
సిడ్నీ: భారత షూటింగ్ నయా సంచలనం మను భాకర్ మరోసారి స్వర్ణంతో మెరిసింది. ఇటీవల మెక్సికోలో జరిగిన సీనియర్ వరల్డ్‌కప్ షూటింగ్‌లో రెండు బంగారు పతకాలతో సత్తా చాటిన మను జూనియర్ ప్రపంచకప్‌లో మరో రెండు స్వర్ణాలతో ఆకట్టుకుంది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బరిలో దిగిన 16 ఏళ్ల మను 235.9 పాయింట్లు స్కోర్ చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. కన్యకోర్న్ హిరున్‌ఫోమ్ (థాయ్‌లాండ్–234.9 పాయింట్లు) రజతం... కైమన్ లూ (చైనా–214.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. టీమ్ విభాగంలో మను, దేవాన్షి, మహిమ అగర్వాల్ బృందం బంగారు పతకం దక్కించుకుంది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో గౌరవ్ రాణా రజతం, అన్‌మోల్ జైన్ కాంస్యం
చేజిక్కించుకున్నారు. టీమ్ విభాగంలో అర్జున్ సింగ్ చీమా, గౌరవ్ రాణా, అన్‌మోల్ త్రయం కూడా స్వర్ణం చేజిక్కించుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆర్య, ఆదర్శ్, అన్హద్ జవాండా కాంస్యం దక్కించుకున్నారు.