2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ ఈ నెలాఖరులోగా మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్– 1, గ్రూప్– 3 పోస్టులతో పాటు మరికొన్ని ఇతర పోస్టులకు కూడా నోటిఫికేషన్లు వెలువరించనుంది. మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్– 3లో 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు, గ్రూప్–3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక గ్రూప్– 1 కింద 94 పోస్టులకు కూడా ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 504 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే డిప్యూటీ సర్వేయర్లు 259, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 100, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 49, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 77, మెడికల్ ఆఫీసర్లు 53 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు.
నెలాఖరులోపు 20 నోటిఫికేషన్లు..
Published Wed, Dec 21 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
Advertisement
Advertisement