డిగ్రీ పరీక్ష
పరీక్ష సెంటర్ సూచికల డిస్‌ప్లేతో సమస్య
ఒకేసారి వచ్చిన విద్యార్థులు
ఆత్రుతలో పరస్పరం తోపులాట
కొందరికి స్వలంగా గాయాలు
ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష
సౌకర్యాలు లేక ఇబ్బందులు
పలమనేరు/యూనివర్సిటీక్యాంపస్: పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం ఎస్వీ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సర తొలి సెమిస్టర్ పరీక్షలు గందరగోళంగా మారారుు. హాల్‌టిక్కెట్ల కాపీలను కళాశాల సిబ్బంది ఒకేచోట అది కూడా కిందిభాగంలో అంటించారు. దీంతో విద్యార్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం మీరిపోవడంతో విద్యార్థులను ఎక్కడబడితే అక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రారుుంచారు.
నోటీస్‌బోర్డులు పెట్టకపోవడమే కారణం...
పలమనేరులోని ఎనిమిది ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలం బెరైడ్డిపల్లె, వీకోటలకు చెందిన చెందిన 12 కళాశాల 2300 మంది విద్యార్థులకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా ఎస్వీయూ నిర్ణరుుంచిం ది. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకోసం 80 గదులు ఏర్పాటు చేశారు. ఏ గదిలో ఎవరికి పడిందో తెలుసుకునేందుకు హాల్ టికెట్ల నెంబర్లను ఒకేచోట.. అది కూడా విద్యార్థులకు కనిపించకుండా అంటించారు. బుధవారం ఉదయం 8-45కు లోనికి పంపగానే వారంతా తమ సెంటర్లను చూ సేం దుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎక్కువ మంది విద్యార్థినులు కావడంతో గాజులు పగిలినవారు, ఒకరిపై మరొకరుపడి, దుస్తులు చిరిగినవారు ఉన్నారు. ఇంకొందరు గాయపడ్డారు. తొక్కిసలాట జరుగుతుంటే ఒక కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. విద్యార్థులు, తల్లిదండ్రులపట్ల అతడు అతిగా ప్రవర్తించడం మరింత గందరగోళానికి కారణమైంది.
ఇక్కడి డిగ్రీ కళాశాలలోని గదుల్లో 300మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది. 2300 మందితో ఎలా పరీక్ష రా రుుంచాలో అధ్యాపకులకు అర్థం కాలేదు. కళాశాల వరండాలు, ల్యాబ్, లైబ్రరీ, స్టోర్‌రూమ్, చివరకు అధ్యాపకుల విశ్రాం తిగదితోపాటు కొంత ఖాళీస్థలం లోనూ కూర్చోబెట్టారు.
గందరగోళానికి కారణమేమిటంటే...
ఎస్వీ యూనివర్సిటీ అనుబంధానికి సంబంధించి ఈ యేడాది యూనివర్సిటీ అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మే నెలలోనే అనుబంధానికి దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్‌లో తనిఖీలు నిర్వహించి సెప్టెంబర్‌లో అనుబంధం ఇచ్చారు. పాత పద్ధతికి అలవాటు పడిన కొన్ని కళాశాలలు అనుబంధానికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరి కొన్ని ’ రిటర్న్ ఆఫ్ మెట్రిక్‌లేట్స్’ యూనివర్సిటీకి సమర్పించలేదు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో అనుబంధం లేని కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. సాఫ్ట్‌వేర్ సంస్థ తప్పిదాల వల్ల అనుబంధం లేని విద్యార్థులు సైతం పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చిపరీక్షలు రారుుంచాలి. కొన్ని కళాశాలలు తప్పును సరిదిద్దుకున్నారుు. రెండు కళాశాలలు మినహా అన్ని కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చారు. బి.కొత్త కోటలోని రెండు ప్రయివేట్ కళాశాలలు మాత్రం అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు.
ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఈ రెండు కళాశాలల్లోని విద్యార్థులు బుధవారం పరీక్ష రాయలేక పోయారు. దీంతో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్వీయూలో ఆందోళన చేశారు. రిజిస్ట్రార్ చాం బర్ ముట్టడించారు. కళాశాలల యాజమాన్యాలతో ఎస్వీయూ అధికారులు చర్చిం చారు. ఆ రెండు కళాశాలలకు లక్ష రూపాలయల జరిమానాతో పాటు, 40 వేల రూపాయల అఫిలియేషన్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. గురువారం నుంచి జరిగే పరీక్షలకు అనుమతించారు.