'నేను ఇప్పటికీ బాధపడుతున్నా.. ఆ పనికిమాలిన చెత్తను ఎంకరేజ్‌ చేయొద్దు' | Kartikeya Gives Clarity on Giving Interview to Youtuber P Hanumanth | Sakshi
Sakshi News home page

తప్పు చేశా.. ఇకమీదట అలా జరగనివ్వను: హీరో కార్తికేయ

Published Mon, Jul 8 2024 5:55 PM | Last Updated on Mon, Jul 8 2024 6:33 PM

Kartikeya Gives Clarity on Giving Interview to Youtuber P Hanumanth

సినిమా షూటింగ్‌ ఇలా అయిపోగానే అలా ప్రమోషన్లు మొదలుపెట్టేస్తున్నారు. ఎప్పుడైతే సోషల్‌ మీడియా వాడకం పెరగపోయిందో, ఇబ్బడిముబ్బడిగా యూట్యూబ్‌ ఛానల్స్‌ వచ్చిపడ్డాయో అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న ఛానల్‌ యజమానులతో కలిసి రీల్స్‌ అని, ఇంటర్వ్యూలని ప్లాన్‌ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువమంది జనాలకు తమ సినిమా గురించి తెలిసే ఆస్కారం ఉంటుందని వారి ఆశ.

తప్పు చేశా: కార్తికేయ
కానీ ఈ పిచ్చిలో పడి ఓ పనికిమాలిన వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశానంటున్నాడు హీరో కార్తికేయ. యూట్యూబర్‌ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనని అభిప్రాపయపడ్డాడు. కాగా హనుమంతు.. వల్గర్‌ కామెడీ చేస్తూ, ట్రోల్‌ స్టఫ్‌తో యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నాడు. ఇటీవల ఓ తండ్రీకూతుర్ల సరదా వీడియో గురించి అత్యంత దారుణంగా మాట్లాడాడు. వారి బంధాన్ని కించపరుస్తూ చిన్నారి గురించి అసభ్యంగా మాట్లాడాడు. 

పిచ్చి కామెంట్లు
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవడంతో హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో మండిపడ్డాడు. అతడితో పాటు ఆ వీడియోలో ఇలాంటి పిచ్చి కామెంట్లు చేసిన మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తాజాగా ఈ విషయంపై హీరో కార్తికేయ స్పందించాడు. ఈ మధ్యకాలంలో కుళ్లు జోకులు వేస్తూ అవతలివారి గురించి దిగజార్చేలా మాట్లాడటం ప్యాషన్‌ అయిపోయింది.

ఎంకరేజ్‌ చేయొద్దు
వాటిని ఎంకరేజ్‌ చేస్తున్నాం కనకే ఇప్పుడది ఈ స్థాయికి చేరింది. కాబట్టి ద్వంద్వార్థాలు వచ్చేలా పిచ్చి జోకులు వేసేవారిని ఎంకరేజ్‌ చేయొద్దు. ఒకర్ని కిందకు లాగాలని చూసేబదులు సొంతంగా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు సాయపడటం మేలు అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్‌ తమరు అతడికి ఇంటర్వ్యూ ఇచ్చి ఎంకరేజ్‌ చేసినప్పుడు తెలియలేదా? అని ప్రశ్నించాడు. ఇందుకు హీరో మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చాడు. 

షాకయ్యా
'నా సినిమా ప్రమోషన్‌ కోసం నేను అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను. అన్ని ఛానల్స్‌కు ఇచ్చినట్లుగానే తనకూ ఇచ్చాను. కానీ ఆయన అడిగే ప్రశ్నలకు షాకయ్యాను. దాన్ని గొడవ చేయకుండా వదిలేశాను. ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నిజంగానే తనకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సింది. ఒక హీరోగా నా సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఆలోచించాను తప్ప తనను ఎంకరేజ్‌ చేయాలని కానే కాదు. జరిగినదానికి బాధపడుతున్నాను. ఇకమీదట ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చాడు.

 

 చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!

 ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement