Mariamma
-
ఆ పాప వైద్యం ఖరీదు రూ.18 కోట్లు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన నాగేష్, మరియమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అక్షయ (2)కు అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే వ్యాధి వచ్చింది. ఈ కారణంగా పాప ఎదుగుతున్నా కండరాలు సహకరించక నిలబడలేకపోతోంది. నడవలేక.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పాప లక్షణాలను బట్టి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌లో జెనటిక్ పరీక్షను చేయించారు. పరీక్షలో ఆ పాపకు స్పైనల్ మసు్కలర్ అట్రోఫిగా నిర్ధారణ అయ్యింది. నిర్లక్ష్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. న్యూరోఫిజీíÙయన్ హేమంత్‌కుమార్ ఆ పాప పరిస్థితిని వివరిస్తూ.. పాప చికిత్సకు జోల్జెరి ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ చేయాలని, దాని ఖరీదు రూ.18 కోట్లు అవుతుందని చెప్పారు. జన్యుపర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. కాగా.. బిడ్డను కాపాడుకోవడం రోజు కూలీ చేసుకునే తమకు చాలా కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అక్షయను రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు. -
మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం'
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో సమర్థంగా దర్యాప్తు చేసే సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలున్నాయని, సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి దర్యాప్తు జరుగుతోందని, లాకప్‌డెత్‌కు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇతర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లాకప్‌డెత్ ఘటనపై న్యాయ విచారణతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత జయవింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఆదేశిస్తే మేము సిద్ధం: సీబీఐ న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. మరియమ్మ గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కల్యాణ్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐపై పనిభారం ఉందా అని ధర్మాసనం కల్యాణ్‌ను ప్రశ్నించగా.. ధర్మాసనం ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తును సమర్థంగా చేస్తారని, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ఏజీ అభ్యర్థించారు. మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని, ఇంట్లో ఒకరికి ఉపాధి కల్పించామని నివేదించారు. దర్యాప్తులో ఎవరైనా బాధ్యులని తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీ సంబంధన్ కూడా ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
వివాహిత మహిళ ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బుడగ జంగాల కాలనీలో నివసించే మరియమ్మ (35) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయింది. భర్త లక్ష్మణ్ పెట్టే బాధలు భరించలేక మరియమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక ....
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో ఎస్ఐ హామీతో విరమణ ఎ.కొండూరు : కట్టుకున్న భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేయడంతో పురుగు మందు తాగి భార్య మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కోడూరు గ్రామం లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాత రేపూడి గ్రామానికి చెందిన మరియమ్మ(30)తో కోడూరుకు చెందిన ఎం.వెంకటేశంతో13ఏళ్ల క్రితం వివాహమైంది.అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని గ్రామ పెద్దలు సర్ధి చెప్పేవారు. ఇటీవల మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భర్తపెట్టే మానసిక,శారీరక బాధలు తాళలేక భార్య మరియమ్మ రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. భర్త వెంకటేశం అతని బావ పాత రేపూడి గ్రామానికి వెళ్లి భార్య, అత్తమామలకు సర్ధిచెప్పి, కాపురానికి తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన 15 రోజుల తరువాత వారిరువురి మధ్య మళ్లీ గొడవలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం వెంకటేశం తన భార్యను కొట్టడంతో విరక్తి చెందిన ఆమె పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న అమెను తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిం చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు. తండ్రి శైలేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 498-ఎ రెడ్‌విత్ 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యోసోబు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయాలని రాస్తారోకో వెంకటేశంను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బంధువులు, గ్రామస్తులు, దళితులు పోలీస్ స్టేషన్ ఎదుట విజయవాడ- తిరువూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వెంకటేశాన్ని వెంటనే అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకపోవడంతో రాస్తారోకో చేస్తున్నామని, మాకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేస్తామని ఎస్సై యోసోబు హామిఇవ్వడంతో రాస్తారోకో విరమిం చారు. ఎండ తీవ్రంగా ఉండటంతో మృతురాలి తల్లితో పాటు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అల్లుడే హతమార్చాడు -మరియమ్మ తల్లిదండ్రుల ఆరోపణ మ్మాయి మరియమ్మను అల్లుడు వెంకటేశం చంపాడని తల్లి జామాయమ్మ, తండ్రి శైలేశ్ సోమవారం విలేకరులకు తెలిపారు. అల్లుడు మద్యానికి బానిసై రోజూ చిత్రహింసాలకు గురి చేస్తుండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. మంచితనంగా మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లిన 10 రోజులకే మళ్లీ గొడవ పడి అమ్మాయిని కొట్టి పురుగు మందు బలవంతంగా తాగించారని ఆరోపించారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందిన తర్వాత తమకు సమాచారం అందించారని కంటతడి పెట్టారు.