veturi sundararama murthy
-
వసంతాలు విరబూయించిన కవి
‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి. ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. ‘ఈ మధుమాసంలో నీ దరహాసంలో’ అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది.వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుఇష్టం.‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న కలమే ‘ఆకుచాటు పిందె ఉంది’ అని చిలిపిదనాన్ని ఒలకబోసింది. ఉగాది పండుగ రోజున వెండితెర కవిరాజును తలుచుకోవడానికి మించిన సందర్భశుద్ధి ఏముంది? వేటూరి గురించి ఆయన పెద్ద కుమారుడు వేటూరి రవిప్రకాశ్ సాక్షితో ఎన్నో విషయాలు పంచుకున్నారు.. నాన్నగారికి మేం ముగ్గురం అబ్బాయిలం. నేను పెద్దబ్బాయిని. ఎనర్జీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. అంతకుముందు.. ప్రేమించు, జగదేకవీరుడు (కృష్ణ) చిత్రాలకు కథలు రాశాను. తమ్ముడు చంద్రశేఖర్ – ఎం. ఏ సైకాలజీ చేసి, అమెరికన్ కాన్సులేట్‌లో పనిచేసిన అనుభవంతో సొంతగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. రెండో తమ్ముడు నందకిశోర్ ఎంబిఏ చేసి, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సిలో రీజనల్ మేనేజర్‌గా పని చేసి, సొంత కన్సల్టెన్సీ ప్రారంభించాడు. నాకు తమ్ముళ్లకి పది సంవత్సరాల అంతరం ఉంది. నాన్నగారు ‘ఆంధ్రజనత’కి ఎడిటర్‌గా పనిచేసిన సమయం నుంచి ఆయనను దగ్గరగా గమనించడం వల్ల, ఆయన రచన, జీవితం, సినిమా సంబంధం గురించి నాకు అవగాహన ఉంది. నాన్నగారు బిఏబిఎల్ చేశారు. ఆయనకుర రచనలంటే ఆసక్తి. కాని ఇంట్లో వారు మాత్రం ఉద్యోగం చేయమనేవారు. వాస్తవానికి నాన్నగారు సంపాదించవలసిన అవసరం లేదు. అంత ఆస్తిపరులు ఆయన. అందరూ ఆయనను పిల్ల జమీందారు అనేవారు. అయినప్పటికీ, ఉద్యోగంలో ఉంటే నెలకు ఇంత అని నికర ఆదాయం ఉంటుంది కదా అనడంతో, నాన్నగారు ఉద్యోగంలో చేరడం అనివార్యమైంది. జర్నలిస్టుగా ఆంధ్రజనతలో.. నాన్నగారు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో సబ్ ఎడిటర్‌గా, ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. తన ముప్పయ్యవ ఏటే ఎడిటర్ అయ్యారు. 1968లో ఎడిటర్‌గా రిజైన్ చేసి, స్వతంత్ర రచన చేపట్టాలనుకున్నారు. గురు తుల్యులైన విశ్వనాథ సత్యనారాయణగారితో ‘చందవోలు రాణి’ నవలను అడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించారు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవాలయ చరిత్ర’ పుస్తకాలను కూడా ప్రచురించారు. 1970లో ఆకాశవాణిలో చేరడానికి వెళ్లగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు ‘ఏదైనా స్వచ్ఛంద రచన చేయ’మని అడగటంతో, ‘సిరికాకుళం చిన్నది’ అనే సంగీత నాటకాన్ని రాశారు. ఈ సమయంలో చక్రపాణి గారు ఆడవారికి ప్రత్యేక పత్రిక‘ వనిత’ మొదలుపెడుతూ, నాన్నగారిని ఎడిటర్‌గా రమ్మని ఆహ్వానించారు. నిర్భయంగా రాసేవారు.. నాన్నగారు రచయితగా విభిన్నంగా రాయాలనీ, సమాజంలో తాను, తన రచనలు గుర్తుండిపోవాలనీ అనుకున్నారు. ‘హి ఈజ్ ఎ పొయటిక్ క్రిటిక్’. 1965లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం దగ్గర రోడ్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ఒక విషయాన్ని తప్పుగా చెప్పారు. ఆ తప్పుని ఆంధ్రప్రభ పత్రికలో నిర్భయంగా ప్రకటించారు నాన్నగారు. మరోసారి... అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగుకి వెళ్లినప్పుడు అక్కడ అందరినీ లె ల్లబట్టల్లో చూడగానే నాన్నగారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. మరుసటి రోజు పత్రికలో ‘అదిగో ద్వారక, ఆలమందలవిగో..’ అంటూ వార్త రాశారు. అది చూసిన ఎంఎల్ఏలు స్పీకర్‌ని కలిసి, నాన్నను శిక్షించమన్నారు. స్పీకర్ చిరునవ్వుతో, ‘సరసంగా తీసుకోవాలి’ అన్నారు. ఆయన అలా అనకుండా ఉంటే, నాన్నకు శిక్ష పడేది. ఓ సీత కథ.. 1952 – 58 మధ్య కాలంలో నాన్నగారికి సిని మాలకు సంబంధించి పనిచేసిన అనుభవం ఉంది. 1959లో ‘వసుబాల’ అనే కథను బిఎన్ రెడ్డిగారి కోసం రాశారు. ఎన్టిఆర్ ప్రోత్సాహంతో ‘పెండ్లి పిలుపు’ సినిమాకి స్క్రిప్టు వర్క్ చేశారు. ఎన్టిఆర్ కోరిక మేరకు గొల్లపూడి మారుతీరావుగారు నాన్నగారిని కె. విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. అప్పటికే విశ్వనాథ్ గారు మూగ డ్యాన్సర్ కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమాకు పాటలు రాయమని నాన్నగారిని అడిగారు. ఈ లోగా ‘ఓ సీత కథ’ చిత్రానికి కె. విశ్వనాథ్ గారి కోరిక మీద పాటలు రాశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. 1975 లో బాపుగారి భక్తకన్నప్ప, 1977లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పాటలు రాసే కొత్తల్లో.. పాటలు రాస్తున్న తొలినాళ్లలో ‘ఈ సినిమాకి ఈ పాట రాస్తున్నాను’ అని చెబితే, బిజీ అయిన తరవాత సినిమాల పేర్లే తప్ప మిగిలిన వివరాలు తెలిసేవి కాదు. ఓ సీత కథ, భక్త కన్నప్ప, సిరిసిరి మువ్వ, కల్పన.. చిత్రాలలో పాటలు రాస్తున్నప్పుడు ‘ఇలా రాస్తున్నాను. ఇలా రాశాను’ అని చెప్పేవారు. శంకరాభరణం, సప్తపది, శుభోదయం.. చిత్రాల సమయానికి ‘పాటలు రాస్తున్నాను’ అనేవారు. అంతే. బావున్నాయనుకున్న సినిమాలను రిలీజ్‌కు ముందుగా ‘ప్రివ్యూ షో థియటర్’లో వేసుకుని చూసే వాళ్లం. మాకందరికీ ముందు నుంచి మిగతా కుటుంబాలతో కలిసే అలవాటు తక్కువ. నాన్నగారు ఆడియో ఫంక్షన్లు, శత దినోత్సవాలకు వెళ్లేవారు కాదు. కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపురమణలు, మాధవపెద్ది చక్రవర్తి.. వీరి కుటుంబాలతో తప్ప మిగిలిన సినిమా వారి కుటుంబాలతో సాన్నిహిత్యం లేదు. వేటూరి కుటుంబ సభ్యులతో ఎస్.పి.బాలు అచ్చ తెలుగు పదాలు.. సాహిత్యం మీద మక్కువతో నాన్న జర్నలిస్టు, రచయిత రెండూ అయ్యారు. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తరవాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. తన పాటల్లో గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీయత అనుబంధం, తెలుగుదనం ఉండాలనుకున్నారు. తెలుగుభాష వాడుక భాష స్థాయికి మారిపోయాక అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవరికీ అర్థం కావట్లేదనేవారు. సాహిత్య పరిజ్ఞానం కలగాలంటే టీకా తాత్పర్యాలు లేకుండా చదివి అర్థం చేసుకోవాలి లేదా పెద్దల చేత చెప్పించుకో వాలని మా తాతగారు అంటుండేవారు. నాన్నగారు సీతారామయ్యగారి మనవరాలు చిత్రం కోసం రాసిన ‘కలికి చిలకల కొలికి’ పాటలో ‘అద్ద గోడలకి’ (వంట గదిలో వండిన పదార్థాలను మరుగున ఉంచటం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలామందికి తెలియలేదు. తోబుట్టువుల నుంచే.. స్వయంగా సాహితీమూర్తులైన దర్శకులు బాపు, విశ్వనాథ్, జంధ్యాల, క్రాంతి కుమార్ వంటి వారి కోసం తన కలానికి పదును పెట్టారు. అందువల్ల వారికి మంచి పాటలు రాయగలిగారు. నాన్నగారికి తోబుట్టువులే ఇరవై మంది దాకా ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నాన్నగారి దగ్గర పంచుకునేవారు. అలా వారినందరినీ దగ్గరగా పరిశీలించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోవటం వల్ల రకరకాల ప్రయోగాలు చేయగలిగారు. ఆడవాళ్లే అభిమానులు.. నాన్నగారు మాస్ రైటరే కాదు, ఆడవారి మనసులలో ఉండిపోయే పాటలు రాసిన మనసు కవి కూడా. ఆయన సాహిత్యం తెలిసినవారు ఆయన గురించి ఏమనుకుంటారో నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒక పాటను మగవారైతే విన్న వెంటనే, కనెక్ట్ అయ్యి, ఆ పాటను ప్రాచుర్యంలోకి తెస్తారు. కాని ఆడవారు అభిమానించి, ఆదరిస్తారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆడవారు మా అమ్మగారిని కలిసినప్పుడో లేదా ఫోన్లోనో నాన్నగారి మీద వారికున్న అభిమానాన్ని చెబుతుంటా రు. ఇదీ... ఇప్పటి పదహారేళ్ల ఆడ పిల్ల దగ్గర నుంచి, 80 ఏళ్లు పైబడ్డ వారికి నాన్నగారి మీద ఉన్న అభిమానం, ప్రేమ. తెలుగు పండుగలంటే ఇష్టం నాన్నకు ఉగాది వంటి తెలుగు పండుగలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనంత వరకు పండుగల సమయంలో ఇంటి దగ్గరే ఉండేవారు. ఉదయమే స్టూడియోకి వెళ్లినా, పది గంటలకు ఇంటికి వచ్చేసేవారు. ముఖ్యంగా ఉగాది పండుగను తప్పనిసరిగా అందరం కలిసి చక్కగా చేసుకునేవాళ్లం. పండుగలకు సంబంధించిన కథలన్నీ చెప్పేవారు. మా పక్కనే కూర్చుని, అందరం సరిగా తిన్నామా లేదా అని చూసి, అప్పుడు బయటకు వెళ్లేవారు. నాన్నగారికి నచ్చిన పని.. తనకు నచ్చిన రచనలు, మనుషుల గురించి అందరికీ చెప్పడం. అలాగే తనకు నచ్చిన తినుబండారాలను అందరితో పంచుకోవటం. – వేటూరి రవిప్రకాశ్, (వేటూరి పెద్ద కుమారుడు) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఇంటర్వ్యూ ప్రివ్యూ
బెజవాడ–గుంటూరు రోడ్డు మీద తుపాకి గుండులా దూసుకుపోతోంది బైక్. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. చల్లగాలి సుఖంగా ఉంది. రాత్రి తొమ్మిందిటికి బెజవాడలో షాపింగ్ పూర్తి చేసుకుని రాజారావు శరవేగంతో గుంటూరు వస్తున్నాడు. మర్నాడు ఉదయం పోలీసు ఉద్యోగానికి అతనికి ఇంటర్వ్యూ. రాజారావు షికారీలో ఆరితేరాడు. గుండెబలం, కండబలం గలవాడు. ముక్త్యాల ప్రాతం అడవుల్లో గండు పులుల్ని మట్టుపెట్టి మాయం చేసిన దిట్ట. అలా శరంలా దూసుకుపోతున్న రాజారావుకు గబిక్కిన ఏదో గగ్గోలు వినిపించింది. చుట్టపట్ల కలయచూశాడు. బైక్ పరిగెడుతూనే ఉంది. మార్గం నిర్మానుష్యంగా ఉంది. ఏమీ కనిపించలేదు. ఈదురుగాలులు చెవిలో విసిరి కొడుతున్నాయి. ఆ ఒంటరితనం అతన్ని భయపెట్టబోయి తెల్లబోయిందా అన్నట్లు మసక వెన్నెల అంతటా ఆకట్టుకుంది. రోడ్డు మీద తన ముందు అరఫర్లాంగు దూరంలో ఒక కారు అమిత వేగంగా పోతోంది. ఈసారి మళ్ళీ అలికిడి వినిపించింది. భయంకరమైన అరుపేదో వికారంగా వినిపించింది. అది తన ముందున్న కారులోంచే వస్తున్నట్లు అనిపించింది. పసిగట్టిన రాజారావు లాగు జేబులో తుపాకి తడిమి చూసుకున్నాడు. ఆ గగ్గోలు ఏదో స్త్రీ కంఠం. స్త్రీ ఆర్తనాదం. రాజారావుకు ఉద్వేగం ఎక్కువైంది. దాంతో వేగం హెచ్చించాడు. క్షణం వితర్కించి ‘అవును, బహుశా ఆ కారులో ఎవరో దుండగులు స్త్రీని అపహరించి బలాత్కారం చేస్తున్నారు’ అనుకున్నాడు రాజారావు. అరుపు మళ్ళీ వికృతంగా వినిపించింది. రెచ్చిపోయి వేగం హెచ్చించేశాడు రావు. ముందు కారు మరింత వేగంగా దూసుకుపోతోంది. కారును దాటి పోవాలని సైడ్ కోసం హాక్ చేశాడు. అట్నించి వచ్చి రోడ్డు కడ్డంగా ఖణాయిస్తే కారు ఆగిపోవాల్సిందే....ఇలా ఊహించాడు. కారు వ్యక్తి సైడ్ ఇవ్వలేదు. రావుకి అనుమానం దృఢపడింది. కారుదాటి దారికడ్డంవచ్చి ఆ కిరాతకుణ్ణి పట్టేసుకోవడం ఎలా? అతని మోటర్ బైక్ రోడ్డుపై ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంతలో మార్గంలో మలుపు వచ్చింది. కారు మలుపు తిరుగుతోంది. ఇదే సమయమని పక్క సందుగా రివ్వున దూసుకుపోయాడు రావు. సరాసరి ముందుకు దౌడాయించి రోడ్డు కడ్డంగా బైక్ నిలబెట్టి కారుని ఆపివేశాడు. రోషంగా, పౌరుషంగా కారు దగ్గరికి వచ్చాడు రావు. కారులోంచి తనాబీలా బైటకొచ్చిన వ్యక్తి యుద్ధమల్లుడిలా కుప్పించి ముందకు దూకాడు. జబ్బకొద్ది దెబ్బతీశాడు. మూడు గజాల దూరంలో పడ్డాడు రావ్. దిమ్మ తిరిగిపోయి కసి బుసలు కొట్టింది అతనికి. తమాయించుకొని చివాలున లేచి బలం కొద్దీ గింగిరాలు తిరిగేట్లు గూబ గుంయ్మనిపించాడు కారు వ్యక్తిని. కారులో గోల ఇంకా జరుగుతూనే ఉంది. బాహాబాహీగా ఇక లాభం లేదని రావు కారు మనిషి మోకాలి కీలు మీద తుపాకి గురి పెట్టి ప్రయోగించాడు. గుండు తగిలిన ఆకాశసౌధంలా, చిన్న ‘క్లూ’తో–కథలో పేర్చిన ‘సస్పెన్స్’లా దభాల్న కూలిపోయాడు దుండగీడు. రాజారావు కాలునిలదొక్కుకుని–ఆదుర్దాగా కారు దగ్గరికి వెళ్ళి చూశాడు. మసకచీకటిలో అతడికేం కనిపించలేదు. ఆక్రితం క్షణం వరకు వినిపించిన అల్లరీ, ఆర్తనాదం ఆగిపోయాయి. కారులో మరెవ్వరూ వ్యక్తులున్నట్లు కనిపించలేదు. ధైర్యం చేసి తలుపు తీసి చూశాడు. రెండు పెట్టెలు మాత్రం ఉన్నాయి. మనుష్యులు...తను అనుకున్న స్త్రీ....ఎవరూ లేరు. ఆదుర్దా ఎక్కువైపోయింది. అయోమయమైపోయింది. ఇంతలో...‘ఆలిండియా రేడియో...మీరింతవరకు ‘కారులో హత్య’ డిటెక్టివ్ నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు...’ నిర్ఘాంతపోయాడు రావు. నిర్విణ్ణుడై స్తంభించిపోయాడు. అప్రయత్నంగా కొరుక్కున నాలిక మంట పుట్టనేలేదు. బుద్ది ఫల్టీ కొట్టి చిత్తయిపోయాననుకున్న రాజారావు–చేసిన పనికి బాధతో భయపడిపోయాడు. తానో పెద్ద కొండతవ్వి పట్టిన ఎలుకలా ఎదర తుప్పలో పడి కనిపించాడు దెబ్బతిన్న మనిషి! ఆ క్షణంలో ఏమిటో, ఎలాగో, యేం చేయాలో రావుకు తోచలేదు. హఠాత్తుగా ఆ తికమకలో రేచులా ఒక వాహనం వచ్చి ఆగింది. అందులోంచి గబగబా పోలీసుపటాలం ఒకటి దిగి చుట్టూ వచ్చి కమ్ముకున్నారు. రావు వణికిపోయాడు. పోలీసులు కొందరు కారంతా వెతుకుతున్నారు. రావుని దబాయించి ‘‘ఎవరు నువ్వు? ఏమిటిది? ఎక్కడ ఈ కారులో వచ్చిన వ్యక్తి?’’ అని అడిగాడు పోలీసు అధికారి. మూల కాలు విరిగి పడివున్న వ్యక్తిని చూపించాడు రావు. చేసిన నేరానికి వెంటనే తనకే సంకేళ్ళు పడతాయనుకున్న రాజారావు–తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కుప్పకూలిపడి వున్న కారు మనిషి చేతికి తటాలున బేడీలు వేశారు పోలీసులు. ‘‘ఇక్కడేం జరిగింది?’’ పోలిసు అధికారి ప్రశ్నించాడు. జరగిన కథ వివరించాడు రాజారావు. ‘‘ఎక్కడికి వెడుతున్నారీ అర్ధరాత్రి?’’ మళ్ళీ ప్రశ్నించాడు అధికారి. గుంటూరు ఇంటర్వ్యూ సంగతి చెప్పాడు రావ్. ‘‘ముందు స్టేషన్‌కు నడవండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏమిటిది ఇన్స్పెక్టర్...అంతా అయోమయంగా వుంది’’ రావ్ ప్రశ్నించాడు. ఖైదీతో సహా పటాలంతో జీప్వాన్ కదిలింది. మోటర్‌బైక్ మరో పోలీస్ జవాన్ తెస్తున్నాడు. ఇన్స్పెక్టర్ చెప్పాడు: ‘‘ముందు మీరు కూడా స్టేషన్‌కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. తరువాత మీరు వెళ్ళవచ్చు. వీడు మా కళ్ళలో కారం కొట్టి అర్నెల్లుగా ఈ చుట్టుపట్ల చోరీలు చేస్తున్న బడాచోర్ కేడీ....గూండా...సినిమా హాల్లో రెండువేల రూపాయలు కొట్టేసి, పార్క్ చేసివున్న మునిసిపల్ కమిషనర్ కార్లో ఉడాయించాడని తెలిసి వెంబడించాం. దొంగనోట్లు అచ్చు వేయడం వీడి వృత్తి...రాస్కెల్.... మొత్తానికి భలే చిత్రమైన సంఘటన మీరు వీణ్ణి పట్టుగోటం–మీకు చాలా థ్యాంక్స్’’ అప్రయత్నంగా ‘‘ఏమిటిదంతా, ముద్దాయిని పెద్దమనిషినయిపోయాను’’ అన్నాడు సంభ్రమంతో రావ్. ‘‘మరేంలేదు. రేపే మీరు పోలీస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెడుతున్నారు కదూ...ఇది ఇంటర్వ్యూ ప్రీవ్యూ’’ అని క్షణం ఆగి బిగ్గరగా నవ్వి–మీకీమాటలిలా అర్థం కావడం కష్టం, మరివస్తా...నమస్తే...’’ అని ఠాణాలోకి నడిచాడు ఇన్స్పెక్టర్. మర్నాడు ఇంటర్వ్యూలో ఇన్స్పెక్టర్ కూడా ఒక పరిశీలకుడే. ఈ మాటలు ఒక కానిస్టేబుల్ రావు చెవిలో ఊదాడు. స్టేట్మెంట్ ఇచ్చి బయటికి వస్తుంటే...మరోడు మోటర్‌బైక్ అందించాడు. ఈ మాటలు విన్న రాజారావు ఆ మోటర్‌బైక్ ఎక్కి జరిగిందానికి, జరగబోయేదానికి ఒక్కసారి ఆశ్చర్యంలో మునిగిపోయి గుంటూరు ఇంటర్వ్యూలో పైకి తేలాడు. -
నవమి నాటి వెన్నెల నేను
స్త్రీ, పురుషుడు– విడిగా సగం సగం. అసంపూర్ణం. నవమి, దశమి నాటి వెన్నెలలాగే. ఏ సగమెవరో మరిచేంతగా వారు ఒకటైపోయినప్పుడు సంపూర్ణం అవుతారు. పున్నమి రేయి అవుతారు. శివరంజని కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాట ఇది. దీనికి సంగీతం రమేశ్ నాయుడు. పాడినవారు సుశీల, బాలసుబ్రహ్మణ్యం. 1978లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. జయసుధ, హరిప్రసాద్ నటీనటులు. నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతి రేయీ కార్తీక పున్నమి రేయీ నీ వయసే వసంత రుతువై నీ మనసే జీవన మధువై నీ పెదవే నా పల్లవిగా నీ నగవే సిగ మల్లికగా చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయికలో నీ ఒడిలో వలపును నేనై నీ గుడిలో వెలుగే నేనై అందాలే నీ హారతిగా అందించే నా పార్వతిగా మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో -
వేటూరి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి
సాక్షి, పాయకరావుపేట (విశాఖ జిల్లా): ఊపిరి ఉన్నంత వరకు తన జీవితం సినీపరిశ్రమకే అంకితమని ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా చంద్రబోస్‌కు వేటూరి అష్టమ సాహితీ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశాయి. తుని చిట్టూరి మెట్రోలో జరిగిన కార్యక్రమంలో సాహితీ పీఠం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగా జోగేశ్వరశర్మ, ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విజయ్‌ప్రకాష్‌లు ఈ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ప్రదానం చేశారు. చంద్రబోస్‌కు పురస్కారంతో పాటు, 120 సాహితీ పుస్తకాలతో తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. వేటూరి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువతకు గాయకులుగా, గేయ రచయితలుగా రాణించడానికి ఎన్నో అవకాశాలున్నాయని మాతృభాషపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. వేటూరిని పూజించడమంటే అక్షరాన్ని పూజించడమేనని అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు, టాలీవుడ్ చానల్ సీఈవో శర్మ పాల్గొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వేటూరి
-
వేటూరి పాట
తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన వేటూరి సుందర రామ్మూర్తి పాటను సమగ్రంగా పరిచయం చేసిన పుస్తకం ఇది. వేటూరి పాటలోని ప్రమాణాలు, సాహితీ విలువలు, శైలి, వస్తు వైవిధ్యం సూక్ష్మంగా పరిశీలించారు రచయిత. వేటూరి పాటల్లోని అలంకారాలను, యమకాలను, ఛందో వైచిత్రిని శ్రద్ధగా పరిచయం చేశారు. రచన: జయంతి చక్రవర్తి; పేజీలు: 390(హార్డు బౌండు); వెల: 500; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. రచయిత ఫోన్: 9390526272 తెలుగు పత్రికలకు ఇంగ్లిష్ తెగులు విశ్లేషణ: కె.ఎల్.రెడ్డి; పేజీలు: 148; వెల: 110; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453 డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మరణలో రచయిత్రుల కొత్త కథలు సంకలనం: డాక్టర్ తెన్నేటి సుధాదేవి; పేజీలు: 314; వెల: 200; ప్రచురణ: వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ప్రతులకు: జ్యోతి వలబోజు; ఫోన్: 8096310140 నాటికలు–హాస్య నాటికలు రచన: యాముజాల రామచంద్రన్; పేజీలు: 288; వెల: 220; ప్రతులకు: రచయిత, విల్లా నం. 47, మేపుల్ టౌన్ గేటెడ్ కమ్యూనిటీ, సన్ సిటీ, బండ్లగూడ, హైదరాబాద్–86. ఫోన్: 9247485690 -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వేటూరి
-
అనుమతి తెప్పించారు...
వేటూరి సుందరరామమూర్తి, సినీ కవి - రచయిత ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియో స్టేషనుకు వెళ్ళి రజనీ కాంతరావు గారిని కలిశాను. ‘‘ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీత నాటిక రాసి యివ్వు ప్రసారం చేద్దాం’’ అన్నారాయన. ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జెకట్టి ఆడుతూ వుండేది. ...రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రిగారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్లి రాత్రింబవళ్లు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నా. పద్యాలు, పదాలు, పాటలూ, గద్యాలూ, పలు విన్యాసాలు! రేడియో నాటిక కదా అని చాలా కుదించాను. అంతకుముందు రూపకరచనలో చేయి తిరిగినవాడను కాను. రాగతాళాలకు, స్వరకల్పనకు సరితూగుతుందో లేదో అని సందేహం వచ్చింది. వెంటనే సుప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావుగారికి ఈ కాగితాలన్నీ యిచ్చి నా సందేహం చెప్పాను. రెండు గంటలు వంచిన తల యెత్తకుండా ఆయన నాటిక అంతా చదివి, ‘‘దీనికి సంగీతం నేనే చేస్తాను’’ అంటూ రజనీగారికి ఫోను చేశారు. ‘‘మీరు చేస్తే అంతకన్నా కావలసిందేముంది. అయితే ఆ స్క్రిప్టు ఇంతవరకు నేను చూడలేదు. అది వెంటనే పంపమనండి’’ అన్నారు రజనీగారు. అటు తరువాత రజనీగారి సూచనల మేరకు దానిని మరింత తగ్గిస్తే ఒకటిన్నర గంటల నాటికి అయింది. అప్పటికి గంటకుమించి ‘ఆకాశవాణి’ రూపకాలు లేవు. కానీ సాహితీ సంగీత పక్షపాతులు, స్వయంగా కవీ, సాహితీవ్రతులూ అయిన రజనీగారు ‘సిరికాకొలను చిన్నది’ సంగీత నాటికను గంటన్నర కార్యక్రమంగా ప్రత్యేక అనుమతి పైనుంచి తెప్పించి మరీ ప్రసారం చేశారు. (స్వర్గీయ వేటూరి రచన ‘సిరికాకొలను చిన్నది’ నుంచి...) -
రాసే కోయిల...
-
ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే!
వేటూరి ఓ నిరంతర అన్వేషి. మనో యాత్రికుడు. ఓ మహా వేదాంతి... అన్నిటినీ మించి లోకేశ్వరుడంత ‘ఏకాకి’. ఈ మాటే ఒకసారి నేను వేటూరి గారిని అడిగాను. ఆయన తనదైన ‘చిరునవ్వు’ నవ్వి, ‘అవును’ అన్నారు. ఆ తరవాత చాలాసేపు కళ్లు మూసుకుని ‘‘నేను వెతుకుతూనే ఉన్నాను దేనికోసమో..! దేనికోసమో తెలీదు గానీ వెతుకుతూనే ఉన్నాను. అది దొరికే వరకూ నా ఒంటరితనం పోదు... బహుశా... నన్ను ‘నేనే’ వెతుక్కుంటున్నానేమో’’ అన్నారు. భారతీయమైన వేదాంతాన్నంతట్నీ ఒక్కముక్కలో చెప్పారాయన. రమణమహర్షి అన్నదీ అదేగా. ‘‘హూయామ్ ఐ? నేనెవరూ?’’ అన్న ప్రశ్న వేసుకోమన్నారు అంటే నిన్ను నువ్వు వెతుక్కోమనేగా! వేటూరిగారి గురించి చెప్పాలంటే ఒకే భాష వుంది... అది ‘మనోభాష’. దాని పేరు ‘మౌనం’. ఎందుకంటే అక్షరాల వెనుక ‘అనుభూతి’ని పొదిగిన రచయిత వేటూరి. అక్షరాలకి అర్థాలుంటాయి. అనుభూతికీ? ఊహూ... అక్షరాలకి అతీతమైనదది. ప్రతి మాటా, ప్రతి పాటా ఆణిముత్యమే. పాటల్ని అందరం పంచుకోగలం. ఆయన ‘మాటల్ని’ దాచుకోగలిగే భాగ్యం ‘నాకూ’ దక్కింది. ఓసారి కళ్లు మూసుకుని కూర్చున్నా. ఆయన రాకని గమనించలా. చాలా సేపయ్యాక కళ్లు తెరిచి చూస్తే ఎదుటే కుర్చీలో ఆయన. ‘‘క్షమించండి... చూళ్లేదు’’ కంగారుగా లేచి పాదాలకి నమస్కరించా. ‘‘ఆయుష్మాన్‌భవ’’ అని, ‘‘ఏమిటీ... మనసు బాగోలేదా?’’ అన్నారు. అంటే ఆయన చూసింది నన్ను కాదు... ‘నా మనసుని’ అనిపించింది. ‘‘అవును గురూగారూ... ఎన్ని వెర్షన్లు రాసినా పాట ఓకే కావడం లేదు’’ అన్నాను. ‘‘ఇక్కడ చూడు...’’ అని తన శరీరం వంక చూపించి, ‘‘బాగోలేదు... ఇంకో వెర్షన్ రాయండి...’’ అని క్షణంలో వాళ్లంటారు. కానీ ఎన్ని నరాలు తెగుతాయో, ఎన్ని చుక్కల రక్తం మెదడులో గడ్డ కడుతుందో, వాళ్లకేం తెలుసూ? నా మెదడు నిండా గాయాలే...’’ నవ్వారాయన. ప్రతీ పాటకీ ఇక్కడ జరిగేది పోస్టుమార్టమే. చిత్రం ఏమంటే యీ ‘చిత్ర హింస’ సముద్రాల, ఆరుద్ర, వేటూరి వంటి మనో పండితులకే గాక, సరికొత్త రచయితకీ తప్పదు. ఆయన ఏనాడూ ఉపన్యాస ధోరణి అవలంభించలా. చాలా క్లుప్తంగా వుంటాయి ఆయన సమాధానాలు. అర్థం మాత్రం అనంతం. ఓసారి ఓ పాట ట్యూన్కొచ్చింది. పాట రికార్డ్ అయ్యాక తెలిసింది. ఆ పాట ట్యూన్ వేటూరిగారి కిచ్చారనీ, ఆయనా రాశారనీ. తరవాత వేటూరిగార్ని కలిసినప్పుడు, ‘‘సార్ ఆ ట్యూన్ మీకిచ్చారనీ, మీరు పాట వ్రాశారనీ నిజంగా నాకు తెలీదు... మీకిచ్చిన పాట రాసే ధైర్యం నేనేనాడూ చెయ్యను. చెయ్యలేను’’ అన్నాను. ‘‘నాకు తెలుసు నాయనా... వీళ్లు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ‘నిబద్ధత’ వుండేది. ఇప్పుడది లేదు. వచ్చింది రాసెయ్యడమే. ఎవరెవరికి అదే ట్యూన్ ఇచ్చారో ఎలా తెలుస్తుందీ? పాట రాసినా పాడినా అన్నీ ప్రాప్తాన్ని బట్టేగా!’’ అన్నారు. ఓసారి సౌండ్ ఇంజినీర్ రామకృష్ణగారి రూమ్‌లో వుండగా అంటే, వేటూరిగారూ, రామకృష్ణగారూ, కోటి, రాజ్, నేనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుండగా, ‘‘నటులు కెమేరా ముందు పాత్రలు ధరిస్తే మనం మనస్సులో ఆ పాత్రల్ని ధరిస్తాం... లేకపోతే మీకు ‘ట్యూనూ’ రాదు... మా పాట ‘పాత్రకి సరిపోదు’. అన్నారు. అసలీ అవగాహన ఎంతమందికున్నదీ? ఒకే ట్యూన్లో రాసే, లేక ఒదిగే మాటలు ‘హీరో’ని బట్టి మారిపోతుంటే ఆ హీరోని మనసులో పెట్టుకుంటేగానీ అతనికి సరిపోయే మాటలు పడవు. ఇక సన్నివేశానికి సంబంధించిన పాటల కథ వేరు. సన్నివేశమే కవికి చెప్తుంది... ఏం రాయాలో! ఇటు హీరోచితమైనవీ - అటు వీరోచితమైనవీ - కొన్ని ‘నటన’ని నేర్పేవీ (నిజంగా... పాట వింటుంటేనే నటన శరీరంలో ఉద్భవిస్తుంది) ఎన్ని రకాల పాటలు వ్రాశారో లెక్కలేదు. ప్రతి పాటా ఓ పాఠ్యగ్రంథమే. సినిమా పాటల్ని విభజించాలంటే రెండు భాగాలుగా విభజించాలి. ‘వేటూరి రాకముందు పాటలూ... వేటూరి పాటలూ’ అంతే. ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే! మరో ‘ట్రెండు’ మొదలవ్వాలంటే వేటూరి పద సముద్రాన్ని యీదుకుని అవతల ఒడ్డుకి చేరాలి. సాధ్యమా? ఆయన నిజంగా చాలా మంచి హోస్టు. అనుభవించిన వారికే ఆయన ‘తండ్రి’ హృదయం తెలుస్తుంది. ఉన్నట్టుండి ‘‘పులిహోర తిందామా?’’ అని, మమ్మల్ని (నేనూ, మరో అసిస్టెంటు డెరైక్టరూ) కార్లో ‘సవేరా’కి తీసికెళ్లారు. పులిహోర ‘చేయించిమరీ’ తినిపించారు. ‘నాయనా ఆవకాయ అన్నంలో కందిపొడి కలిపితే చాలా రుచిగా వుంటుంది. అలాగే గోంగూర పచ్చడీ!’’ అన్నారు. ఇప్పటివరకూ ఆ రుచికరమైన ‘మెనూ’నే ఫాలో అవుతూ ఉన్నాను. ‘పాట’కి పల్లకీలు కట్టిన రచయితలెందరో వున్నా, ఆర్థికంగా రచయితని అందలమెక్కించిన వారు మాత్రం కచ్చితంగా వేటూరిగారు ఒక్కరే. పాటకి అయిదొందలో వెయ్యో ఉండే రెమ్యునరేషన్‌ని అమాంతంగా పెంచి, రచయితకి గౌరవస్థానం కల్పించింది మాత్రం వేటూరిగారు. ‘‘అవును... మన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక తీసుకోవాల్సిందే. అడక్కపోతే అమ్మయినా పెట్టదుగా!’’ అనేవారు. ‘‘ఫలానా ఘనుడు పాట రాయించుకుని డబ్బులు ఎగ్గొట్టాడు గురూగారు’’ అని ఓ నాడు నేనాయనతో అంటే, ‘‘రోలు వొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది!’’ అన్నారు నవ్వుతూ. ‘‘మీక్కూడానా?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘వడ్డికాసుల వాడికే ఎగ్గొట్టే మహానుభావులున్నారు నాయనా!’’ అన్నారు అదే చిరునవ్వుతో. నాకు ఆయన దగ్గర శిష్యరికం చెయ్యాలనిపించేది. రచయితగా కాదు... ఆధ్యాత్మికంగా. ఆయన ‘లోపలి మనిషి’ ఎలా వుంటారో ఊహాతీతమే. కవిగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా ఇలా అనేక ముఖాలు వేటూరికి వున్నా, ఆయనలో వున్న ‘దాత’ చాలా తక్కువమందికి తెలుసు. ఎంతమందికి అడక్కుండా ‘డబ్బిచ్చి’ ఆదుకున్నారో, ఎందర్ని హాస్పటల్ ఫీజుల రూపంలో బతికించారో చాలామందికి తెలీదు. నాకూ తెలీదు. ప్రతిఫలాన్ని పొందిన వాళ్లు చెప్పేదాకా. అప్పుడర్థమైంది. ఆయన పబ్లిసిటీ కోరని పరమేశ్వరుడని. ఆయన ‘‘రైటర్స్ రైటర్...’’. ప్రతి పాటా ఓ అధ్యయన గ్రంథమే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు పాట ఉన్నంత కాలం ఆయన బ్రతికే వుంటారు... మన శ్వాసగా మన గుండెలోతుల్ని స్పృశిస్తూ.. భక్తితో... భువనచంద్ర -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పంటచేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేతపచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే ॥॥ చరణం : 1 ఆమె: శివ గంగ తిరనాళ్లలో నెలవంక స్నానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్లతో గొరవంక గుడిగంట కొట్టాలా అ: నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా (2) ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా ॥॥ చరణం : 2 ఆ: గోదారి పరవళ్లలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా అ: నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా (2) ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥ చిత్రం : పదహారేళ్ళ వయసు (1978) రచన : వేటూరి సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా అందరికీ అందనిదీ పూచిన కొమ్మా ॥ పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... చరణం : 1 పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముందీ పాడుకో పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... ॥ చరణం : 2 ఆ రాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడనీ తెలుగులో ఆ రాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడనీ తెలుగులో ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... ॥ వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... చిత్రం : సిరిసిరిమువ్వ (1976) రచన : వేటూరి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -
గీత స్మరణం
పల్లవి : రాజ్యము బలము మహిమ నీవే నీవే జవము జీవము జీవనమీవేనీవే ॥ మరియ తనయ మధుర హృదయ మరియ తనయ మధుర హృదయ కరుణామయా! కరుణామయా! ॥ చరణం : 1 అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్నుమిన్ను కానబోడే మో కడుపుకు చాలినంత కబళమీయకుంటే మనిషి నీతినియమం పాటించడేమో మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి ॥ గుండె గుండె నీ గుడి దీపాలై అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమీవయ్యా... నీ రాజ్యమీవయ్యా చరణం : 2 అర్హత లేనివారికి అధికారం ఇస్తే దయ ధర్మం దారి తప్పునేమో దారి తప్పినవారిని చేరదీయకుంటే తిరిగి తిరిగి తిరగబడతారేమో తగినవారికి తగు బలమిచ్చి సహనం క్షమ సఖ్యతనిచ్చి ॥ తనువు తనువు నిరీక్షణశాలై అణువు అణువు నీ రక్షణశాలయ్యే బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా చరణం : 3 శిలువపైన నీ రక్తం చిందిననాడే శమదమాలు శోధించెనుగాదా నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి శోకం మరణం మరణించెను గాదా చావు పుటుక నీ శ్వాసలని దయాదండన పరీక్షలని ॥ ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని సత్యం మార్గం సర్వం నీవని మహిమ తెలుపవయ్యా... నీ మహిమ తెలుపవయ్యా ॥ చిత్రం : రాజాధిరాజు (1980), రచన : వేటూరి సంగీతం : కె.వి.మహదేవన్, గానం : పి.సుశీల నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఏదో మనసు పడ్డానుగానీ కల్లో కలుసుకున్నాను గానీ నీపై ప్రేమా ఏమో నాలో ఏదో మనసు పడ్డానుగానీ ఎంతో అలుసు అయ్యాను గానీ నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకొనలేవా... తలపునపడు తనువు ముడి మనువై మమతై మనదైపోయె అనురాగాలు కలనే ॥మనసు॥ చరణం : 1 అతడు: ఒక హృదయం పలికినది జతకోరే జతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి... ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి... ఆ: తె లుసా తేటిమనసా పూలవయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో అ: ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి మెడ ఉరి గడుసరి సరిసరిలే ॥మనసు॥ చరణం : 2 అ: ఒక మురిపెం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అధరం వణికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి ఆ: బహుశా బావ సరసాలన్నీ విర సాలాయెనేమో ఇక సాగించు జతసాగించు మనసే ఉన్నదేమో అ: ఓ పాపా నిందిస్తే నా పాపం నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే ॥మనసు॥ చిత్రం : అమ్మదొంగా (1995) రచన : వేటూరి సంగీతం : కోటి గానం : మనో, కె.ఎస్.చిత్ర, శైలజ నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : పూలలో తేనె ప్రేమ... తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ... హాయి నీవంది ప్రేమ బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా ॥ చరణం : 1 కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ ॥ కాలం చెల్లని ప్రేమ... నీ దూరపు చేరువ ప్రేమ సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా... ॥ చరణం : 2 ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ ॥పరిచయం॥ చూపుగ నాటిన ప్రేమ... కనుచూపుకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా... రచన : వేటూరి, గానం : రాజేశ్ పల్లవి : బ్రహ్మ... ఓ బ్రహ్మ... మహ ముద్దుగా ఉంది గుమ్మా బొమ్మా... ఈ బొమ్మా... అరె అందానికే అందమా ॥ జాబిల్లిలా ఉంది జాణా ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా ॥ చరణం : 1 నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసిందా ఏమంటదో ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో నా గుండె దోసిళ్లు నిండాయిలే నేడు ఆ నవ్వు ముత్యాలతో ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో ॥ చరణం : 2 నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ ఏ పూజలూ రాని నేనంటే నీకెంత ప్రేముందనీ ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ ॥ రచన : కులశేఖర్ గానం : ఎస్.పి.బాలు చిత్రం : జెమిని (2002) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ నిర్వహణ: నాగేశ్