ఆకట్టుకున్న యువజనోత్సవాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్ కళాశాలలో గురువారం జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ జోనల్ యువజనోత్సవాల్లో విద్యార్థలు సందడి చేశారు. రాజమహేంద్రవరం పరిధిలోని 15 కళాశాలల నుంచి 120 మంది విద్యార్థినులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పీవీ కృష్ణారావు విచ్చేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎన్‌ఎస్‌ఎస్ యువజనోత్సవాలు విద్యార్థుల్లో ఐక్యమత్యతను పెంచుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జంధ్యాల లలితభారతి మాట్లాడుతూ యువజనోత్సవాలు విద్యార్థుల్లో అంతరంగికంగా దాగిఉన్న ప్రతిభను వెలికితీస్తాయన్నారు. అనంతరం వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫోక్ డ్యాన్‌స, భరతనాట్యం, గ్రూప్‌డ్యాన్‌సలు, సోలోసాంగ్స్‌లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఆర్థికవిధానం, రూ.500, రూ.1000 నోట్ల రద్దు, స్వచ్ఛభారత్ వంటివాటిపై పోటీలు నిర్వహించారు. వీటిలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థినులు వకృ్తత్వం, వ్యాసరచన, పద్యరచన, క్విజ్, వాగ్వివాదం, సోలో శాస్రీ్తయనృత్యం, పోటీల్లో ఆదిత్య మహిళా కళాశాల విద్యార్థినులు, చిత్రకళ, జానపద నృత్యాలలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు, రంగోలి, ఏకపాత్రాభినయంలో ఎస్‌కేఆర్ కళాశాల విద్యార్థినులు, మిమిక్రీలో ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థినులు ప్రథమ బహమతులు సా«ధించాయి.ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎ.సుగుణ, డాక్టర్ వి.లక్ష్మి, డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ విజయలక్ష్మి, డీజీ.భవానీ వ్యవహరించారు.