హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ మహిళా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎంపీసీ గ్రూప్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాత్విక మంగళవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేకనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని తోటి విద్యార్థులు అంటున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.