Rules Ranjann: ఆకట్టుకుంటున్న ‘'ఎందుకురా బాబు' పాట | Enduku Ra Babu Song Out From Rules Ranjann | Sakshi
Sakshi News home page

Rules Ranjann: ఆకట్టుకుంటున్న ‘'ఎందుకురా బాబు' పాట

Published Sun, Aug 6 2023 3:45 PM | Last Updated on Sun, Aug 6 2023 3:45 PM

Enduku Ra Babu Song Out From Rules Ranjann - Sakshi

హిట్‌, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రూల్స్ రంజన్'. నేహా శెట్టి హీరోయిన్‌. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి  నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. 'ఎందుకురా బాబు' అంటూ సాగే  ఈ పాటకి కాస్లర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించగా.. ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ అద్భుతంగా ఆలపించారు. 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటల మాదిరిగానే అమ్రిష్ గణేష్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. వినోదనమే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement