
బీజేపీ నేత మొటపర్తి లక్ష్మీనారాయణ మృతి
దెందులూరు, న్యూస్‌లైన్ : భారతీయ జనతా పార్టీ మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మొటపర్తి లక్ష్మీనారాయణ(84) ఆదివారం సాయంత్రం దెందులూరులోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1961లో శ్రీ వివేకానంద గురుకుల విద్యాలయూన్ని స్థాపించారు. 16 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 100 మందిపైగా విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించారు. వారిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నవారు, గతంలో చైర్మన్‌లుగా పనిచేసిన వారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గతంలో టీడీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా, భీమడోలు షుగర్స్ వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
అంబటి రాంబాబు సంతాపం
లక్ష్మీనారాయణ శిష్యుడు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబ టి రాంబాబు ఫోన్‌లో సంతాపం తెలిపారు. విద్యాబోధన, విద్యార్థుల అభివృద్ధికి లక్ష్మీనారాయణ పరితపించే వారని రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గ్రామ మాజీ సర్పంచ్ మొటపర్తి రత్నకుమారి, గ్రామ నాయకులు, మొటపర్తి శివకేశవ రావు, రిటైర్డ్ పీఈటీ మొటపర్తి బాపినీడు, బాబ్జీ, బీజేపీ నాయకులు విక్రమ్ కిషోర్ తదితరులు లక్ష్మీనారాయణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.