సాక్షి, హైదరాబాద్: చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక అంతర్ జిల్లా అండర్-14 (మినీ సబ్ జూనియర్) ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అక్షయ, మహేశ్ సత్తాచాటారు. విజయవాడలోని ఓల్గా ఆర్చరీ ఫీల్డ్‌లో బుధవారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో నగరానికి చెందిన అక్షయతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేశ్, పావని, సుష్మ చక్కని ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు.ఈ జట్టు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది.
బాలికల కాంపౌండ్ విభాగంలో అక్షయ రెండో స్థానంలో నిలువగా, బాలుర ఇండియన్ రౌండ్ విభాగంలో మహేశ్ మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఇండియన్ రౌండ్‌లో పావని, సుష్మ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు.
ఎంపికైన క్రీడాకారుల జాబితా: కాంపౌండ్ విభాగం-బాలురు: మహేశ్, సాయి చరిత్, రోహిత్, వెంకటాద్రి (కృష్ణా జిల్లా); బాలికలు: జోత్స్న (కృష్ణా), అక్షయ (హైదరాబాద్), రిఫత్ (కృష్ణా); ఇండియన్ రౌండ్-బాలురు: లక్ష్మణ రావు, రమేశ్ (వైజాగ్), మహేశ్ (రంగారెడ్డి); బాలికలు: నవ్యశ్రీ (నిజామాబాద్), పావని, సుష్మ (రంగారెడ్డి).
జాతీయ ఆర్చరీకి అక్షయ
Published Wed, Apr 2 2014 11:43 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement