయం అవుతుంది. ప్రిన్సిపాల్ వేతనం రూ.ఒక లక్షకు పైన ఉన్న కళాశాలలు ఉన్నాయి. అంటే జిల్లాలోని కళాశాలల వ్యయం నెల కు సుమారు రూ.1.50 కోట్లు అంటే ఏడాదికి 18 కోట్లు అవుతుంది. బోధన రుసుంలో ఎంత తేడా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుం మంజూరు చేస్తుంది. ఏటా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చవివే విద్యార్థులు ప్రథమ 16 వేలు, ద్వితీయ 13 వేలు, తృతీయ 11వేల మంది ఉంటారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు 5 వేలకు మించరు. 35 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వారే. ప్రభుత్వ కళాశాలలో ఆర్ట్స్ చదివే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు బోధన రుసుం రూ.35.25 లక్షలు, సైన్స్ చదివే 2 వేల మందికి మూడేళ్లకు రూ.25.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లో ఆర్ట్స్ చదివే 20వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.9 కోట్లు, సైన్స్ చదివే 10 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.7.50 కోట్లు, బీకాం(కంప్యూటర్) చది వే 3 వేల మంది విద్యార్థులకు మూడేళ్లకు రూ.2.40 కోట్లు, బీఎస్సీ(కంప్యూటర్) చదివే 2 వేల మందికి రూ.2.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ కళాశాల లకు రుసుం రూ.60.75 లక్షలు చెల్లిస్తుండగా, ప్రైవే టు కళాశాలలకు రూ.21.10 కోట్లు చెల్లిస్తున్నారు. -
‘కిక్కు’ లక్కు కొందరికే...!
లాటరీ తీసిన ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి 349 మందికి లెసైన్సుల కేటాయింపు ముగిసిన దుకాణాల కేటాయింపు జూలై 1 నుంచి కొత్త పాలసీ అమలు తమ్ముళ్ల కనుసైగలో సిండికేట్ల ఏర్పాటు చిత్తూరు (అర్బన్): మద్యం అదృష్టం కొందరినే వరించింది. మద్యం దుకాణాల నిర్వహణ కోసం శనివారం నిర్వహించిన లాటరీలో 349 మందికి లెసైన్సులు వచ్చాయి. అన్ని సజావుగా సాగడంతో జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల కోసం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన లాటరీ డిప్‌ను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డీవీఎన్.ప్రసాద్, తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, శేషారావు టెండర్ల ఖరారు విధానాన్ని పర్యవేక్షించారు. 2014-15 సంవత్సరానికి చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 2112 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.25 వేలను ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలనే నిబంధన ఉండడంతో ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే రూ.5.20 కోట్ల ఆదాయం లభించింది. ఇక 2112 మంది దరఖాస్తులు వేసినప్పటికీ 349 మందినే అదృష్టం వరించింది. దీంతో మిగిలిన 1763 మందికి నిరాశ తప్పలేదు. ఎలాంటి కష్టం లేకుండా వీరి నుంచి ప్రభుత్వానికి రూ.4.40 కోట్ల ఆదాయం లభించడం విశేషం. సిండికేట్లలో టీడీపీ నేతలు మద్యం దుకాణాల టెండర్ల నిర్వహణ ప్రక్రియ పూర్తవడం తో జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. ఈ విధానంలో బాటిళ్లపై స్కాన్ అండ్ ట్రేస్ విధానం ఉండడంతో బెల్టు షాపుల్లో దొరికిన బాటిళ్ల ఆధారంగా దుకాణాల లెసైన్సులు రద్దు చేస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం వరకు లెసైన్సు ఫీజులు కూడా పెరిగాయి. ప్రభుత్వ విధివిధానాలు కచ్చితంగా అమలు చేస్తే దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు ఒక్క రూపాయి లాభం రాకపోగా చేతిలో ఉన్న డబ్బును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో దుకాణాలు కైవశం చేసుకున్న వ్యక్తులు సిండికేట్‌గా మారి ఎంఆర్పీకన్నా ఎక్కువకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు మద్యం సిండికేట్ నాయకులుగా ఏర్పాటై దుకాణాల నిర్వాహకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. వచ్చింది మా ప్రభుత్వమే మీకొచ్చిన ఢోకా ఏమీలేదంటూ టెండరుదార్లకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం ఏ రీతిన సాగుతుందో వేచి చూడాల్సి ఉంది. త్వరలో మరో నోటిఫికేషన్ మరోవైపు జిల్లాలోని 109 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడకపోవడంతో త్వరలోనే వీటికి నోటిఫికేషన్ జారీ కానుంది. పెరిగిన లెసైన్సు ఫీజుల వల్లే ఈ దుకాణాల కు దరఖాస్తులు పడలేదు. రెండోసారి ఇచ్చే నోటిఫికేషన్లో ఎవరూ ముందుకు రాకపోతే దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని బార్ల నిర్వాహకులు సైతం ఈ నెల 30లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. -
స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిన ఈవీఎంలు
16న తేలనున్నఅభ్యర్థుల భవితవ్యం ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు బుధవారం ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఈవీఎంలు సెయింట్ జోసఫ్, మౌంట్‌ఫోర్ట్ హైస్కూళ్లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఖమ్మం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. భారీ బందోబస్తు మధ్య ఆయా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. మే 16న కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు వరకు ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధులు నిర్వహించనున్నారు. 16న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ఉన్నాయి. వీరి భవితవ్యం తేలాలంటే ఈనెల 16 వరకు ఆగాల్సిందే. ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటని బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. -
2/3000
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ సమస్యను తల్లిదండ్రులకు తప్ప మరొకరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు ఈ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థినులెవరైనా ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే ఇక్కడ చదువుకోండి.. లేదంటే టీసీ తీసుకెళ్లండి అని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ దుస్థితిపై ఇటు విద్యా శాఖ అధికారులు కానీ, అటు విద్యార్థి సంఘాల నేతలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కమలానగర్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సుమారు 850 మంది విద్యార్థినులు చదువుతున్నారు. నాలుగు అంతస్తుల బిల్డింగులో ఈ కళాశాల నడుపుతున్నారు. ఇంతమంది విద్యార్థినులకు ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. నాలుగు అంతస్తుల్లోని అమ్మాయిలు ఈ ఒక్క మరుగుదొడ్డికే వెళ్లాల్సి వస్తోంది. అనంతపురం ఆర్ట్స్ కళాశాల.. రాష్ట్రంలోనే ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ శివారెడ్డి, ఐఏఎస్ అధికారి సంజీవరెడ్డి తదితరులందరూ ఈ కళాశాలలో చదివిన వారే. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఈ కళాశాలకు ఇంతటి ఘన చరిత్ర ఉంది. ప్రస్తుతం కళాశాలలో దాదాపు 7500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4500 మంది విద్యార్థులు, మూడు వేల మంది విద్యార్థినులు ఉన్నారు. వీరందిరికీ ఉన్న మరుగుదొడ్లు నాలుగంటే నాలుగు. వీటిలో విద్యార్థినులకు కేటాయించింది రెండు మాత్రమే. ఇవి ఎంతమాత్రం సరిపోతాయో.. విద్యార్థినులు ఎలా అవస్థలు పడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : మరుగుదొడ్ల కొరతతో కళాశాల విద్యార్థినుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 71 ఉన్నాయి. ఇందులో 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 58 ప్రైవేట్ కాలేజీలున్నాయి. వీటిలో సుమారు 73,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సోషియల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలు 170 ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 31,752 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,572 మంది ఉన్నారు. ఆవైపు వెళ్లాలంటే కంపు ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు, బాత్రూములు లేవు. ఉన్నవాటిని శుభ్రం చేసే దిక్కేలేదు. ఆవైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దుర్వాసన భరించలేకపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఎవరితో చెప్పుకోలేక మథనపడుతున్నారు. మగ పిల్లలైతే బహిరంగ ప్రదేశాలకో.. మరోచోటుకో వెళ్తారు. అమ్మాయిలు ఎక్కడికి పోతారు? అటు అధ్యాపకులకు చెప్పుకోలేక ఇటు సమస్యను అధిగమించలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఇతర సౌకర్యాలు (తరగతి గదులు, ఫర్నీచరు, కంప్యూటరు) కల్పిస్తున్నారు కానీ అతి ముఖ్యమైన మరుగుదొడ్ల నిర్మాణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. 7500 మంది విద్యార్థులున్న ఆర్ట్స్ కళాశాలలో కేవలం నాలుగు మరుగుదొడ్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ కళాశాలల్లో మరీ ఇబ్బందులు చాలా ప్రైవేట్ కళాశాలలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వ్యాపార సముదాయాల్లో కళాశాలలు నడుపుతుండడంతో ఆ భవనాల్లో మరుగుదొడ్లు, బాత్రూమ్లు తగినన్ని లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో ఇంటర్వెల్ సమయంలో వందలాది మంది విద్యార్థినులు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. దీనికితోడు నీటి వసతి లేకపోవడంతో భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. ఈ కళాశాలల్లో మరుగుదొడ్లే లేవు జిల్లాలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరుగుదొడ్లే లేవు. పెనుకొండ, అమడగూరు, చిలమత్తూరు, రామగిరి కళాశాలల్లో మరుగుదొడ్లు లేవని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే వీటిలో పెనుకొండ, చిలమత్తూరు జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తక్కిన మూడు కళాశాలలకు ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు.