
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా
॥
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
చరణం : 1
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
॥
చరణం : 2
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
॥
వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
చిత్రం : సిరిసిరిమువ్వ (1976)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం