రూల్స్‌ రంజన్‌ ట్విటర్‌ రివ్యూ.. కిరణ్‌ సినిమాకు అలాంటి టాక్‌! Kiran Abbavaram's 'Rules Ranjan' Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Rules Ranjan Movie Twitter Review: రూల్స్‌ రంజన్‌ ట్విటర్‌ రివ్యూ

Published Fri, Oct 6 2023 10:31 AM

Kiran Abbavaram Rules Ranjan Movie Twitter Review - Sakshi

హీరో కిరణ్‌ అబ్బవరం, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం రూల్స్‌ రంజన్‌. ఏఎం రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్‌ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలోని సమ్మోహనుడా పాట రూల్స్‌ రంజన్‌కు బాగా హైప్‌ తీసుకువచ్చింది. మరి రూల్స్‌ రంజన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేలా ఉందా? సినిమాకు ఎలాంటి టాక్‌ వస్తుందనేది సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే పలుచోట్ల ప్రివ్యూలు పడిపోవడంతో జనాలు సినిమా ఎలా ఉందనేది ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్‌ అస్సలు బాగోలేదని, కామెడీ కూడా పెద్దగా వర్కవుట్‌ కాదని అంటున్నారు. పర్లేదు, ఒకసారి చూడవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కిరణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం హిట్టు కొట్టేశామని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రూల్స్‌ రంజన్‌కు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఎలా ఉందో చెప్పలేం..

Advertisement
 
Advertisement
 
Advertisement