స్లో డ్రామా.. కానీ కుమ్మేస్తోంది | Mohanlal Villain movie Keral's biggest opener | Sakshi
Sakshi News home page

కేరళలో విలన్‌ కలెక్షన్ల ప్రభంజనం

Oct 30 2017 2:21 PM | Updated on Oct 30 2017 9:36 PM

Mohanlal Villain movie Keral's biggest opener

సాక్షి, సినిమా : మనమంతా, జనతా గ్యారేజ్‌, మన్యంపులి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన నటుడు మోహన్‌ లాల్‌కు సొంత ప్రాంతంలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ యాక్టర్ గా ట్యాగ్‌లైన్‌ తగిలించుకున్న ఆయన ఇప్పుడు మరో రికార్డు సృష్టించారు. 

మోహన్‌ లాల్‌ కొత్త చిత్రం ‘విలన్‌’ ఈ మధ్యే రిలీజ్‌ కేరళలో ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు వసూళ్ల సరికొత్త రికార్డును నెలకొల్పింది. 4.91 కోట్ల(గ్రాస్‌) వసూళ్లతో మమ్మూటీ-పృథ్వీరాజ్‌ చిత్రం ది గ్రేట్‌ ఫాదర్‌ రికార్డును విలన్‌ బద్ధలుకొట్టింది. అంతేకాదు తొలివారంలో 10 కోట్లు వసూలు చేసి మరో రికార్డును కూడా సృష్టించింది.

ఉన్నికృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కి చాలా ప్రత్యేకతలు ఉండటం విశేషం. కోలీవుడ్ హీరో విశాల్‌, నటి హన్సిక, తెలుగు నటులు శ్రీకాంత్, రాశీఖన్నా ఇందులో ప్రధాన పాత్రల్లో, మంజు వారియర్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో నటించింది. విశాల్‌, శ్రీకాంత్‌లు తమ సొంత గొంతునే అందించగా, రాశీఖన్నా ఏకంగా ఓ పాట పాడటం విశేషం. అంతేకాదు దేశంలోనే మొదటిసారి 8కే టెక్నాలజీ ద్వారా షూటింగ్‌ జరుపుకున్న తొలిచిత్రంగా విలన్‌ ఘనత సాధించింది. 

అయితే యాక్షన్‌ పాలు తక్కువగా ఉండటం.. ఎమోషనల్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటంతో విలన్‌ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయినా మోహన్‌ లాల్‌ స్టార్ డమ్‌.. మిగతా హంగులు సినిమాను నిలబెడతాయన్న విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్‌లో తమిళం, తెలుగు భాషల్లో విలన్‌ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement