seshadri
-
సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా బి. శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత జట్టు కూర్పుపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి తన తొలి ఎంపికగా ఇద్దరు సమర్థులైన అధికారులనే నియమించుకున్నారు. ఇద్దరు అధికారులూ ఆయా పదవుల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. 1999 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వి.శేషాద్రి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు రెవెన్యూ వ్యవహారాలు, భూ చట్టాలపై పట్టు ఉంది. 2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీల హోదాల్లో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేశారు. 2020 సెప్టెంబర్ నుంచి 2022 మే వరకు నాటి సీఎం కేసీఆర్‌కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టు అమలులో కీలకంగా వ్యవహరించారు. 2022 మే నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2009–12 మధ్య చిత్తూరు, రంగారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమితులైన శివధర్‌రెడ్డి ప్రస్తుతం రైల్వే, రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా వ్యవహరిస్తున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఎస్ఐబీలో డీఐజీగా, నల్లగొండ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పలు కీలక పోస్టింగ్‌లలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పోలీస్‌శాఖలో శివధర్‌రెడ్డికి పేరు ఉంది. ఆయనకు రేవంత్‌రెడ్డి సర్కార్ నిఘా విభాగాధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. -
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
కోటి, శేషాద్రిలకు చెవిరెడ్డి పరామర్శ
తిరుపతి: కాంగ్రెస్ నేతలు తిరుపతిలో నిర్వహించిన పోరు సభలో ఆత్మహత్యాయత్నం చేసిన కోటి, అతడిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. కోటి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, మోదీలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీల తీరువల్లే కోటి బలిదానానికి సిద్ధపడ్డాడని ఆయన చెప్పారు. తక్షణమే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్షకు సిద్ధపడ్డారని ఆయన చెప్పారు. -
ఆడపిల్లపై వివక్ష ఎందుకు?
ఇందూరు : ‘ఆడబిడ్డ పుడితే మానసికంగా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడంలేదు.. బిడ్డను కనే తల్లి కూడా ఒకప్పుడు ఒక తల్లికి పుట్టిన ఆడబిడ్డేనన్న విషయం మరిచిపోయి గర్భంలోనే ఉండగానే ఆడపిల్లలను చంపుకుంటున్నారు..’ అని జిల్లా అదనపు కలెక్టర్ (ఏజేసీ) శేషాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఐసీడీఎస్ అనుబంధ శాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం, తదితర సంబంధిత శాఖల సమన్వయంతో బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హా జరైన ఏజేసీ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడప్లిల పుడితే ఏమవుతుందన్నారు. తల్లి దండ్రులను చివరి వరకు ప్రేమించేది కొడుకు కాదని కూతురేనన్నారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లినంత మాత్రానా కూతురు తల్లి దండ్రులను మరిచిపోదన్నారు. కానీ ఈ కాలంలో కొడుకులు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారని అన్నారు. బరువయ్యారని ఆశ్రమంలో ఉంచిన కొడుకు గొప్పవాడా...? చివరి వరకు ప్రేమించి యోగ క్షేమాలు చూసుకునే కూతురు గొప్పదా.? అని ప్రశ్నించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆడబిడ్డను కనే తల్లి ముందస్తు పరీక్షలు చేయించుకుని ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని కడుపులోనే చంపేయడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉం దని, కానీ ఆడవాళ్లే ఆడవాళ్లకు ఇలా శత్రువులుగా మారడం దారుణమైన విషయమన్నారు. ఆడవాళ్లలో మార్పు వస్తే భ్రూణ హత్యలు తగ్గుతాయన్నారు. ఆడవాళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కిశోర బాలికలు, కల్యాణ లక్ష్మి లాంటి ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల హక్కులను హరించొద్దు పిల్లల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని, అలా హరించిన వారెవరైనా, చివరికీ కన్న తల్లిదండ్రులైనా చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే షాపు యజమానిపై కేసు నమోదుతో పాటు జైలు శిక్ష విధిస్తారనిహెచ్చరించారు. కార్యక్రమం అనంతరం సంతానం కలుగని దంపతులకు ఏడాదిన్నర పాపను ఏజేసీ చేతుల మీదుగా దత్తతనిచ్చారు. ఉపాన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాల్య వివాహాల నిరోధకాలపై, బాల స్వచ్ఛ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాసాచారి, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెర్టరేట్ నుంచి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి తిలక్‌గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు చేరుకుంది. -
‘నమోదు, సవరణ’కు సహకరించండి
ప్రగతినగర్: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రకియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు జేసీ శేషాద్రి కోరారు.గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఓటర్ల సవరణపై వివిధ రాజకీయ ప్రతినిధులు, నాయకులతో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో డిసెంబర్ 8వ తేదీ వరకు ఓటర్లు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. నవంబర్ 16,23,30 తేదీల్లో, డిసెంబర్ 7వ తేదీన రాజకీయ పార్టీల నుంచి బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్‌లెవల్ అధికారులు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన దరఖాస్తులను డిసెంబర్ 22వ తేదీలోగా విచారణ చేసి పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 2015, 5వ తేదీన తుది పరిశీలన కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. జాబితాలో పేర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. జాబితాలో పేర్లులేని అర్హులైన ఓటర్లు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్ణీత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక నమోదు తేదీలో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవల్ అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో డీఆర్వో యాదిరెడ్డి, ఏఈ గంగాధర్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
24లోగా దరఖాస్తులను అందజేయాలి
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప ని చేసే ఉద్యోగుల పూర్తి వివరాలను తమకిచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా భర్తీ చేసి ఈ నె ల 24లోగా సంబంధిత (హెచ్ఓడీ) జిల్లా అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు జేసీ శేషా ద్రి సూచించారు. హెల్త్ కార్డుల జారీ, ఉద్యోగుల పూర్వపరాల వివరాలు అందజేయాలని రాష్ట్ర ఆ ర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శని వారం జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, మం డలాధికారులకు జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ శాఖ అధికారు లు ప్రతి ఉద్యోగికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేసి ప్రొజెక్టర్ ద్వారా పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెగ్యూలర్,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన ఎంత మంది ఉద్యోగులు ఎన్ని శాఖల్లో పని చేస్తున్నారు, వారు తీసుకుంటున్న జీతభత్యాలు ఎంత?, ఎప్పుడు ఉద్యోగంలోకి వచ్చారు?, సొంత శాఖ, వారి కుటుంబ సభ్యులు ఎందరు తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. దరఖాస్తులను భర్తీ చేసేందుకు ఏమైనా సందేహాలు ఉంటే హైదరాబాద్‌లోని 040-23457618 లేదా 040-23450111 నెంబరుకు, అలాగే 104కు కూడా ఫాన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఇటు జిల్లాలో కూడా జిల్లా ట్రెజరీ శాఖకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్ మహిం దర్ 9951602570 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. ఉద్యోగులు దరఖాస్తునకు హెల్త్ కార్డు కోసం తమ కుటుంబ సభ్యుల ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, సెల్ నెంబరు ఇతర వివరాలు కలిగిన జిరాక్స్ ప్రతులను జత చేయాలని సూచించారు. ఉద్యోగులు ఇచ్చిన దరఖాస్తులను హెచ్ఓడీలు స్వీకరించగానే జనవరి 5లోగా జ్టఞ.ఛిజజ.జీ అనే వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. హెల్త్‌కార్డులు ముం దుగా 90 రోజుల కాల వ్యవధితో కూడినవి ప్రభుత్వం అందజేస్తుందని, తరువాత శాశ్వత కార్డులు వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ శాఖ డీడీ రాజేందర్, ఏటీఓ సదాశివ్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.