ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు | The medical cost of that baby is Rs 18 crores | Sakshi
Sakshi News home page

ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు

Published Fri, Aug 16 2024 5:45 AM | Last Updated on Fri, Aug 16 2024 5:45 AM

The medical cost of that baby is Rs 18 crores

కర్నూలు (హాస్పిటల్‌): కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అక్షయ (2)కు అత్యంత అరుదైన స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫి అనే వ్యాధి వచ్చింది. ఈ కారణంగా పాప ఎదుగుతున్నా కండరాలు సహకరించక నిలబడలేకపోతోంది. నడవలేక.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. 

తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పాప లక్షణాలను బట్టి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌లో జెనటిక్‌ పరీక్షను చేయించారు. పరీక్షలో ఆ పాపకు స్పైనల్‌ మసు్కలర్‌ అట్రోఫిగా నిర్ధారణ అయ్యింది. నిర్లక్ష్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. న్యూరోఫిజీíÙయన్‌ హేమంత్‌కుమార్‌ ఆ పాప పరిస్థితిని వివరిస్తూ.. పాప చికిత్సకు జోల్‌జెరి ఎస్‌ఎంఏ అనే ఇంజెక్షన్‌ చేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు అవుతుందని చెప్పారు. 

జన్యుపర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. కాగా.. బిడ్డను కాపాడుకోవడం రోజు కూలీ చేసుకునే తమకు చాలా కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అక్షయను రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement