sucess meeet
-
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
కొత్త ఊపిరి వచ్చినట్లుంది
‘‘వంద కోట్ల రూపాయల పోస్టర్స్, వంద రోజుల ఫంక్షన్స్ చూశాను. కానీ తొలిసారి వంద అవార్డుల ఫంక్షన్‌ను ‘బలగం’తో చూస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడులైంది. ‘బలగం’కు ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా విశ్వ విజయ శతకం ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మా పిల్లలు హన్షిత, హర్షిత్ నిర్మించిన తొలి సినిమానే వంద అంతర్జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయం. పెద్ద బడ్జెట్‌తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ ‘బలగం’ చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఇటీవల హిట్టయిన ‘సామజ వరగమన’, ‘బేబీ’ వంటి చిత్రాలతో చిన్న, ఫ్యామిలీ చిత్రాలు ఆడతాయనే నమ్మకం మళ్లీ వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్లయింది’’ అన్నారు. ‘‘బలగం’ తెలంగాణ సినిమాగా ప్రచారమైంది. కానీ తెలుగు సినిమా’’ అన్నారు వేణు. ‘‘నేను, అన్న నిర్మించిన తొలి చిత్రానికి వంద అంతర్జాతీయ అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు హన్షిత. -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్‌కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్. ∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ -
కుటుంబంలో సర్దుబాటుతనం చాలా ముఖ్యం: హీరో సూర్య
ప్రతి పురుషుడి విజయం వెనుక కుటుంబంలోని మహిళల త్యాగం ఉంటుందని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈయన నిర్మాతగా 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కార్తీ నటించిన చిత్రం విరుమాన్. దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయమైన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించారు. గత 12వ తేదీ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సరదాగా గడిపారు. చెన్నై శివారు ప్రాంతంలోని వీజీపీ గార్డెన్ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకలో విరుమాన్ చిత్రానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. కామెడీ నటుడు జగన్ అందరితో ఆటపాటలు, వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కుటుంబంలో సర్దుబాటుతనం చాలా ముఖ్యమన్నారు. అందుకు చాలా సహనం కావాలని, మనకంటే మనవాళ్లు ముఖ్యమని భావించాలన్నారు. ఈ విషయాన్ని విరుమాన్ చిత్రంలో చెప్పామన్నారు. నటుడు సూర్య మాట్లాడుతూ తమ వెనుక మహిళా శక్తి ఉందన్నారు. తాము పైకి ఎదగడానికి తమ కుటుంబ మహిళల శ్రమ ఎంతో ఉందన్నారు. తన తల్లి, భార్య, కూతురు ఇలా మహిళలు ఎంతో త్యాగం చేస్తున్నారన్నారు. మగవాళ్లు జయించడం సులభం అని, అదే ఆడవాళ్లు జయించాలంటే పది రెట్లు శ్రమించాలని సూర్య అన్నారు. మహిళలు ఎన్నో త్యాగాలు చేస్తుంటారని తమ పిల్లలను ముందు నెలబెట్టి వారు వెనుక ఉంటారని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు. -
నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే
‘‘నిర్మాణంలో ముగ్గురు, నలుగురు ఇన్వాల్వ్ అయినప్పుడు వ్యత్యాసాలు రావడం సహజం. కానీ, మా అందరిలో ఒకరి బలం ఏంటో మరొకరికి తెలుసు. అలా అందరం కలసి సాఫీగా వర్క్ చేశాం. మా అందరి రథసారథి సురేశ్‌బాబు’’ అని సునీత తాటి, వివేక్ కూచిభొట్ల అన్నారు. సమంత లీడ్ రోల్లో లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, సునీతా తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘కొరియర్ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. 2017లో ‘ఓ బేబీ’ సినిమా మొదలైంది. ఈ పాత్రకు లక్ష్మీగారు బావుంటారన్నది నందినీరెడ్డి ఐడియా. రాజేంద్రప్రసాద్ లుక్ బాగా సెట్ అయింది. ఆయన లుక్‌ని అల్లు అర్జున్ కూడా బాగా అభినందించారు. ‘ఓ బేబీ’ను హిందీలో రీమేక్ చేస్తాం. ఆలియా భట్ హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నాం. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది. కన్నడ, బెంగాలీలోనూ రీమేక్ కోసం అడుగుతున్నారు. చైనాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తున్నాం. ఇంత మంచి కథ ఇచ్చినందుకు మేం వాళ్లకు ఇవ్వబోయే గౌరవం అది’’ అన్నారు సునీత. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన తొమ్మిదో రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉంది. ఓవర్సీస్లో కూడా బాగా ఆడుతోంది. సినిమా నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే. ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీగా అనిపించేట్టు సురేశ్‌బాబు చేశారు. ఆయన సినిమాల్లో ప్రాఫిట్స్ ఇచ్చి మాకు పాఠాలు నేర్పారు. ప్రస్తుతం మేం చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా 70శాతం పూర్తయింది. దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. మా ముగ్గురి కాంబినేషన్లో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే వివరాలు చెబుతాం’’ అన్నారు. -
అలా ఫిక్స్ అయితే బోల్తాపడతాం
‘‘స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్ వల్ల కావచ్చు.. మరోసారి కాస్టింగ్ కుదరక కూడా మిస్‌ఫైర్ అవ్వొచ్చు.. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా కారణా లుంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఇటీవల ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► 2017 ఎంత సక్సెస్‌ఫుల్‌గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ఇస్తుందనిపించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్ 2’తో ఇంత పెద్ద సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 2021లో ‘ఎఫ్ 3’ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దాదాపు సేమ్ టీమ్ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురు హీరోలు ఉంటారు. ► 2017లో 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, అలా జరిగిపోయింది. అలాగని 2019లో కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే బోల్తా పడే చాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి అంత కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్ అయితే చాన్సెస్ ఉన్నాయి. ► తమిళ ‘96’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. నా కెరీర్లో తొలి రీమేక్ ఇది. ఈ సినిమా గురించి మీడియాలో చాలా ఫేక్ న్యూస్‌లు బయటికి వచ్చాయి. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు. హీరోగా శర్వానంద్ కరెక్ట్ అనీ, హీరోయిన్గా సమంత అయితే బాగుంటుందని, వాళ్లే కావాలని ప్రేమ్ అన్నారు. ► ‘96’ చక్కటి ఫీల్ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్ ఫీల్‌ని దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఈ సినిమాను తెలుగులో కూడా నువ్వే చేయాలని డైరెక్టర్‌తో చెప్పాను. ‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కచ్చితంగా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ► మహేశ్‌బాబుతో చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తాం. అమెరికా షెడ్యూల్ అప్పుడు వీసా ఆలస్యం కావడంతో సినిమా విడుదలను 5 నుంచి 25కు మార్చడం జరిగింది. నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ‘పలుకే బంగారమాయెనా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం విడుదలను 2020 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా ఉంది. కానీ ముందు అనుకున్న కథతో ఈ సినిమా చేయడం లేదు. -
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్‌ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
కొత్త వెలుగు తెచ్చినందుకు థ్యాంక్స్ సామీ
‘‘అరవింద సమేత వీర రాఘవ’.. ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం అందించి, ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించిన అభిమాన సోదరులందరికీ నా వందనాలు. ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా కుటుంబ సభ్యుడైన త్రివిక్రమ్‌గారిపైన ప్రేక్షక దేవుళ్లందరూ వారి నమ్మకాన్ని ఇంకోసారి ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ఆయనకు రెట్టింపు ఉత్సాహం కల్పించిన ప్రేక్షక దేవుళ్లకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఈ విజయ దశమికి నల్లమబ్బు కమ్మినటువంటి ఒక విషాదఛాయలో ఉన్న మా కుటుంబంలోకి ‘అరవింద సమేత వీర రాఘవ’ తో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ సామీ(త్రివిక్రమ్). జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించినందుకు థ్యాంక్స్. ఈరోజు ఒకే ఒక్క లోటు.. నాన్న(హరికృష్ణ) ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ, ఆయన ఇక్కడే ఎక్కడో తిష్ట వేసి ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని చూస్తుంటారు. నాన్నగారు లేకున్నా ఆయన హోదాలో ఇక్కడికొచ్చి, ఆశీస్సులు అందించిన బాబాయ్‌కి(బాలకృష్ణ) హృదయపూర్వక పాదాభివందనం’’ అన్నారు. ముఖ్య అతిథి బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవుడు సినిమాలను వినోదంతో కూడిన సాధనంగా ఎంచుకున్నాడు. మంచి చిత్రాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సినిమాలు ఎలా ఉండాలనేది ఇండస్ట్రీలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు ఆలోచించాల్సిన విషయం. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ షూటింగ్లో బిజీగా ఉండి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూడలేకపోయా. కానీ, సినిమా ఇతివృత్తం చెప్పారు. త్రివిక్రమ్‌గారి కథ, సంభాషణల్లో ఎంతో చురుకుదనం, పదును ఉంటుంది. ముత్యాల్లాంటి సినిమాని ప్రేక్షకులకు చూపించడం.. నటీనటుల చేత మంచి హావభావాలను రాబట్టుకోగల సత్తా ఉన్న, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమ్‌గారు. అభిమానం వేరు.. ఆత్మాభిమానం వేరు. పోటీ అన్నది ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరుల్ని మనం కించపరిచేలా ఉండకూడదు. ప్రతి వాళ్లూ కష్టపడబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అందరికీ నా అభినందనలు. రాధాకృష్ణ, ప్రసాద్‌గార్లు మంచి సందేశం, ఆలోచనతో కూడిన సినిమా అందించారు. కేవలం వినోదమే కాదు.. ఆలోచనతో కూడిన సినిమాలు అవసరం. ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకి, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో మా నాన్నగారు(హరికృష్ణ) ఉంటే బాగుండు అనే వెలితి నాకు, తమ్ముడికి. కానీ, మన బాలయ్య... బాబాయ్ ఆ లోటును తీర్చేశారు. రాయలసీమ యాసను తమ్ముడు చాలా బాగా పలికాడు. త్రివిక్రమ్‌గారు ఫస్ట్ టైమ్ మంచి ఎమోషనల్ సినిమా చూపించారు. నేను ఇళయరాజాగారి ఫ్యాన్‌ని. ఆయన స్థాయిలో ఫస్ట్ టైమ్ తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయాన్ని మాకు దసరా కానుకగా ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు నా కృతజ్ఞతలు. మాటల్లో చెప్పలేని ఆనం దాన్ని పంచారు మీరు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే త్రివిక్రమ్ కథని సృష్టించాడు. ఆ కథలో ఎన్టీఆర్, జగపతిబాబు చాలా బాగా నటించారు. వారి ముగ్గురి వల్లే ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అయ్యింది’’ అన్నారు పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. నిర్మాతలు రాధాకృష్ణ, పీడీవీ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు పూజాహెగ్డే, ఈషారెబ్బా, జగపతిబాబు, నరేశ్, సునీల్, బ్రహ్మాజీ, నవీన్‌చంద్ర, శత్రు, ఈశ్వరీరావు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మల్టీస్టారర్ అంటే ఇగో ఉండకూడదు
‘‘దేవదాస్’ విడుదల టైమ్‌లో నేను ఇక్కడ లేను. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కి వెళ్లా. ఆ ట్రిప్ చాలా సరదాగా జరిగింది. ‘శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్, దేవదాస్’ వంటి మూడు సక్సెస్ఫుల్ సినిమాలు సెప్టెంబర్‌లో విడుదలవడంతో పాటు, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టీజర్ రిలీజ్ కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంత సంతోషంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లామో అంతే సంతోషంగా తిరిగొచ్చాం’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా రష్మికా మండన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘దేవదాస్’ సినిమా వారానికే 41కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటే సంతోషంగా ఉంది. కుటుంబమంతా హాయిగా నవ్వుతూ చూడదగ్గ చిత్రమిది. డాక్టర్ దాస్ పాత్రలో నాని లీనమయ్యాడు. మల్టీస్టారర్ సినిమా అంటే ఇగో ఉండకూడదు. నీ రోల్, నా రోల్ అనుకుంటే సినిమా చెడిపోద్ది. సినిమా బావుంటే మనం బాగుంటాం అనుకుని నేను, నాని చేయబట్టే మా మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. శ్రీరామ్ ఆదిత్యకు మంచి భవిష్యత్ ఉంది. ‘ఆఖరి పోరాటం’ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా గ్రాండ్‌గా ఉండాలంటూ అశ్వినీదత్‌గారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారితో పోట్లాడేవారు. ఇప్పటికీ ఆయనకు అదే ప్యాషన్ ఉంది. ఎప్పటికీ వైజయంతీ మూవీస్ పతాకం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఎన్టీ రామారావుగారు శంఖం ఊదుతూనే ఉంటారు. ‘దేవదాస్’ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్ మూవీ అంటున్నారు. ఆయనకు కమ్ బ్యాక్ మూవీ ఏంటండీ? ఎన్ని హిట్స్ లేవు. ‘మహానటి’ కూడా సూపర్‌హిట్టే. ‘డాన్’ దేవ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించిన విధానం బాగుంది. ఇలాంటి పాత్రలు మరికొన్ని చేయొచ్చనే భరోసా ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘శివ’ సినిమా విడుదలై అప్పుడే 29ఏళ్లు అయిందా? అని పొద్దున్నే అనిపించింది. