గీత స్మరణం | Song of the day from amma donga movie | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Wed, Dec 18 2013 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :
 
 ఆమె: ఏదో మనసు పడ్డానుగానీ
   కల్లో కలుసుకున్నాను గానీ
 నీపై ప్రేమా ఏమో నాలో
 ఏదో మనసు పడ్డానుగానీ
   ఎంతో అలుసు అయ్యాను గానీ
 నాపై ప్రేమో ఏమో బోలో
 రావా పడుచు మది తెలుసుకొనలేవా...
 తలపునపడు తనువు ముడి మనువై
   మమతై మనదైపోయె అనురాగాలు కలనే
 ॥మనసు॥
 
 చరణం : 1
 
 అతడు: ఒక హృదయం పలికినది
   జతకోరే జతులు శ్రుతులు కలిపి
 ఒక పరువం పిలిచినది ప్రేమించి...
 ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి
 ఒక బంధం బిగిసినది వేధించి...
 ఆ: తె లుసా తేటిమనసా పూలవయసేమంటుందో
  తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
 అ: ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి
   మెడ ఉరి గడుసరి సరిసరిలే
 ॥మనసు॥
 
 చరణం : 2
 
 అ: ఒక మురిపెం ముదిరినది మొగమాటం
   మరిచి ఎదుట నిలిచి
 ఒక అధరం వణికినది ఆశించి
 ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి
 ఒక రూపం అలిగినది వాదించి
 ఆ: బహుశా బావ సరసాలన్నీ విర సాలాయెనేమో
 ఇక సాగించు జతసాగించు మనసే ఉన్నదేమో
 అ: ఓ పాపా నిందిస్తే నా పాపం
   నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే
 ॥మనసు॥
 
 చిత్రం : అమ్మదొంగా (1995)
 రచన : వేటూరి
 సంగీతం : కోటి
 గానం : మనో, కె.ఎస్.చిత్ర, శైలజ

 
 నిర్వహణ: నాగేశ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement