కోటి తనయుడి సినిమాకు రామ్‌ పోతినేని సాయం | Ram Pothineni Launched Lyrical Video Of 11:11 Movie | Sakshi
Sakshi News home page

కోటి తనయుడి సినిమాకు రామ్‌ పోతినేని సాయం

Published Thu, May 26 2022 11:32 AM | Last Updated on Thu, May 26 2022 11:32 AM

Ram Pothineni Launched Lyrical Video Of 11:11 Movie - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటించిన చిత్రం ‘11:11’. ‘కౌంట్‌ డౌన్‌ స్టార్ట్స్‌’ అనేది క్యాప్షన్‌. ఆర్‌కే నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గాజుల వీరేష్‌ నిర్మించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో..’ అనే పాట లిరికల్‌ వీడియోను హీరో రామ్‌ రిలీజ్‌ చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

‘ఏమయ్యిందో మనసైపోయే మాయం.. ఏమౌతుందో ఇకపై నా హృదయం’ అంటూ సాగే ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్‌ అందించగా అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘‘రాజీవ్, వర్ష లవ్‌ చేసుకుంటుంటారు.  ఆ ఇద్దరి మధ్య ఓ వ్యక్తి అనూహ్యంగా ఎంటర్‌ అవుతాడు. కానీ ఆ వ్యక్తి హత్య చేయబడతాడు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే కథ’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement