అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు! | Aaradhya killed by uncle lakshmi narayana in Ongole | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!

Published Wed, Nov 26 2014 9:11 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు! - Sakshi

అడ్డుగా ఉందనే ఆరాధ్యను చంపేశాడు!

ఒంగోలు :  అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్యను సొంత బాబాయే దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో సన్నిహితంగా గడపడానికి చిన్నారి అడ్డుగా ఉందనే కారణంతో అతడు ప్రాణాలు తీశాడు. ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో ఉన్న శ్రీధర్‌, సాహితి దంపతులు తమ బిడ్డ ఆరాధ్యను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ నిన్న మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి బాబాయ్‌ లక్ష్మీనారాయణే చిన్నారిని చంపేశాడని  తేల్చారు.  ఆరాధ్య పిన్ని సింధూతో లక్ష్మీనారాయణకు మూడు నెలల క్రితం పెళ్లైంది. ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉంటుంది. దీంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపటానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్యను లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైక్‌పై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అర్ధరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement