ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప ని చేసే ఉద్యోగుల పూర్తి వివరాలను తమకిచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా భర్తీ చేసి ఈ నె ల 24లోగా సంబంధిత (హెచ్‌ఓడీ) జిల్లా అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు జేసీ శేషా ద్రి సూచించారు. హెల్త్ కార్డుల జారీ, ఉద్యోగుల పూర్వపరాల వివరాలు అందజేయాలని రాష్ట్ర ఆ ర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శని వారం జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, మం డలాధికారులకు జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ శాఖ అధికారు లు ప్రతి ఉద్యోగికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేసి ప్రొజెక్టర్ ద్వారా పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెగ్యూలర్,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన ఎంత మంది ఉద్యోగులు ఎన్ని శాఖల్లో పని చేస్తున్నారు, వారు తీసుకుంటున్న జీతభత్యాలు ఎంత?, ఎప్పుడు ఉద్యోగంలోకి వచ్చారు?, సొంత శాఖ, వారి కుటుంబ సభ్యులు ఎందరు తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు.
దరఖాస్తులను భర్తీ చేసేందుకు ఏమైనా సందేహాలు ఉంటే హైదరాబాద్‌లోని 040-23457618 లేదా 040-23450111 నెంబరుకు, అలాగే 104కు కూడా ఫాన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఇటు జిల్లాలో కూడా జిల్లా ట్రెజరీ శాఖకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్ మహిం దర్ 9951602570 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. ఉద్యోగులు దరఖాస్తునకు హెల్త్ కార్డు కోసం తమ కుటుంబ సభ్యుల ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, సెల్ నెంబరు ఇతర వివరాలు కలిగిన జిరాక్స్ ప్రతులను జత చేయాలని సూచించారు. ఉద్యోగులు ఇచ్చిన దరఖాస్తులను హెచ్‌ఓడీలు స్వీకరించగానే జనవరి 5లోగా జ్టఞ.ఛిజజ.జీ అనే వెబ్‌సైట్లో నమోదు చేయాలన్నారు. హెల్త్‌కార్డులు ముం దుగా 90 రోజుల కాల వ్యవధితో కూడినవి ప్రభుత్వం అందజేస్తుందని, తరువాత శాశ్వత కార్డులు వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ శాఖ డీడీ రాజేందర్, ఏటీఓ సదాశివ్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.
24లోగా దరఖాస్తులను అందజేయాలి
Published Sun, Dec 22 2013 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement