Akshaya
-
ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అక్షయ (2)కు అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే వ్యాధి వచ్చింది. ఈ కారణంగా పాప ఎదుగుతున్నా కండరాలు సహకరించక నిలబడలేకపోతోంది. నడవలేక.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పాప లక్షణాలను బట్టి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌లో జెనటిక్ పరీక్షను చేయించారు. పరీక్షలో ఆ పాపకు స్పైనల్ మసు్కలర్ అట్రోఫిగా నిర్ధారణ అయ్యింది. నిర్లక్ష్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. న్యూరోఫిజీíÙయన్ హేమంత్‌కుమార్ ఆ పాప పరిస్థితిని వివరిస్తూ.. పాప చికిత్సకు జోల్జెరి ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ చేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు అవుతుందని చెప్పారు. జన్యుపర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. కాగా.. బిడ్డను కాపాడుకోవడం రోజు కూలీ చేసుకునే తమకు చాలా కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అక్షయను రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు. -
క్షణికావేశం.. నర్సింగ్ విద్యార్థిని విషాదం!
కరీంనగర్: కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని బానోత్ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్ రాజేశం– అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే, సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది. తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న అక్షయ.. గంట సమయం గడిచినా బయటకు రాలేదు.కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపించారు. చిన్నవిషయాలకే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ప్రమాదం మిగిల్చిన గాయం
దకురవి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడబిడ్డ బంగారు భవిష్యత్‌ను రోడ్డు ప్రమాదం చిదిమేసింది.. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. చదువులో రాణిస్తున్న కన్న బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రులకు పెద్దకష్టం వచ్చింది.. రోడ్డు ప్రమాదం కారణంగా నరాల బలహీనతతో కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది ఆ పసిప్రాణం. ప్రమాదం మిగిల్చిన గాయం నరాల బలహీనతతో 14ఏళ్లకే మాటలు కూడా రాక ఆచేతన స్థితిలో పడిపోయింది. ఏడాదికి రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా.. కోలుకోలేని స్థితిలో ఉన్న బాలిక దీనగాథపై ‘సాక్షి’ కథనం.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండాకు చెందిన జాటోత్ శంకర్– సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్షయ వయసు 14 ఏళ్లు. బయ్యారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులంలో చదువుకుంటుంది. ఈ క్రమంలో 2022లో భద్రాద్రి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్షయకు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అక్షయ మెదడులోని రక్తనాళాలు పనిచేయడం లేదని, ఆపరేషన్ చేయడం కుదరదని తెలిపారు. కే వలం మందులతో నయం అవుతుందని చెప్పారు. దీంతో అక్షయను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నరాలబలహీనత తీవ్రం కావడంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది. దీంతో నెలనెలా మందుల కోసం తల్లిదండ్రులు అప్పు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. నెలకు రూ.25వేల ఖర్చు భరించడం కష్టంగా మారిందని దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కూలి పనిచేస్తే వచ్చే డబ్బుతో బతకడం కష్టంగా మారిందని, బిడ్డ జబ్బు నయం కోసం రూ.25వేలు వెచ్చించడం పెనుభారంగా మారిందని విలపిస్తున్నారు.సాయం అందించాల్సిన ఫోన్ నంబర్ 93466 20224 -
ఐదు రోజులు మృత్యువుతో పోరాటం
వరంగల్ : ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడిన ఓ విద్యార్థిని ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే హసన్పర్తికి చెందిన లిక్కి శంకర్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు అక్షయ(13), కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గొల్లపల్లి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. ఈనెల 21న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అవయవాల దానం అక్షయ అవయవాలను దానం చేశారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యసిబ్బంది నేత్రాలతో పాటు ఇతర అవయవాలను సేకరించారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అక్షయ అంతిమయాత్ర సాగింది. పార్థివదేహం ఇంటికి చేరుకున్న సమాచారం అందుకున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్షయ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో తెలివి గల విద్యార్థినిగా ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అనంతరం హసన్çపర్తిలో శ్మశాన వాటికలో అక్షయ అంత్యక్రియలు నిర్వహించారు. -
SRనగర్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్
-
అటెండర్ చేతిలో ‘స్టీరింగ్’
ముప్పారం(నిడమనూరు): పాఠశాల బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యం చిన్నారుల ప్రాణాలమీదకొచ్చింది.. స్టీరింగ్ అటెండర్‌కు ఇవ్వడం తో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం ముప్పారం గ్రామ శివారులో శుక్రవారం చో టు చేసుకుంది. వివరాలు.. నిడమనూరుకు చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు రోజు మాదిరిగా మండల పరిధిలోని ఆ యా గ్రామాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు బయలుదేరింది. వేంపాడ్, జీ అన్నారం గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని ముప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి గాతులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో అన్నారం, వేంపాడ్ గ్రామాలకు చెందిన విద్యార్థులు చిమట నందకుమార్, చిమట కోటేష్, బింత కావ్యసుధ, వల్లపు అరవింద్‌లకు తీవ్ర, అక్షయ, వేణు, నందిని, మణిదీప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిం చారు. ప్రమాద సమయంలో చిన్నారు లు తీవ్రంగా రోదించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ముప్పా రం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆలంపల్లి వెంకన్నలు నిడమనూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయించి మిర్యాలగూడకు తీసుకెళ్లారు. అటెండర్ బస్సు తోలడంతోనే.. స్కూల్ బస్సును అటెండర్ తోలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు తెలిపారు. బస్ రెండవ ట్రి ప్పుకని వేంపాడ్, అన్నారం గ్రామాలకు చెందిన 21మంది విద్యార్థులను తీసుకుని వస్తుండగా గుంటిపల్లి సమీపంలో డ్రైవర్ మహేష్ పండ్లు తోమడానికి వేపపుల్ల కోసం దిగాడు. ఆ సమయంలో డ్రైవర్ స్థానంలోకి స్కూల్, బస్‌కు అటెం డర్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ వచ్చాడు. అక్కడి నుంచి కదిలిన 10నిమిషాలలోపే ప్రమాదం జరిగింది. ప్రతి రోజు అదే ప్రాంతంలో డ్రైవర్ దిగడం, అటెండర్ రావడం జరుగుతుందని బస్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ వేంపాడ్కు చెందిన కార్తీక్ తెలి పాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్,అటెండర్ పరారయ్యారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు. -
జాతీయ ఆర్చరీకి అక్షయ
సాక్షి, హైదరాబాద్: చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక అంతర్ జిల్లా అండర్-14 (మినీ సబ్ జూనియర్) ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అక్షయ, మహేశ్ సత్తాచాటారు. విజయవాడలోని ఓల్గా ఆర్చరీ ఫీల్డ్‌లో బుధవారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో నగరానికి చెందిన అక్షయతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేశ్, పావని, సుష్మ చక్కని ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు.ఈ జట్టు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. బాలికల కాంపౌండ్ విభాగంలో అక్షయ రెండో స్థానంలో నిలువగా, బాలుర ఇండియన్ రౌండ్ విభాగంలో మహేశ్ మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఇండియన్ రౌండ్లో పావని, సుష్మ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. ఎంపికైన క్రీడాకారుల జాబితా: కాంపౌండ్ విభాగం-బాలురు: మహేశ్, సాయి చరిత్, రోహిత్, వెంకటాద్రి (కృష్ణా జిల్లా); బాలికలు: జోత్స్న (కృష్ణా), అక్షయ (హైదరాబాద్), రిఫత్ (కృష్ణా); ఇండియన్ రౌండ్-బాలురు: లక్ష్మణ రావు, రమేశ్ (వైజాగ్), మహేశ్ (రంగారెడ్డి); బాలికలు: నవ్యశ్రీ (నిజామాబాద్), పావని, సుష్మ (రంగారెడ్డి). -
'ప్రజంట్ లవ్' ఆడియో ఆవిష్కరణ
-
తుమ్మెద సినిమా స్టిల్స్
-
‘కొత్తొక వింత’ యూనిట్ సందడి
ఒకప్పుడు ఇతర హీరోల సినిమాలు అనేకం చూసిన వారిద్దరూ ఇపుడు అదే థియేటర్లో తాము నటించిన సినిమా చూసి మురిసిపోయారు. వారే కొత్తొక వింత చిత్రం హీరోలు అనిల్ కల్యాణ్, స్వరూప్‌రాజ్. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. కల్యాణ్, స్వరూప్రాజ్లది కాకినాడ కావడంతో తొలి రోజు తొలి షో ని వారు కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ థియేటర్లో చూశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. అనిల్ కల్యాణ్ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే చిత్రసీమలో అడుగు పెట్టాను. బాలనటుడిగా 25 సినిమాల్లో నటించాను. ‘జయం’, ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘ఛత్రపతి’ చిత్రాలు నాకు బాగా గుర్తింపు తెచ్చాయి. ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ సినిమాలో పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యువత కొత్త ట్రెండ్ పేరుతో వ్యసనాలకు బానిపై పెడత్రోవ పడుతోందనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.’ అన్నారు. మరో హీరో స్వరూప్‌రాజ్ మాట్లాడుతూ ‘నాకు దర్శకత్వం అంటే ఇష్టం. గుండె ఝల్లుమంది సినిమాలో నటించడంతో పాటు డైరక్టర్ దగ్గర సహాయకునిగా కూడా పనిచేశాను. కాకినాడ కోరంగి కైట్ కళాశాలలో బీటెక్ చదివాను. అలనాటి నటి గీతాంజలికి నేను మేనల్లుడి వరుస అవుతాను. ఈ బంధుత్వంతోనే నేను చిన్నతనంలోనే చిత్రసీమలో అడుగుపెట్టాను.’ అన్నారు. ఈ చిత్రం హీరోయిన్ వినీషా నాయుడు మాట్లాడుతూ ‘నేను తొలిసారిగా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. భారతీరాజా దర్శకత్వంలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను.’ అన్నారు. కాగా యూనిట్ సభ్యులకు దేవి మల్టీప్లెక్స్ థియేటర్ మేనేజర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. -
‘కొత్తొక వింత’ సినిమా స్టిల్స్
-
తుమ్మెద సినిమా స్టిల్స్
రాజా, అక్షయ నాయకా నాయకుడిగా కలసి నటిస్తున్న తుమ్మెద సినిమా స్టిల్స్.