ఆ పాట నాకో సవాల్‌ Neha Shetty Talks About Rules Ranjann Movie | Sakshi
Sakshi News home page

ఆ పాట నాకో సవాల్‌

Published Tue, Oct 3 2023 6:38 AM

Neha Shetty Talks About Rules Ranjann Movie - Sakshi

‘‘రూల్స్‌ రంజన్‌’ రొటీన్‌ అబ్బాయి–అమ్మాయిల కథ కాదు. విభిన్నమైన చిత్రం’’ అని నేహా శెట్టి అన్నారు. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్‌ సినిమా ‘మెహబూబా’ సక్సెస్‌ కాలేదు.

ఆ తర్వాత నేను యాక్టింగ్‌ కోర్స్‌ కోసం న్యూయార్క్‌ వెళ్లాను. తిరిగొచ్చాక ‘డీజే టిల్లు’కి చాన్స్‌ వచ్చింది.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ చేశాను. రెండూ విజయం సాధించాయి. ‘రూల్స్‌ రంజన్‌’లో సన పాత్ర ΄ోషించాను. ఇందులో ‘సమ్మోహనుడా..’ పాటకి డ్యాన్స్‌ చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ పాట వాన బ్యాక్‌డ్రాప్‌లోనూ సాగుతుంది. వాన పాటల విషయానికొస్తే.. నాకు శ్రీదేవిగారు గుర్తుకు వస్తారు. చిన్న వయసులో సినీ జీవితాన్ని ్రపారంభించి ఉన్నత స్థాయికి చేరారామె. నటిగా ఆమెలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement