Swaroop Raj
-
అందుకే డిటెక్టివ్ కథకి ఓకే చెప్పా
‘‘నేను 7–8 తరగతి చదువుతున్నప్పటి నుంచే నటన, నాటకాలంటే ఇష్టం. పదో తరగతి వరకూ హైదరాబాద్‌లోనే చదివా. మా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భోపాల్ నిట్‌లో చేరి, ఇంజినీరింగ్ పూర్తిచేశా. యూ ట్యూబ్ నుంచి నా ప్రయాణం బిగ్ స్క్రీన్‌కి మారింది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్‌రాజ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి చెప్పిన విశేషాలు. ► బాంబేలో సినిమా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను కూడా. నటన బాగుంది అన్నారే కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఫ్రెండ్స్ సలహా మేరకు స్టాండప్ కామెడీ ఆడిషన్స్‌లో పాల్గొని గెలిచా. దాంతో యూ ట్యూబ్ చానెల్లో నా వీడియోస్ పెట్టారు. ‘హానెస్ట్ వెడ్డింగ్’ బాగా వైరల్ అవడంతో పాటు పది మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ చానెల్స్‌కి ఇంత ఆదరణ ఉందని అప్పుడే తెలిసింది. ‘ఇంగ్లీష్ ఇంటర్వ్యూ’ అని మరో వీడియో వాట్సాప్‌లో బాగా వైరల్ అయింది. అది చూసిన డైరెక్టర్ స్వరూప్ రాజ్‌గారు ఫోన్ చేసి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో డిటెక్టివ్‌గా చేస్తారా? అన్నారు. కథ వినగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ పాత్ర నాకంత నచ్చింది. పైగా తెలుగులో ఈ మధ్య డిటెక్టివ్ కథలు రాలేదు. ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని ఓకే చెప్పా. ► బెంగళూరులో థియేటర్ ఆర్ట్స్ చేశా. హైదరాబాద్‌లో ఓ థియేటర్ ఆర్ట్స్ వర్క్‌షాప్‌లో నేను, విజయ్ దేవరకొండ కలిశాం. అప్పటి నుంచి మేం ఫ్రెండ్స్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో లీడ్ రోల్స్ కోసం ప్రయత్నిస్తే, హీరో ఆపోజిట్ గ్యాంగ్‌కి ఎంపికయ్యాం. ప్రస్తుతం హిందీలో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిచ్చొరే’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నాను. -
‘కొత్తొక వింత’ యూనిట్ సందడి
ఒకప్పుడు ఇతర హీరోల సినిమాలు అనేకం చూసిన వారిద్దరూ ఇపుడు అదే థియేటర్లో తాము నటించిన సినిమా చూసి మురిసిపోయారు. వారే కొత్తొక వింత చిత్రం హీరోలు అనిల్ కల్యాణ్, స్వరూప్‌రాజ్. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. కల్యాణ్, స్వరూప్రాజ్లది కాకినాడ కావడంతో తొలి రోజు తొలి షో ని వారు కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ థియేటర్లో చూశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. అనిల్ కల్యాణ్ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే చిత్రసీమలో అడుగు పెట్టాను. బాలనటుడిగా 25 సినిమాల్లో నటించాను. ‘జయం’, ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘ఛత్రపతి’ చిత్రాలు నాకు బాగా గుర్తింపు తెచ్చాయి. ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ సినిమాలో పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యువత కొత్త ట్రెండ్ పేరుతో వ్యసనాలకు బానిపై పెడత్రోవ పడుతోందనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.’ అన్నారు. మరో హీరో స్వరూప్‌రాజ్ మాట్లాడుతూ ‘నాకు దర్శకత్వం అంటే ఇష్టం. గుండె ఝల్లుమంది సినిమాలో నటించడంతో పాటు డైరక్టర్ దగ్గర సహాయకునిగా కూడా పనిచేశాను. కాకినాడ కోరంగి కైట్ కళాశాలలో బీటెక్ చదివాను. అలనాటి నటి గీతాంజలికి నేను మేనల్లుడి వరుస అవుతాను. ఈ బంధుత్వంతోనే నేను చిన్నతనంలోనే చిత్రసీమలో అడుగుపెట్టాను.’ అన్నారు. ఈ చిత్రం హీరోయిన్ వినీషా నాయుడు మాట్లాడుతూ ‘నేను తొలిసారిగా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. భారతీరాజా దర్శకత్వంలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను.’ అన్నారు. కాగా యూనిట్ సభ్యులకు దేవి మల్టీప్లెక్స్ థియేటర్ మేనేజర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. -
‘కొత్తొక వింత’ సినిమా స్టిల్స్