
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’.
ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల.
Comments
Please login to add a commentAdd a comment