
వేలూరు సీఎంసీకి కోటి తరలింపు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతి కాంగ్రెస్ పోరుసభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కోటి శరీరంలో 70 శాతం కాలిన గాయాలయ్యాయని తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఈ రోజు తిరుపతిలో కాంగ్రెస్ పోరుసభ ఆరంభమైన కాసేపటికే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. కోటికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరుకు తరలించాలని వైద్యులు సూచించారు.