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చాలా రికార్డులు సాధించింది. ‘అల్లరి అల్లుడు’ సినిమా మాస్‌లోకి తీసుకెళ్లింది’’ అన్నారు. ‘‘భారతదేశ చలన చిత్ర చరిత్రలో అధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత ఎన్టీఆర్–ఏఎన్ఆర్లదే. వారితో మా బ్యానర్లో 14 సినిమాలు చేస్తే రెండు మూడు మినహా అన్నీ హిట్లే. తెలుగులో ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలు తీసిన ఘనత మాదే. కర్నాటకలో మా ‘దేవదాస్’ వారానికి 2కోట్ల 37లక్షల షేర్ రాబట్టింది’’ అన్నారు అశ్వినీదత్. ‘‘దేవదాస్’ చేసే అవకాశమిచ్చిన అశ్వినీదత్, నాగార్జున, నానిగార్లకు థ్యాంక్స్. ప్రేక్షకులతో కలిసి ఆరేడుసార్లు ఈ సినిమా చూశా. బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
నా సెంటిమెంట్‌ని బ్రేక్ చేశారు: కల్యాణ్‌రామ్
‘‘నేనెక్కువగా నా సొంత బేనర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను. బయటి బ్యానర్స్‌లో చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఇప్పుడా సెంటిమెంట్ బ్రేక్ అయింది. బయటి బ్యానర్స్‌లో నేను చేసిన సినిమాల్లో హిట్ అయిన ఫస్ట్ మూవీ ‘ఎంఎల్ఏ’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కొన్ని డివైడ్ రివ్యూస్ రావటంతో నిన్నటి వరకూ (ఆదివారం) నేను కొంచెం డల్‌గా ఉన్నా. గుంటూరు, కృష్ణా జిల్లాల డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌గారు ఆదివారం లేట్‌నైట్ ఓ మెసేజ్ చేశారు. మన సినిమా తొలిరోజు వసూళ్లను మించి ఆదివారం కలెక్షన్లు ఉన్నాయని చెప్పడంతో సంతృప్తిగా నిద్రపట్టింది. సోమవారం పొద్దున్నే నిర్మాతలకు ఫోన్ చేస్తే సినిమాకి మనం పెట్టిన డబ్బులు వచ్చేశాయన్నారు. వెరీ హ్యాపీ’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్ మంచి లక్షణాలున్న బంగారం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ని పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది’’ అని భరత్ చౌదరి అన్నారు. టి.జి.విశ్వప్రసాద్, కిరణ్ రెడ్డి, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త డైరెక్టర్ చేశాడా అని పెదనాన్న షాక్ అయ్యారు’
‘‘లవ్ స్టోరీకు కావల్సింది కెమిస్ట్రీ అని అప్పుడు ఆ ‘తొలిప్రేమ’, ఇప్పుడు ఈ ‘తొలిప్రేమ’ ప్రూవ్ చేశాయి. వరుణ్, రాశీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఫిదా’ స్టార్ట్ అయ్యే టైమ్‌లో వెంకీ నా దగ్గరకు వచ్చి ‘సార్ నేనీ సినిమా బయటవాళ్లతో చేసుకుంటాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. సినిమా అయిపోయాక బాపినీడు సినిమాను తీసుకొచ్చి మళ్లీ నా చేతుల్లో పెట్టాడు. వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. ‘ఫిదా, తొలిప్రేమ’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. రాశీ బాగా చేసింది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథను నమ్మిన ‘దిల్’ రాజు గారికి థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా స్టార్ట్ అవ్వకపోయేది. నా మీద, వెంకీ మీద నమ్మకం ఉంచారు. వెంకీకి సినిమా మీద ఉన్న ప్రేమ, మేకింగ్‌లో ఉన్న కన్విక్షన్ సూపర్బ్. పెదనాన్న (చిరంజీవి) ఈ సినిమాను చూసి, డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తీశాడా అని షాక్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన వెంకీకి థ్యాంక్స్’’ అన్నారు రాశీ ఖన్నా. వెంకీ మాట్లాడుతూ – ‘‘రాశీని అనుకున్నప్పుడు భయం ఉండేది కానీ చాలా బాగా చేసింది. ఈ కథను వరుణ్ బిలీవ్ చేయటం వల్లే ఈ సినిమా ప్రాణం పోసుకుంది. ఈ సినిమాకు రెండు పిల్లర్స్ జార్జ్, తమన్. లిరిక్స్ రాసిన శ్రీ మణిగారికి థ్యాంక్స్. ప్రసాద్‌గారిని సార్ అని పిలుస్తాను కానీ నాకు ఫ్రెండ్ లాంటి వారు. బాపినీడు మంచి ఫ్రెండ్’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా వరుణ్ తేజ్‌కు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను నమ్మి చేశాడు. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘నేను ఫస్ట్ టైమ్ వర్క్ చేసిన హీరోస్ అందరితో బ్లాక్‌బాస్టర్స్ కొట్టాను ‘బృందావనం, కిక్, దూకుడు’.. ఈ సినిమా స్టార్ట్ అప్పుడు ఇదే అనుకున్నాను. అలాగే సూపర్ హిట్ అయింది’’ అన్నారు తమన్. -
‘ముకుంద’ సక్సెస్ మీట్