సాయంత్రం వేళ సీబీఐ ఆఫీస్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
సాయంత్రం వేళ సీబీఐ ఆఫీస్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
Published Sat, Oct 26 2013 2:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సాయంత్రం కోఠిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆఫీసు వేళల తరువాత సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మాజీ జాయింట్ డెరైక్టర్ సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సమాచారం కొద్ది సేపట్లోనే బయటకు పొక్కింది. ఆఫీసు పనివేళల తరువాత ఆయన కోఠి కార్యాలయానికి చేరుకుని అప్పటికే సీలు వేసిన జాయింట్ డెరైక్టర్ చాంబర్‌ను సిబ్బంది ద్వారా తెరిపించారు.
తరువాత దాదాపు గంటన్నరసేపు ఆయన కార్యాలయంలోనే గడిపారు. కొద్ది ఆలస్యంగా విషయం తెలిసిన వెంటనే.. సాక్షి ఫొటోగ్రాఫర్ కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే లక్ష్మీనారాయణ ఆఫీసు నుంచి బయటికొచ్చి తనకు రాష్ట్ర పోలీసు విభాగం కేటాయించిన వాహనంలో తిరిగి వెళ్లారు. లక్ష్మీనారాయణ రాష్ట్రంలో సీబీఐ ఎస్పీగా, డీఐజీగా, జాయింట్ డెరైక్టర్‌గా ఏడు సంవత్సరాలపాటు పనిచేశారు. సీబీఐలో డిప్యుటేషన్ గడువు ముగియడంతో గత జూన్ మొదటి వారంలో ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. విధుల నుంచి రిలీవ్ అయిన నాలుగు నెలల తరువాత, అదీ ఆఫీసు పనివేళలు ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయానికి వచ్చి దాదాపు గంటన్నరపాటు ఉండడం గమనార్హం.
Advertisement
Advertisement