‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడితో ఎనర్జిటిక్‌ స్టార్‌ | Hero Ram Movie With Rx 100 Fame Ajay Bhupathi | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 14 2018 11:52 AM | Last Updated on Fri, Sep 14 2018 3:58 PM

Hero Ram Movie With Rx 100 Fame Ajay Bhupathi - Sakshi

తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన దర్శకుడు అజయ్‌ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా అజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సంచలన విజయం సాధించింది. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు యంగ్‌ హీరోలు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. తాజాగా అజయ్‌ దర్శకత్వంలో నటించేందుకు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఓకె చెప్పారన్న టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో హలోగురు ప్రేమ కోసమే సినిమాలో నటిస్తున్న రామ్‌.. ఆ సినిమా తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. ఈ సినిమాలో రామ్‌ తో పాటు మాలీవుడ్ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాను రామ్‌ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌ నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement