మాకు మంచి సింక్‌ కుదిరింది | Director Rathinam Krishna Comments on Rules Ranjann movie | Sakshi
Sakshi News home page

మాకు మంచి సింక్‌ కుదిరింది

Published Fri, Oct 6 2023 6:34 AM | Last Updated on Fri, Oct 6 2023 6:34 AM

Director Rathinam Krishna Comments on Rules Ranjann movie - Sakshi

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘రూల్స్‌ రంజన్‌’. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్‌ లవానియా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ– ‘‘రూల్స్‌ రంజన్‌’ కథను నవీన్‌ ΄÷లిశెట్టికి చె΄్పాలనుకున్నాను. కుదరక΄ోవడంతో కిరణ్‌ అబ్బవరంకు వినిపించాను. కిరణ్‌కు కథ నచ్చడంతో ఈ సినిమాను ఆరంభించాం. కథా చర్చల్లో భాగంగా కిరణ్‌ మంచి క్రియేటర్‌ అని అర్థం అయ్యింది.

మా ఇద్దరికీ మంచి సింక్‌ కుదిరింది. ఈ చిత్రం ఫస్టాఫ్‌ క్లాస్‌గా, సెకండాఫ్‌ మాస్‌గా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా మొదలై, సెకండాఫ్‌లో ఫ్యామిలీ టర్న్‌ తీసుకుంటుంది. ఈ సినిమా రషెస్‌ను నాన్నగారి (ప్రముఖ నిర్మాత ఏయం రత్నం)తో ΄ాటు, నా శ్రేయోభిలాషులు, కిరణ్‌ సన్నిహితులు చూసి, హాయిగా నవ్వుకున్నారు. ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. అయితే నాన్నగారి ్ర΄÷డక్షన్‌ వ్యవహారాలు చూస్తుంటాను కాబట్టి డైరెక్షన్‌కి గ్యాప్‌ వచ్చింది. ఇక నా తమ్ముడు రవికృష్ణ నటించిన ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా రీ రిలీజ్‌కు మంచి స్పందన వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా సెకండ్‌ ΄ార్ట్‌ షూటింగ్‌
ఆరంభిస్తాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement