ఏ సినిమా అయినా హీరో హీరోయిన్ ఉంటారు. విలన్ వల్ల వాళ్లకు ఓ సమస్య వస్తుంది. దాన్ని సదరు పాత్రలు ఎలా అధిగమించాయనేదే స్టోరీ. ఏ మూవీ తీసుకున్నా చాలావరకు ఇదే ఉంటుంది. ఇది పక్కనబెడితే హీరోలు లేదా హీరోయిన్లకు మాత్రమే సినిమాల వల్ల కష్టాలుంటాయని అనుకుంటుంటారు. కానీ ఓ విలన్.. షూటింగ్స్‌లో తనకెదురైన ప్రాబ‍్లమ్స్ చెప్పుకొని తెగ బాధపడిపోయాడు.
అలాంటి సీన్సే
'నేను ఒకేసారి 80 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు చిన్న రోల్స్ ఆఫర్ చేస్తే, మరికొందరు ప్రతినాయకుడి పాత్రల‍్లో అవకాశమిచ్చేవాళ‍్లు. అయితే వాటిలో చాలావరకు హీరోయిన్ల చీరలు లాగే లేదా బలత్కారం చేసే సీన్స్ మాత్రమే ఉండేవి. అవి చేసి చేసి నాకు చిరాకొచ్చేసేది.'
(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)
తీరక లేకుండా
ఈ నటుడు అసలు పేరు గోపాల్ బేడీ. కానీ సినిమాల్లోకి వచ్చాక రంజిత్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ముంబయిలో నేను ఉంటున్నప్పుడు అమ్మ నన్ను కలవడానికి వచ్చింది. తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ఆమెని డ్రాప్ చేయడానికి కూడా తీరిక ఉండేది కాదు. ఎందుకంటే అంత బిజీగా ఉండేవాడిని' అని నటుడు రంజిత్ చెప్పుకొచ్చాడు.
ఆ పేరు నిక్‌నేమ్‌గా
80ల్లో ఎక్కువగా సినిమాలు చేసిన రంజిత్... ఫరేబి, నాగిన్, అమర్ అక్బర్ ఆంటోని, నయా దౌర్, సుహాగ్, రాకీ, సర్ఫరోస్ చిత్రాలతోపాటు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలోనూ నటించాడు. అయితే ఎక్కువగా హీరోయిన్ల చీర లాగే సీన్స్‌లో యాక్ట్ చేయడంతో.. 'రంజిత్-ద రే*పిస్ట్' అనే పేరుతో ఎక్కువగా ఇతడిని పిలిచేవారు. అలాంటి ఆ నటుడు ఇప్పుడు విలన్ పాత్రల వల్ల విసిగిపోయానని చెప్పడం వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్)
Comments
Please login to add a commentAdd a comment