CBI office
-
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
నేడు సీబీఐ ముందుకు సీఎం కేజ్రీవాల్
-
చెన్నై సీబీఐ ఆఫీసులో భారీ చోరీ
-
సీబీఐ, ఈడీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతీ పోలీస్ స్టేషన్‌లోని ప్రధాన ద్వారం, లోపలికి, బయటకు వెళ్లే మార్గాలు, ఇంటరాగేషన్ సెల్స్, లాకప్ గదులు, కారిడార్లు, రిసెప్షన్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
సీబీఐ నోటీసులపై హైకోర్టుకు సుజనా
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27వ తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్లో పేర్కొన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతోగానీ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీలో తాను వాటాదారు కాదని, డైరెక్టర్ కూడా కాదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ. 72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయని సుజనా ఆరోపించారు. ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని చెప్పినా సీబీఐ తనకు మరో నోటీసు పంపిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరారు. -
ఢిల్లీలో రాహుల్ అరెస్టు, విడుదల
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఢిల్లీ లోధి రోడ్‌లోని దయాళ్‌సింగ్ కళాశాల నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయం వరకు అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించింది. పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు సుమారు 130 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, భూపిందర్‌సింగ్ హూడా, అహ్మద్ పటేల్, మోతిలాల్ వోహ్రా, వీరప్ప మెయిలీ, ఆనంద్ శర్మలతో పాటు శరద్ యాదవ్(లోక్తాంత్రిక్ జనతాదళ్), డి.రాజా(సీపీఐ), నదిముల్ హక్(టీఎంసీ) తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీబీఐలో అనూహ్యంగా జరిగిన అధికార మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పట్నా, హైదరాబాద్, గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్ తదితర పట్టణాల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగారు. చండీగఢ్‌లో ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. నిజం దాగదు.. అంతకుముందు, లోధిరోడ్‌లో ర్యాలీకి హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అన్ని సంస్థల్ని ఎన్డీయే నాశనం చేస్తోందని మండిపడ్డారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ..రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. మోదీ విచారణ నుంచి పారిపోతున్నా, సీబీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగించినా నిజం మాత్రం దాగదని తేల్చిచెప్పారు. ‘చౌకీదార్(మోదీని ఉద్దేశించి) దొంగతనానికి పాల్పడటాన్ని అనుమతించం. వైమానిక దళం, యువత నుంచి ఆయన డబ్బు దొంగిలించిన సంగతి దేశం మొత్తానికి తెలుసు. మోదీ విచారణ నుంచి పారిపోయినా, నిజం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. నిజమేంటో ప్రధానికి చూపడానికే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం నిజాన్ని బంధించలేదని పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన, తాను జైలులో కూర్చున్నప్పటి ఫొటోలను రాహుల్ ట్వీట్ చేశారు. -
సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట శుక్రవారం ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలతో కలిసి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగన రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట జరిగిన నిరసనల్లో పార్టీ రాష్ట్ర చీఫ్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. మోదీ సర్కార్ సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చి దర్యాప్తు ఏజెన్సీని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీబీఐ చీఫ్ అలోక్ వర్మ తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు సీబీఐ, సీవీసీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది. సీబీఐ నూతన చీఫ్ ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదని, కేవలం పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని కోర్టు స్పష్టం చేసింది. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటిని అరెస్ట్ చేసిన సీబీఐ
-
సీబీఐ ఎదుట హాజరైన హరీశ్ రావత్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మంగళవారం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ కొనసాగుతోంది. ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీష్ రావత్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపుతూ ఉన్న ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ దీనిపై విచారణ చేపట్టింది. విచారణకు హజరయ్యేందుకు వెళుతూ రావత్... తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ అడిగినా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లు ఓ వీడియో టేపులు బయటకు వచ్చిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్‌కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. -
సీబీఐ కార్యాలయానికి హీరో విష్ణు
హైదరాబాద్: హీరో మంచు విష్ణు సోమవారం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఓ కేసులో సీబీఐ అధికారుల ముందు సాక్షిగా ఆయన హాజరయ్యారు. గతంలో ఓ తెలుగు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీకి రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విష్ణును సీబీఐ సాక్షిగా పేర్కొంది. శ్రీనివాసరావు కేసులో వివరాల సేకరణ కోసం సీబీఐ ఆదేశాల మేరకు విష్ణు ఇక్కడికి వచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు కొందరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని గతంలో మంచు విష్ణు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను సాక్షిగా పిలిచినట్టు తెలుస్తోంది. -
సాయంత్రం వేళ సీబీఐ ఆఫీస్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సాయంత్రం కోఠిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆఫీసు వేళల తరువాత సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మాజీ జాయింట్ డెరైక్టర్ సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సమాచారం కొద్ది సేపట్లోనే బయటకు పొక్కింది. ఆఫీసు పనివేళల తరువాత ఆయన కోఠి కార్యాలయానికి చేరుకుని అప్పటికే సీలు వేసిన జాయింట్ డెరైక్టర్ చాంబర్‌ను సిబ్బంది ద్వారా తెరిపించారు. తరువాత దాదాపు గంటన్నరసేపు ఆయన కార్యాలయంలోనే గడిపారు. కొద్ది ఆలస్యంగా విషయం తెలిసిన వెంటనే.. సాక్షి ఫొటోగ్రాఫర్ కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే లక్ష్మీనారాయణ ఆఫీసు నుంచి బయటికొచ్చి తనకు రాష్ట్ర పోలీసు విభాగం కేటాయించిన వాహనంలో తిరిగి వెళ్లారు. లక్ష్మీనారాయణ రాష్ట్రంలో సీబీఐ ఎస్పీగా, డీఐజీగా, జాయింట్ డెరైక్టర్‌గా ఏడు సంవత్సరాలపాటు పనిచేశారు. సీబీఐలో డిప్యుటేషన్ గడువు ముగియడంతో గత జూన్ మొదటి వారంలో ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. విధుల నుంచి రిలీవ్ అయిన నాలుగు నెలల తరువాత, అదీ ఆఫీసు పనివేళలు ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయానికి వచ్చి దాదాపు గంటన్నరపాటు ఉండడం గమనార్హం. -
సీబీఐ ఎస్పీగా చంద్రశేఖరన్ బాధ్యతల స్వీకారం
16న రిలీవ్కానున్న సీబీఐ డీఐజీ వెంకటేష్ సాక్షి, హైదరాబాద్: సీబీఐ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖరన్ గురువారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ ముంబై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం(ఈవోడబ్ల్యు)లో విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖరన్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సీబీఐ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు సీబీఐ హైదరాబాద్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న హెచ్.వెంకటేష్ ఈనెల 16వ తేదీన రిలీవ్ కానున్నారు. సొంత క్యాడర్ కేరళకు ఆయన వెళ్లనున్నారు.