Lakshmi Narayana
-
సాహితీలో తవ్వేకొద్దీ డొల్ల కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రీలాంచ్ స్కాంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణతోపాటు కంపెనీ డైరెక్టర్లు సైతం అందినకాడికి దండుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను సోమవారం నుంచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1,800 మంది కస్టమర్ల నుంచి రూ. 2 వేల కోట్ల మేర వసూలు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆ సొమ్మును ఏఏ కంపెనీల్లోకి మళ్లించారన్న దానిపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇదే అంశంపై లక్ష్మీనారాయణను గురువారం కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. గత 3 రోజులుగా ఈడీ సేకరించిన సమాచారం మేరకు లక్ష్మీనారా యణతోపాటు మరికొందరు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో లక్ష్మీనారాయణ సోదరుడు హరిబాబు, గోలమారి ఆంథోనిరెడ్డి, అతడి కుమారుడు అక్షయ్‌రెడ్డి, సతీశ్ చుక్కపల్లి, లక్ష్మీనారాయణ భార్య పార్వతి, లక్ష్మీనారాయణ కుమారుడు సాతి్వక్, పూర్ణచందరరావు సండులు సైతం డైరెక్టర్లుగా కొనసాగారు. ఈ భారీ కుంభకోణంలో లక్ష్మీనారాయణ తర్వాత కీలక పాత్రధారులుగా గోలమారి ఆంధోనిరెడ్డి, పూర్ణచందర్‌రావులు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. దీంతో చివరిరోజు మరిన్ని కీలక అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. నేతల పేర్లు చెప్పి రూ. కోట్లు పక్కదారి పట్టించిన ఆంథోనిరెడ్డి? కీలక నిందితుల్లో ఒకరిగా ఈడీ అనుమానిస్తున్న గోలమారి ఆంథోనిరెడ్డి నాయకుల పేర్లు చెప్పి కమీషన్ల పేరిట పదుల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్‌కు కావాల్సిన అనుమతులు ఇప్పిస్తానని ఇద్దరు నేతల కోసమని రూ.40 కోట్ల మేర తీసుకున్నట్టుగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. హెచ్ఎండీఏ అనుమతుల కోసం కొందరు అధికారులకు ఇవ్వాలంటూ రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఆంథోనిరెడ్డి తన కుమారుడు అక్షయ్‌రెడ్డిని సైతం డైరెక్టర్‌గా పెట్టి అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరో డైరెక్టర్ పూర్ణచందర్రావు సైతం పెద్ద మొత్తంలోనే డబ్బులు దండుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బ్రోకర్ల ద్వారా అడ్డగోలుగా వసూళ్లు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట పెద్ద ఎత్తున మోసాలకు తెర తీసేందుకు కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణతోపాటు ఇతర డైరెక్టర్లూ వారికి నచ్చిన విధంగా బ్రోకర్లను నియమించుకొని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో కొందరు ఎన్ఆర్ఐలను సైతం ఈ కుంభకోణంలోకి లాగేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. కొందరు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కంపెనీ లెక్కల్లోకి చూపకుండా కొందరు ఇష్టారీతిన వాడుకున్నట్టు సమాచారం. డొల్ల కంపెనీల్లోకి డబ్బుల మళ్లింపు ప్రీలాంచ్ పేరిట వసూలు చేసిన డబ్బును దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీలను సృష్టించారు. ఒక కంపెనీలో ఉన్నవారే మరో కంపెనీలో డైరెక్టర్లుగా, భాగస్వాములుగా వీటిని ఏర్పాటు చేసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. -
మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.' లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. నెలకొరిగినా తిప్పుకుంది! డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్) 3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం! 3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది. – ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా – ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు (చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం) -
అంతర్వేది బీచ్ వద్ద విషాదం.. నవ వధువరులిద్దరూ..
ఏలూరు: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ముచ్చటగా రెండు మాసాలు గడవలేదు. పెళ్లి పందిరి తోరణాలు కూడా వాడలేదు. అంతలోనే నవవధూవరులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నూతన జంట గల్లంతయ్యారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో వధూవరుల ఇళ్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన అంబటి పరుశురామయ్య, ఉదయలక్ష్మీ మొదటి కుమార్తె గాయత్రీ (21)ని పశ్చిమగోదావరి జిల్లా జువ్వాలపాలెంకు చెందిన రేలంగి బసవలింగం, జయలక్ష్మీ కుమారుడు లక్ష్మీనారాయణ (26)తో నవంబర్ 1న కై కలూరు నియోజకవర్గం సింగరాయపాలెం గుడిలో ఘనంగా వివాహం జరిపించారు. లక్ష్మీనారాయణ బీటెక్, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు లక్ష్మీనారాయణ, గాయత్రీ ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని నాలుగు గంటలకు బీచ్‌కు వెళ్లారు. బంధువులతో కలిసి కాకుండా వాహనంపై బీచ్‌లో దూరంగా వెళ్లారు. అక్కడ వాహనం, సెల్ఫోన్లు ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. సెల్‌ఫోను ఆధారంగా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో వరుడి తండ్రి బసవలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు, మైరెన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వారి జాడ లేదు. ఇవి కూడా చదవండి: 11మందిని పొట్టన పెట్టుకుని? -
‘గంటా’ అంటే గయ్ గయ్!
సాక్షి, అమరావతి: యాధృచ్ఛికమో.. తనకు కలిసొస్తుందని భావించారో తెలియదుగానీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు ‘గంటా’ అయితే మరోపేరు ‘లక్ష్మీనారాయణ’!! విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గయ్ గయ్‌మంటున్నారు! ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతోంది! అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో.. ఇటు స్కిల్ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు, వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కీలకం కాగా స్కిల్ స్కామ్‌లో గంటా సుబ్బారావు, రిటైర్డ్ అధికారి లక్ష్మీ నారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు! చిర్రుబుర్రులు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పిట్లోనే ఉంది మరి!! అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలతోపాటు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...?? అంతా ఒకే ఒక్కరే.. గంటా 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)! తన అక్రమాలకు అక్షయపాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డీసీ పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్, రిటైర్డ్ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు. కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డీసీతోపాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులూ కట్టబెట్టేశారు. గంటా సుబ్బారావును ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్– చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ–సీఈవో)గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్ఎస్డీసీని ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. దాంతో ఏపీఎస్ఎస్ఎస్డీసీలో ప్రాజెక్ట్ ఫైళ్లు తయారు చేసేది, ఉన్నత విద్యా శాఖ, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖల్లో పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపేది, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి తుది ఆమోదం తెలిపేది అంతా ఒకే ఒక్కరే ఆయనే గంటా సుబ్బారావు కావడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తికి నాలుగు పోస్టులు కట్టబెడుతూ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురి ప్రస్తావనే రానివ్వకుండా గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిట్‌కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృథా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది. అందులో ప్రతి గంటకు ఐదు నిముషాలు విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకున్నారు. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదువుతూ కాలహరణం చేశారు. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృథా చేశారు. రెండో రోజు తన రాజకీయ అనుభవం గురించి పాతచింతకాయ పచ్చడిలా కథలు చెబుతూ సమయాన్ని గడిపారు. గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ గురించి గానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి ప్రస్తావించగానే చంద్రబాబు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం గమనార్హం. అంటే ఆ ఐదుగురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. బాబు బాల్య స్నేహితుడే.. విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్ అధికారి కె.లక్ష్మీనారాయణను ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారు. తాను ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీలో వ్యవహారాలు సాగేలా చూసేందుకే లక్ష్మీనారాయణను తెచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ రూపకల్పన, అందుకు అనుగుణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు.. అంతా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. అంటే స్కిల్ స్కామ్ కీలక గుట్టు అంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వద్దే ఉంది. ఈ క్రమంలో వారిద్దరిని ఎందుకు నియమించారు? వారితో సాగించిన వ్యవహారాలేమిటి? అని సిట్ అధికారులు అడిగేసరికి చంద్రబాబు కంగుతిన్నారు. ఎవరిని విచారించాలో బాబే చెబుతారట..! ఎక్కడైనా దర్యాప్తు అధికారులు చట్ట ప్రకారమే విచారణ నిర్వహిస్తారు. దీనిపై ముద్దాయిలు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారు. స్కిల్ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులను ఎందుకు విచారించరంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి ప్రేమచంద్రారెడ్డి ఆ పోస్టులోకి వచ్చేసరికే 90శాతం నిధులను టీడీపీ ప్రభుత్వం చెల్లించేసింది. దీంతో ఆయన మూడో పార్టీ నివేదిక కావాలని కోరారు. దీనిపై నాడు గంటా సుబ్బారావు, డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు సీఐటీడీ పేరుతో కనికట్టు చేశారు. స్కిల్ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పొందుపరుస్తూ ఇచ్చిన ఓ నివేదికను మూడో పార్టీ మదింపు నివేదికగా మభ్యపుచ్చారు. ఈ విషయాలన్నీ సిట్ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడయ్యాయి. సీఐటీడీ ఆ విషయాన్ని సిట్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించింది కూడా. సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. దీన్నిబట్టి సిట్ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తోందన్నది వెల్లడవుతోంది. -
‘ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం పవన్ కల్యాణ్‌ని వాడుకున్నాం
‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ లాంటి సినిమాలను అందించిన సంస్థ పూర్ణోదయ మవీ క్రియేషన్స్. దీని అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు.. `ఫస్ట్ డే ఫస్ట్ షో` కథ ఎలా ఉండబోతుంది ? వంశీ : ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా `ఫస్ట్ డే ఫస్ట్ షో` టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్ల సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో గోల్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా సర్ ప్రైజులు ఉంటాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇద్దరు దర్శకులని తీసుకోవడానికి కారణం ? వంశీ : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ చాలా ఎక్సయిట్ చేసింది. దర్శకుడిగా లాంచ్ అవ్వడం కంటే కథని అద్భుతంగా తీయాలనే ఆలోచనపైనే దృష్టి ఉండేది. ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు అంత అనుభవం లేదు. మరొకరు ఉండే బావువుంటుందని అనుకున్నాం. నాకు లక్ష్మీ నారాయణకి మంచి సింక్ ఉంది. చాలా అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా ? వంశీ : ఖుషి సినిమా సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పేవారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్తారో చెబుతుంటే చాలా సీరియస్ గా, అదే సమయంలో ఫన్నీ అనిపిస్తాయి. అప్పట్లో చాలా మానియా ఉండేది. ఖుషి అంటే 2001.. ఈ సినిమా కోసం అప్పటి వాతావరణం రిక్రియేట్ చేశారా ? చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. టీజర్ లో చూస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దాంతో పాటు చాలా వరకు అప్పటి వావతరణం సృష్టించాం. హీరో హీరోయిన్ల గురించి వంశీ: శ్రీకాంత్ పిట్టగోడ అనే సినిమాలో చేశాడు. ఆడిషన్ చేశాం. తెలంగాణ యాస, సింపుల్ హ్యుమర్, అమాయకత్వంతో కథకు సరిగ్గా నప్పాడు. హీరోయిన్ సంచితాది బిహార్. ఫస్ట్ డే ఫస్ట్ షో మరో జాతిరత్నాలు అనుకోవచ్చా ? వంశీ: ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే జాతిరత్నాలు ఫ్లేవర్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అనుభవాలు గురించి ? లక్ష్మీనారాయణ : తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో వుండేది. అలా పంజా సినిమా చూశా. చాలా మంది జనం వుండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట వుండేది. అందుకే ఈ కథకి చాలా కనెక్ట్ అయ్యా. వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కథలో పవన్ కళ్యాణ్ ని ఎంతవరకూ వాడుకున్నారు ? హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కథలో ఎంత మేరకు వాడాలో అంతవరకు ఉంటుంది. ఏది వాడినా సినిమాని వినోదాత్మకంగా చేయడానికే ప్రయత్నించాం. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది ? లక్ష్మీ నారాయణ : సీనియర్స్ తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారి అనుభవంతో యాడ్ చేసిన ఫ్లావర్ అద్భుతం అనిపించింది. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం అనిపించేది. ఐతే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. అందరి సీన్స్ అద్భుతంగా వచ్చాయి. యంగ్ టీంతో పని చేయడాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. భవిష్యత్ లో ఇద్దరూ కలసి ప్రయాణించే ఆలోచన ఉందా ? వంశీ: ఇప్పటికి ఏం అనుకోలేదు. ఈ సినిమాకి అవసరం కాబట్టి కలసి చేశాం. మీకు బలమున్న జోనర్ ఏది ? వంశీ : కామెడీ. అలాగే నాకు నటనపై కూడా ఆసక్తి ఎక్కువ లక్ష్మీ నారాయణ: అన్ని జోనర్స్ చేస్తాను. కామెడీ కొంచెం ఎక్కువ ఇష్టం సంగీతం గురించి చెప్పండి ? రధన్ చాలా ప్రతిభ ఉన్న కంపోజర్. భాష తెలియనప్పటికీ ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వుంది. పాటలతో పాటు అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది ? పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. సినిమాలో స్వర్ణయుగం చూశారు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటిసారి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. చాలా ఫాస్ట్ గా చేశారు. అనుకున్న షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ ఫినిష్ చేయడం వారికి చాలా నచ్చింది. కొత్తగాచేయబోతున్న సినిమాలు ? కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. -
నారాయణ మంత్రం... శ్రీమన్నారాయణ భజనం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: వేదమంత్రోచ్చారణ, శ్రీమన్నారాయణుడి శరణు ఘోషతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతం మార్మోగిపోయిది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల కోసం ముస్తాబైన సమతా స్ఫూర్తి కేంద్రం గురువారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్ష్మీనారాయణుడి సుప్రభాత సేవతో గురువారం కార్యక్రమాలు మొదలయ్యాయి. దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి వాసుదేవేష్టి అష్టోత్తర శతనామ పూజను నిర్వహించారు. ఆరాధన, విష్వక్సేనుడి పూజ, ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా గరుడ పతాకాన్ని అవిష్కరించారు. గరుడుడి ద్వారా యాగశాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఆ తర్వాత అగ్నిమథన కార్యక్రమంతో లక్ష్మీనారాయణ మహాయాగం ప్రారంభమైంది. సహజ పద్ధతిలో (శమీ దండం, రావి దండం కర్రలతో మథించి) అగ్నిని పుట్టించిన అనంతరం.. ఆ అగ్నిని యాగశాలలకు వితరణ చేసి కుండాలలో నిక్షిప్తం చేసిన రుత్వికులు అత్యంత వైభవంగా యాగాన్ని ప్రారంభించారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆచార్య ఆరాధన... సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రవచన మండపంలో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీప ప్రజ్వలనతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది భక్తులు క్యూలైన్లలో ఆసీనులయ్యారు. ఆచార్య స్మరణ అనంతరం చిన జీయర్‌స్వామితో పాటు మైహోం సంస్థల అధినేత జె.రామేశ్వరరావు భక్తుల చెంతకు వచ్చి భగవంతుడి ప్రతిమతో కూడిన డాలర్లను పంపిణీ చేశారు. అనంతరం భక్తులు వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో చిన జీయర్ స్వామి భక్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని అందరూ పఠించారు. అదే సమయంలో చిన్న జీయర్ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను, స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీమాన్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. అలరించిన కార్యక్రమాలు ఓ వైపు హోమాలు, మరో వైపు కనువిందు చేసే నృత్యాలు, ఇంకోవైపు వినసొంపైన సంప్రదాయ సంగీతం, భక్తి భజనలతో శ్రీరామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. యాగశాలలో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తుండగా.. ప్రవచన మండపంలో గాయని సురేఖ బృందం సంప్రదాయ సంగీతంతో వినసొంపైన గానాన్ని ఆలపించారు. శ్రీపాద రమాదేవి శిష్య బృందం ‘వాసుదేవాజ్మజ, నారాయణ.. శ్రీమన్నారాయణ’కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో భజన కూడా ఒకటి.. అలాంటి రంగంలో ప్రముఖ కళాకారుడుగా గుర్తింపు పొందిన నర్సింగరావు తన బృందంతో కలిసి ‘హరే కృష్ణ.. హరే కృష్ణ’భజనకీర్తనలు ఆలపించారు. అలివేలు మంగనాథుడు గోవిందా అంటూ ఓ చిన్నారి ఆలపించిన భక్తి గీతం అలరించింది. జిమ్స్ మెడికల్ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. పావని, మాధవపెద్ది బృందం ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల సుఖసంతోషాలే భగవంతుడి అభిలాష – చినజీయర్ స్వామి ప్రవచనం ప్రతి వ్యక్తి తనకు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే సన్మార్గంలో ప్రయాణించినట్లేనని త్రిదండి చినజీయర్ స్వామి బోధించారు. ఆచార్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా పూజలో పాల్గొన్న భక్తులనుద్దేశించి ఆయన ప్రవచనాలు చేశారు. దేవతారాధనపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. తాము చేసే తప్పుల నుంచి కాపాడమని కొందరు పూజలు చేస్తారని తెలిపారు. తమపై భగవంతుడు కోపోద్రిక్తుడు కాకుండా ఉండేందుకు పూజలు చేస్తామని కొందరు చెబుతారన్నారు. అయితే స్వచ్ఛమైన ప్రేమకు కేంద్రం భగవంతుడని, భక్తులను సుఖసంతోషాల్లో ఉంచడమే భగవంతుడి అభిలాష అని చినజీయర్ పేర్కొన్నారు. అన్ని మతాల సారం కూడా ఇదేనన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏవిధంగా ఉంటారో భగవంతుడి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుందన్నారు. యాగంతో సమస్త మానవాళికి మేలు లక్ష్మీనారాయణుడి యాగశాలను పవిత్ర దేవాలయంగా త్రిదండి చినజీయర్ స్వామి అభివర్ణించారు. మహాయాగం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. యాగశాలకు దేవతలను ఆహ్వానించి పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతమంతా ఒక దేవాలయమేనని, ప్రతి ఒక్కరు భగవంతుడి ధ్యానంలో మునిగిపోవాలని సూచించారు. నిష్టతో ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు. ఈ యాగశాలలోని 1,035 కుండాల ద్వారా చేసే యాగంతో వెలువడే పొగ, పరిమళాలతో వాతావరణంలో ఉన్న చెడు అంతరించిపోతుందని, వైరస్ లాంటి కణాలు నశించిపోతాయని చెప్పారు. సమస్త మానవాళికి మేలు జరుగుతుందని అన్నారు. నేటి కార్యక్రమాలు సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో హోమ, పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ లక్ష్మీ నారాయణేష్టి, సత్సంతానానికై వైనతేయేష్టి సహా శ్రీ లక్ష్మీ నారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. అగ్ని మథనం ఇలా.. లక్ష్మీనారాయణ యాగంలో అగ్నిమథనాన్ని వేదంలో పేర్కొన్నట్లుగా సృష్టించారు. వేదంలో ‘శమీగర్భాదగ్నమ్ మంథతి’అనే వాక్యంలో చెప్పినట్లుగా.. జమ్మిచెట్టు కర్ర (శమీ దండం)పైన రావి కర్రను (రావి దండం) ఉంచి, వేడి రగులుకుని నిప్పు రవ్వ పుట్టే వరకు రాపిడి ప్రక్రియను కొనసాగించారు. సరిగ్గా తొమ్మిది నిమిషాల రాపిడి తర్వాత నిప్పు రవ్వ జ్వలించింది. అలా పుట్టిన నిప్పురవ్వలను పాత్రలోకి తీసుకుని ఆ అగ్నిని యాగశాలలోని అన్ని కుండాలలోకి వితరణ చేశారు. తొలిరోజు పుట్టించిన అగ్నిని యాగం పూర్తయే వరకు ఆరకుండా కొనసాగిస్తారు. -
టీడీపీ నేత నన్నపనేని లక్షీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
-
ఓహో.. అందుకే జేడీ జనసేనలో చేరారా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నడుచుకునే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జన సైనికుడిగా మారడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ట్విటర్ వేదికగా జనసేనలో లక్ష్మీనారాయణ చేరికపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారా? ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’ అని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో 35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారని, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారని ప్రశ్నించారు. అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారని, మంచి డాక్టర్‌ను కలిస్తే ట్రీట్మెంట్ ఇస్తాడన్నారు. అలెగ్జాండర్‌కు 10 లక్షల సైనికులుంటే తనకు 65 లక్షల సైన్యం ఉందని చంద్రబాబు కటింగులిస్తున్నాడని, కొట్టేసిన 3.75 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయని కూడా చెప్పండి పనిలో పనిగా అంటూ ఎద్దేవా చేశారు. ‘తెలుగుదేశం గాలి వీస్తోందని మీ నోటితో ఇంకో సారి అనకండి సార్. ఫ్యాన్ గాలి వీస్తోందని వినిపిస్తుంది ప్రజలకు’ అంటూ సెటైర్లేశారు. -
నెగ్గిన అవిశ్వాసం..
సాక్షి, పెద్దపల్లి: అధికార పార్టీకి చెందిన రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం గోదావరిఖనిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్‌లపై సొంత పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా 37 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. మరో ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎంపీ బాల్క సుమన్, మేయర్ లక్ష్మీనారాయణ సహా 15 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 37 మంది సభ్యు లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి, జేసీ వనజాదేవి ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన 13 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలకడం గమనార్హం. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం దిగి వచ్చేటట్లు చేసి మేయర్‌ను పదవి నుంచి దించేశారు. సోమారపు, మేయర్ నడుమ గతేడాది నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. మేయర్‌కు ఎంపీ సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. వర్గపోరు ముదురు పాకాన పడటంతో గత నెల 6న మేయర్, డిప్యూటీ మేయర్లపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని మేయర్లందరూ కలసి సీఎం కేసీఆర్‌కు మొర పెట్టుకొన్నారు. దీంతో అవిశ్వాసాన్ని ఆపేయాలని సత్యనారాయణకు మం త్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అధిష్టానంపై కినుక వహించిన సోమారపు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సం చలనం సృష్టించారు. అధిష్టానం దిగివచ్చి అవిశ్వాసంపై ఎమ్మెల్యేకే తుది అధికారాన్ని కట్టబెట్టడంతో అలకవీడి, మేయర్‌ను అవిశ్వాసంలో ఓడించి పంతం నెగ్గించుకొన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వర్గానికి జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
నోట్ల క్యూ లో వృద్ధుడి మృతి
-
ఏసీబీ వలలో తుళ్లూరు సర్వేయర్
రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు రూ. 50 వేల డిమాండ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు గుంటూరు లాడ్జిసెంటర్ బస్టాప్ వద్ద వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు తుళ్ళూరు : రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండల సర్వేయర్‌ను బుధవారం ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ఓ రైతునుంచి పొలం విషయమై డబ్బు తీసుకుంటుండగా సర్వేయర్‌ను గుంటూరులోని లాడ్జి సెంటర్ బస్టాప్ వద్ద ఏసీబీ అధికారులు పట్టుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే ...తుళ్ళూరు గ్రామానికి చెందిన నెల్లూరి లక్ష్మీనారాయణ అనే రైతుకు సర్వే నంబర్ 419లో 2 ఎకరాల 33 సెంట్లు పొలం ఉండగా రాజధాని నిర్మాణానికి లాండు పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే, సీఆర్డీఏ కాంపిటెంట్ ఆఫ్ అథారిటీ అధికారులు సర్వే చేసి 2 ఎకరాల 22 సెంట్లుగా నమోదు చేశారు. దీంతో లక్ష్మీనారాయణ తన పొలాన్ని సర్వే చేయవలసిందిగా సర్వేయర్ కె.వరప్రసాద్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 1న పొలం సర్వే చేసిన వరప్రసాద్ 2ఎకరాల 26 సెంట్లు ఉన్నట్లు తేల్చారు. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు రూ.50వేలు ఇవ్వాల్సిందిగా రైతు లక్ష్మీనారాయణను డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని రూ.25వేలు ఇస్తానంటూ లక్ష్మీనారాయణ సర్వేయర్‌కు విన్నవించి విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దీంతో ఏసీబీ అధికారులు గుంటూరు లాడ్జి సెంటర్ బస్టాప్ వద్ద సర్వేయర్ రైతునుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. భూమికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ చెప్పారు. కార్యక్రమంలో సీఐ నరసింహారావు పాల్గొన్నారు. -
ఆరాధ్య చనిపోలేదు... ఊరెళ్ళింది..!
-
ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది
ఒంగోలు : ముద్దులు మూటగట్టే తన పాప దారుణ హత్యకు గురైందన్న వార్త విని ...ఆరాధ్య తల్లి సాహితి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి ... ఇకలేదనే విషయాన్ని...ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు. ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు. ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు. కాగా ఆరాధ్య పిన్ని సింధు..లక్ష్మీనారాయణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు పెద్దలకు ఇష్టం లేకపోయినా అనంతరం వారు అంగీకరించటంతో ...అందరూ కలిసే ఉంటున్నారు. -
అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!
-
అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!
ఒంగోలు : అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్యను సొంత బాబాయే దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో సన్నిహితంగా గడపడానికి చిన్నారి అడ్డుగా ఉందనే కారణంతో అతడు ప్రాణాలు తీశాడు. ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో ఉన్న శ్రీధర్, సాహితి దంపతులు తమ బిడ్డ ఆరాధ్యను ఎవరో కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి బాబాయ్ లక్ష్మీనారాయణే చిన్నారిని చంపేశాడని తేల్చారు. ఆరాధ్య పిన్ని సింధూతో లక్ష్మీనారాయణకు మూడు నెలల క్రితం పెళ్లైంది. ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉంటుంది. దీంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపటానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్యను లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైక్‌పై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అర్ధరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. -
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న సీఎం కేసీఆర్
గాంధారి : తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడని బీజేపీ నాయకులు విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పో తంగల్ కిషన్ రావు మండలంలో పలు గ్రామాలు సందర్శించి ఎండిన మొక్కజొన్న, వరి, పంటలను పరిశీలించారు. మండలంలో అధిక శాతం వర్షాధార పం టలను సాగు చేస్తారని అన్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, వరి, పత్తి, సోయాబీన్ తదిర పంటలు ఎండి పోయి రైతు లు పూర్తిగా నష్టపోయారన్నారు. బోరుబావుల వద్ద సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు విద్యుత్ కోతల కారణం గా ఎండి పోయాయన్నారు. దీంతో రైతు లు పెట్టుబడులు కూడా కోల్పోయి ఆం దోళన చెందుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 8 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అధికారంలోకి రాగానే రోజుకు రెండు గంటలు కూడా సరఫరా చేయడంలేదని ఆరోపించారు. వ్యవసాయానికి కనీసం ఆరు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తే, వారిపై లాఠీచార్జి చేస్తూ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా సరైన చర్యలు తీసుకుని రైతులకు కనీసం ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
బీజేపీ నేత మొటపర్తి లక్ష్మీనారాయణ మృతి
దెందులూరు, న్యూస్‌లైన్ : భారతీయ జనతా పార్టీ మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మొటపర్తి లక్ష్మీనారాయణ(84) ఆదివారం సాయంత్రం దెందులూరులోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1961లో శ్రీ వివేకానంద గురుకుల విద్యాలయూన్ని స్థాపించారు. 16 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 100 మందిపైగా విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించారు. వారిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నవారు, గతంలో చైర్మన్లుగా పనిచేసిన వారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గతంలో టీడీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా, భీమడోలు షుగర్స్ వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అంబటి రాంబాబు సంతాపం లక్ష్మీనారాయణ శిష్యుడు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబ టి రాంబాబు ఫోన్లో సంతాపం తెలిపారు. విద్యాబోధన, విద్యార్థుల అభివృద్ధికి లక్ష్మీనారాయణ పరితపించే వారని రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గ్రామ మాజీ సర్పంచ్ మొటపర్తి రత్నకుమారి, గ్రామ నాయకులు, మొటపర్తి శివకేశవ రావు, రిటైర్డ్ పీఈటీ మొటపర్తి బాపినీడు, బాబ్జీ, బీజేపీ నాయకులు విక్రమ్ కిషోర్ తదితరులు లక్ష్మీనారాయణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులపై వేటు
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: మున్సిపల్ కార్యాలయంలో కీలకమైన మినిట్స్ బుక్ మాయమైన వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సీని యర్ అసిస్టెంట్ స్వామి దాస్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ఆర్డీ మురళీకృష్ణగౌడ్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలతో చేతులు కలిపిన కొందరు అధికారులు పెట్టిన ప్రతిపాదనలు, తీర్మానాలను స్పెషల్ ఆఫీసర్ గుడ్డిగా ఆమోదించారు. వీటికి సాక్షిగా నిలిచిన మినిట్స్ బుక్‌ను ఈనెల 13వ తేదీన సిబ్బంది మెయిన్ ఆఫీసులో మాయం చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కీలకమైన మినిట్స్ బుక్‌ను జూని యర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ అసిస్టెంట్ స్వామిదాస్ నిర్వహించేవారు. బుక్ మాయం కావడంతో ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరిని ఆర్డీ మురళీకృష్ణగౌడ్ సస్పెండ్ చేశారు. అయితే ఇందులో మరి కొందరు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మినిట్స్ బుక్ మాయంపై విచారణ కొనసాగడం లేదు. మున్సిపల్ ఆర్డీ ఇద్దరిని సస్పెండ్ చేసి, కమిషనర్ రామచంద్రారెడ్డి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు కేసు నమోదు చేయలేదని, తాము చేసేదేమి లేదని సీఐ సురేంద్రరెడ్డి చెబుతున్నారు. చివరకు మినిట్స్ బుక్ వ్యవహారం భూస్థాపితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
తెలంగాణ ఏర్పాటు తథ్యం
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని, పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తథ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పెట్రోల్‌బంక్ వెనక ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమపార్టీ ఆధ్వర్యంలో అటల్బిహరీవాజ్పేయి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను ఒప్పించి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. దశాబ్దాలకాలాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రస్తుతం నాలుగు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతుంది. కాని కేవలం పన్నెండేళ్లుగా నరేంద్రమోడి పాలిస్తున్న గుజరాత్లో 24గంటలపాటు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని పలుగ్రామాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నుంచి యెండల సమక్షంలో బీజేపీలో చేరారు. బంగారు తెలంగాణను చూడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోననే బెంగతో గ్రామాల్లో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, త్వరలోనే ఏర్పడనున్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని చూసేందుకైనా యువకులు ఆత్మహత్యలు మానాలని బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో కేంద్రం, రాష్ట్రంలో నరేంద్రమోడి ఆధ్వర్యంలో తమ పార్టీ అధికారంలోకి రానుందని, అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అత్యంత క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. వంశపారంపర్యత, కుటుంబపాలన తమ పార్టీలో ఉండదన్నారు. కాంగ్రెస్‌పార్టీ పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల భాగయ్య, జిల్లా కార్యదర్శి మర్రి బాల్కిషన్, అసెంబ్లీ కన్వీనర్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలే భాస్కర్, ఎల్లారెడ్డి సర్పంచ్ దేవేందర్, స్థానిక నేతలు బాపూరావు, బాలాజీ, నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కురుపాం, న్యూస్‌లైన్ : మండలంలోని గుంజరాడ గిరిజన గ్రా మానికి చెందిన వంద కుటుంబాలు శనివారం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నా యకుడు పత్తిక లక్ష్మయ్య మాట్లాడుతూ పేదల అభ్యున్నతే త మ పార్టీ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మక గోపాల్, బోటు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియూపై కొరడా
చెన్నూర్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియూపై ఆర్డీవో కొరడా ఝళిపించారు. అర్ధరాత్రి ఇసుక స్థావరాలపై దాడుల చేసి హల్చల్ సృష్టించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు మంచిర్యాల ఆర్డీవో చక్రధర్ బుధవారం అర్ధరాత్రి మంచిర్యాల తహశీల్దార్ కిషన్, ఆర్ఐ లక్ష్మీనారాయణ, శ్రీహరి, చందు, ప్రభాకర్ బృందంతో కలిసి ఇసుక స్థావరాలపై వరుస దాడులు నిర్వహించారు. స్థానిక బతుకమ్మ వాగు, మండలంలోని చింతలపల్లి సమీపంలోని గోదావరి నది ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు, ఫిషర్ మెన్ సొసైటీ, ప్రైవేట్ పట్టాదారుడికి చెందిన 63 లారీలు ఇసుక నింపుకుని తరలిస్తుండగా ఆర్డీవో పట్టుకున్నారు. డంప్ యూర్డుల వద్ద ఇసుక నింపుకునేందుకు సిద్ధంగా ఉన్న 132 లారీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 195 లారీలతోపాటు డంప్‌యార్డ్ వద్ద ఉన్న రెండు జేసీబీలను పట్టుకున్నారు. అనంతరం చెన్నూర్ డిప్యూటీ తహశీల్దార్, జైపూర్ తహశీల్దార్ రవీందర్‌ను సంఘటన స్థలానికి పిలిపించారు. పట్టుకున్న లారీల వివరాలను అందజేశారు. శుక్రవారం విచారణ జరిపి అనుమతి లేని లారీలను సీజ్ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం వేకువజాము 3 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి. అధికారుల తీరుపై అనుమానాలు... బుధవారం అర్ధరాత్రి ఇసుక తీసుకెళ్తున్న సుమారు 63 లారీలను పట్టుకున్నట్లు ఆర్డీవో చక్రధర్ తెలిపారు. కానీ.. ఇందుకు చెన్నూర్ తహశీల్దార్ వీరన్న గురువారం తెలిపిన వివరాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇసుక తరలిస్తుండగా 12 లారీలు పట్టుకున్నామని, ఇందులో 8 సింగరేణి సంస్థకు చెందినవని, మిగిలిన నాలుగు 4 ప్రైవేట్ వ్యక్తులవని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లారీలకు అనుమతి ఉందని, మిగతా లారీలకు లేకపోవడంతో ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు జరిమానా విధించామని చెప్పారు. ఇసుక లోడింగ్ లేని 132 లారీల విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తహశీల్దార్ తెలిపిన పొంతనలేని వివరాలతో అధికారుల తీరుపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడా నాయకులు ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్‌శాఖ అనుమతి లేకుండానే.. పట్టణంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలించేందుకు సింగరేణి సంస్థకు 30 సంవత్సరాలపాటు అనుమతి ఉంది. ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్లేందుకు నవంబర్ 20 వరకు అనుమతి పొందారు. బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతంలోని తన పట్టాభూ మిలో ఇసుక మేటలు వేసిందని, తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పట్టాదారు దేవేందర్‌రెడ్డి తహశీల్దార్ వీరన్నకు దరఖాస్తు చేసుకోగా ఆయన అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి 2014 ఫిబ్రవరి వరకు 2.94 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు ఉంది. వీరు ఇలా ఇసుకను పట్టణంలోని ఒకచోట డంప్ చేసుకునేందుకు అనుమతి పొందారు. ఇందుకు సంబంధించి వేబిల్లులూ తీసుకున్నారు. ఇక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ.. ఏపీ మైనింగ్ నుంచి అనుమతి పొందకుండా డంప్ యార్డ్ వరకు ఉన్న అనుమతి పత్రాలతో పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించి అందినంతా దండుకుంటున్నారు. -
సాయంత్రం వేళ సీబీఐ ఆఫీస్‌లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సాయంత్రం కోఠిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆఫీసు వేళల తరువాత సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మాజీ జాయింట్ డెరైక్టర్ సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సమాచారం కొద్ది సేపట్లోనే బయటకు పొక్కింది. ఆఫీసు పనివేళల తరువాత ఆయన కోఠి కార్యాలయానికి చేరుకుని అప్పటికే సీలు వేసిన జాయింట్ డెరైక్టర్ చాంబర్‌ను సిబ్బంది ద్వారా తెరిపించారు. తరువాత దాదాపు గంటన్నరసేపు ఆయన కార్యాలయంలోనే గడిపారు. కొద్ది ఆలస్యంగా విషయం తెలిసిన వెంటనే.. సాక్షి ఫొటోగ్రాఫర్ కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే లక్ష్మీనారాయణ ఆఫీసు నుంచి బయటికొచ్చి తనకు రాష్ట్ర పోలీసు విభాగం కేటాయించిన వాహనంలో తిరిగి వెళ్లారు. లక్ష్మీనారాయణ రాష్ట్రంలో సీబీఐ ఎస్పీగా, డీఐజీగా, జాయింట్ డెరైక్టర్‌గా ఏడు సంవత్సరాలపాటు పనిచేశారు. సీబీఐలో డిప్యుటేషన్ గడువు ముగియడంతో గత జూన్ మొదటి వారంలో ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. విధుల నుంచి రిలీవ్ అయిన నాలుగు నెలల తరువాత, అదీ ఆఫీసు పనివేళలు ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయానికి వచ్చి దాదాపు గంటన్నరపాటు ఉండడం గమనార్హం.