Degree examination
-
ప్రాణం తీసిన ‘డీబార్’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఓ విద్యార్థిని డీబార్ చేయడం.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం అచ్చంపేటకు చెందిన పూజారి ఆంజనేయులు (18) మక్తల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరికల్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో మంగళవారం మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరైన ఆంజనేయులు.. చూచిరాతలకు పాల్పడుతున్నాడని స్క్వాడ్ అఽధికారులు డీబార్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. స్వగ్రామానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ విచారణకు ఆదేశించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్‌కుమార్, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పొలిటికల్ సైన్స్ హెచ్ఓడీ కుమారస్వామితో తనిఖీలు చేపట్టారు. త్వరలో విచారణకు సంబంధించిన నివేదికను పీయూ వీసీకి అందించనున్నారు. ఎగ్జామినర్ సస్పెన్షన్.. విద్యార్థి పరీక్ష రాసిన కేంద్రం ఎగ్జామినర్‌ను సస్పెన్షన్ చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్స్‌కు నోటీసులు ఇస్తున్నట్లు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటనలో పేర్కొన్నారు. సదరు విద్యార్థి చీటీలు పరీక్ష కేంద్రంలోకి తీసుకొచ్చే క్రమంలో అధికారులు ఏం చేశారనే అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారు విధులు సరిగ్గా నిర్వహించకపోవడంతోనే విద్యార్థి పరీక్ష కేంద్రంలోకి చీటీలు తీసుకొచ్చి రాస్తూ పీయూ నుంచి వెళ్లిన స్క్వాడ్ అధికారులకు దొరికిపోయినట్లు తెలిసింది. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి.. విద్యార్థి ఆంజనేయులు కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజకు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా పీయూ జేఏసీ చైర్మన్ బత్తిని రాము మాట్లాడుతూ స్క్వాడ్ అధికారులు తీసుకునే చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, విద్యార్థులను ఇష్టారీతిగా డీబార్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్ష కేంద్రం మార్చాలని ఆందోళన.. మరికల్: మరికల్లో ఏర్పాటు చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష కేంద్రాన్ని మార్చాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పీయూ ఏఎస్డీ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్డీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు పరీక్ష కేంద్రాన్ని మార్చడం కుదరదని, వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి పరీక్ష కేంద్రాన్ని మార్చే ఆలోచన చేస్తామని తెలిపారు. పరీక్ష తప్పితే మరో ఏడాది రాసుకునేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులెవరూ ప్రాణాలను తీసుకోరాదని సూచించారు. నోటీసులు ఇస్తాం... మరికల్ పరీక్ష కేంద్రంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం. సంబంధిత పరీక్ష కేంద్రంలోని ఎగ్జామినర్, సీఎస్‌లకు నోటీసులకు ఇవ్వనున్నం. భవిష్యత్‌లో వారికి పరీక్షల విధులు కేటాయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజ్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పీయూ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి విద్యార్థిని డీబార్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ విషయంపై వీసీతో పాటు అదికారులకు ఫిర్యాదు చేశాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – బత్తిని రాము, పీయూ జేఏసీ చైర్మన్ -
డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే
నల్లగొండ: నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష రాశారు. నల్లగొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో సోమవారం జరిగిన బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. -
అంతా చూచిరాతే..
నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బీఈడీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓపెన్ పీజీ, డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. శనివారం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలు చూచిరాతలను తలపిస్తు న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’బృందం శనివారం పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బృందం అక్కడి వెళ్లగానే పరీక్ష రాస్తున్న అభ్యర్థులు చిట్టీలు బయటపడేశారు. పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ ఏజెంట్లు విద్యార్థులకు చెప్పి గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రంలో ప్రవే శాలు ఇప్పిస్తున్నారు. పరీక్షకు హాజరైతే ఒక రేటు.. హాజరు కాకుంటే మరోరేటు అం టూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పరీక్షల ను ఉద్యోగులు ప్రమోషన్ల కోసం డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అవసర మున్నందున డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు రాస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ డంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు చాలామందికి రానున్నాయి. ఇటీవల మహబూబాబాద్ తహసీల్దార్ విజయ్‌కుమార్ తనిఖీలకు వెళ్లి ముగ్గురు అభ్యర్థులను డిబార్ చేశారు. -
డిగ్రీ పరీక్ష
పరీక్ష సెంటర్ సూచికల డిస్ప్లేతో సమస్య ఒకేసారి వచ్చిన విద్యార్థులు ఆత్రుతలో పరస్పరం తోపులాట కొందరికి స్వలంగా గాయాలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష సౌకర్యాలు లేక ఇబ్బందులు పలమనేరు/యూనివర్సిటీక్యాంపస్: పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం ఎస్వీ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సర తొలి సెమిస్టర్ పరీక్షలు గందరగోళంగా మారారుు. హాల్టిక్కెట్ల కాపీలను కళాశాల సిబ్బంది ఒకేచోట అది కూడా కిందిభాగంలో అంటించారు. దీంతో విద్యార్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం మీరిపోవడంతో విద్యార్థులను ఎక్కడబడితే అక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రారుుంచారు. నోటీస్‌బోర్డులు పెట్టకపోవడమే కారణం... పలమనేరులోని ఎనిమిది ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలం బెరైడ్డిపల్లె, వీకోటలకు చెందిన చెందిన 12 కళాశాల 2300 మంది విద్యార్థులకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రంగా ఎస్వీయూ నిర్ణరుుంచిం ది. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకోసం 80 గదులు ఏర్పాటు చేశారు. ఏ గదిలో ఎవరికి పడిందో తెలుసుకునేందుకు హాల్ టికెట్ల నెంబర్లను ఒకేచోట.. అది కూడా విద్యార్థులకు కనిపించకుండా అంటించారు. బుధవారం ఉదయం 8-45కు లోనికి పంపగానే వారంతా తమ సెంటర్లను చూ సేం దుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎక్కువ మంది విద్యార్థినులు కావడంతో గాజులు పగిలినవారు, ఒకరిపై మరొకరుపడి, దుస్తులు చిరిగినవారు ఉన్నారు. ఇంకొందరు గాయపడ్డారు. తొక్కిసలాట జరుగుతుంటే ఒక కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. విద్యార్థులు, తల్లిదండ్రులపట్ల అతడు అతిగా ప్రవర్తించడం మరింత గందరగోళానికి కారణమైంది. ఇక్కడి డిగ్రీ కళాశాలలోని గదుల్లో 300మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది. 2300 మందితో ఎలా పరీక్ష రా రుుంచాలో అధ్యాపకులకు అర్థం కాలేదు. కళాశాల వరండాలు, ల్యాబ్, లైబ్రరీ, స్టోర్‌రూమ్, చివరకు అధ్యాపకుల విశ్రాం తిగదితోపాటు కొంత ఖాళీస్థలం లోనూ కూర్చోబెట్టారు. గందరగోళానికి కారణమేమిటంటే... ఎస్వీ యూనివర్సిటీ అనుబంధానికి సంబంధించి ఈ యేడాది యూనివర్సిటీ అధికారులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మే నెలలోనే అనుబంధానికి దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్‌లో తనిఖీలు నిర్వహించి సెప్టెంబర్‌లో అనుబంధం ఇచ్చారు. పాత పద్ధతికి అలవాటు పడిన కొన్ని కళాశాలలు అనుబంధానికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. మరి కొన్ని ’ రిటర్న్ ఆఫ్ మెట్రిక్లేట్స్’ యూనివర్సిటీకి సమర్పించలేదు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో అనుబంధం లేని కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. సాఫ్ట్వేర్ సంస్థ తప్పిదాల వల్ల అనుబంధం లేని విద్యార్థులు సైతం పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చిపరీక్షలు రారుుంచాలి. కొన్ని కళాశాలలు తప్పును సరిదిద్దుకున్నారుు. రెండు కళాశాలలు మినహా అన్ని కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చారు. బి.కొత్త కోటలోని రెండు ప్రయివేట్ కళాశాలలు మాత్రం అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు. ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఈ రెండు కళాశాలల్లోని విద్యార్థులు బుధవారం పరీక్ష రాయలేక పోయారు. దీంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్వీయూలో ఆందోళన చేశారు. రిజిస్ట్రార్ చాం బర్ ముట్టడించారు. కళాశాలల యాజమాన్యాలతో ఎస్వీయూ అధికారులు చర్చిం చారు. ఆ రెండు కళాశాలలకు లక్ష రూపాలయల జరిమానాతో పాటు, 40 వేల రూపాయల అఫిలియేషన్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. గురువారం నుంచి జరిగే పరీక్షలకు అనుమతించారు.