ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో గోల్డ్‌మెడల్‌ | Asian Games 2023: Aishwarya Pratap Singh Tomar, Kusale Swapnil And Akhil Sheoran Win Gold Medal In Men’s 50m Rifle 3P Team - Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో గోల్డ్‌మెడల్‌

Published Fri, Sep 29 2023 8:47 AM | Last Updated on Fri, Sep 29 2023 9:57 AM

Indian shooters bag two more medals, - Sakshi

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. పురుషుల 50 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్‌తో కూడిన  భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

అదే విధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్‌తో కూడిన భారత త్రయం రజత పతకం సొంతం చేసుకుంది. ఇక భారత్‌కు ఇది ఏడో గోల్డ్‌మెడల్‌. అందులో ఐదు పతకాలు షూటింగ్‌లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్‌గా 27 పతకాలతో భారత్‌ 4 స్థానంలో ఉంది.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement