![Rules Ranjan release date Fixed on 28 sept 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/5/Rules-Ranjan-Kiran-Abbavara.jpg.webp?itok=L7LJ68N3)
‘‘రూల్స్ రంజన్’ కథ వింటున్నప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.
ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు ఏఎం రత్నం వెల్లడించి, మాట్లాడుతూ– ‘‘నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. మా ‘రూల్స్ రంజన్’కి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘ఏఎం రత్నంగారి ఆశీస్సులతో ముందడుగు వేశాం’’ అన్నారు దివ్యాంగ్, మురళీ కృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment