వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని ఆంధప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందులోభాగంగా శనివారం కోటిలోని ప్రధాన కార్యాలయం ఎదటు తెలంగాణ ఉద్యోగులు బైఠాయించారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందాల్సిన ఆస్తులను ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేటాయించిన సంగతి తెలిసిందే.