చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ వికారాబాద్ నేపథ్యంలో జరుగుతుంది.
తెలంగాణ కల్చర్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నేను మొదటిసారి పోలీసాఫీసర్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి’’ అన్నారు. ‘‘యేవమ్’ అంటే ‘ఇది ఇలా జరిగింది’ అని అర్థం. విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నలుగురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం’’ అన్నారు ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment