తిరుపతి: కాంగ్రెస్ నేతలు తిరుపతిలో నిర్వహించిన పోరు సభలో ఆత్మహత్యాయత్నం చేసిన కోటి, అతడిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారు. కోటి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, మోదీలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ, టీడీపీల తీరువల్లే కోటి బలిదానానికి సిద్ధపడ్డాడని ఆయన చెప్పారు. తక్షణమే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్షకు సిద్ధపడ్డారని ఆయన చెప్పారు.
కోటి, శేషాద్రిలకు చెవిరెడ్డి పరామర్శ
Published Sat, Aug 8 2015 7:34 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement
Advertisement