డీఎస్ రావు
‘ఆర్‌ఎక్స్ 100’.. తెలుగులో ఈ ఏడాది అనూహ్య విజయం అందుకున్న చిత్రాల్లో ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు కన్నడంలో రీమేక్ కానుంది. నిర్మాత డి.ఎస్. రావు ‘ఆర్‌ఎక్స్ 100’ కన్నడ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. నితిన్‌తో ‘ద్రోణ’, నానీతో ‘ పిల్ల జమీందార్’, నిఖిల్‌తో ‘ కళావర్ కింగ్’, మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాలు నిర్మించిన డి.ఎస్.రావు ‘ఆర్.ఎక్స్.100’తో నిర్మాతగా కన్నడ రంగంలోకి అడుగుపెట్టను న్నారు. ‘‘ఓ యువ కన్నడ కథానాయకుడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు డీఎస్ రావు.
Comments
Please login to add a commentAdd a comment