‘కొత్తొక వింత’ యూనిట్ సందడి
‘కొత్తొక వింత’ యూనిట్ సందడి
Published Sat, Dec 28 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
ఒకప్పుడు ఇతర హీరోల సినిమాలు అనేకం చూసిన వారిద్దరూ ఇపుడు అదే థియేటర్‌లో తాము నటించిన సినిమా చూసి మురిసిపోయారు. వారే కొత్తొక వింత చిత్రం హీరోలు అనిల్ కల్యాణ్, స్వరూప్‌రాజ్. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. కల్యాణ్, స్వరూప్‌రాజ్‌లది కాకినాడ కావడంతో తొలి రోజు తొలి షో ని వారు కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ థియేటర్‌లో చూశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. అనిల్ కల్యాణ్ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే చిత్రసీమలో అడుగు పెట్టాను. బాలనటుడిగా 25 సినిమాల్లో నటించాను. ‘జయం’, ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘ఛత్రపతి’ చిత్రాలు నాకు బాగా గుర్తింపు తెచ్చాయి. ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ సినిమాలో పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
యువత కొత్త ట్రెండ్ పేరుతో వ్యసనాలకు బానిపై పెడత్రోవ పడుతోందనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.’ అన్నారు. మరో హీరో స్వరూప్‌రాజ్ మాట్లాడుతూ ‘నాకు దర్శకత్వం అంటే ఇష్టం. గుండె ఝల్లుమంది సినిమాలో నటించడంతో పాటు డైరక్టర్ దగ్గర సహాయకునిగా కూడా పనిచేశాను. కాకినాడ కోరంగి కైట్ కళాశాలలో బీటెక్ చదివాను. అలనాటి నటి గీతాంజలికి నేను మేనల్లుడి వరుస అవుతాను. ఈ బంధుత్వంతోనే నేను చిన్నతనంలోనే చిత్రసీమలో అడుగుపెట్టాను.’ అన్నారు. ఈ చిత్రం హీరోయిన్ వినీషా నాయుడు మాట్లాడుతూ ‘నేను తొలిసారిగా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. భారతీరాజా దర్శకత్వంలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను.’ అన్నారు. కాగా యూనిట్ సభ్యులకు దేవి మల్టీప్లెక్స్ థియేటర్ మేనేజర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Advertisement
Advertisement