
అజయ్ భూపతి
‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆత్రేయపురం. డిగ్రీ వరకు మా ఊరిలోనే చదువుకున్నా. వర్మగారి ‘మర్రిచెట్టు’ సినిమా చూసి దర్శకుడు కావాలనుకున్నా. చిన్నప్పుడు ‘వర్మను కలవాలి’ అని నా నోట్ బుక్స్‌లో కూడా రాసుకున్నా’’ అని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అశోక్‌రెడ్డి గుమ్మడికొండ నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ‘ఇన్‌టెన్స్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. ఈ నెల 12న ఈ సినిమా విడుదలవుతోంది. చిత్రదర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్ వర్మగారి దగ్గర ‘ఎటాక్, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశా.
‘ఆర్‌ఎక్స్ 100’ కథను మూడేళ్ల ముందు తయారు చేసుకున్నా. ఫస్ట్ విజయ్ దేవరకొండకు వినిపించా. అప్పటికి ‘పెళ్ళిచూపులు’ సినిమా స్టార్ట్ కాలేదు. తర్వాత చూద్దాం అనడంతో కార్తికేయను కలిశా. హీరో, హీరోయిన్, రాంకీ, రావు రమేశ్‌గారి పాత్రలు మెయిన్ పిల్లర్స్‌లాంటివి. ఈ సినిమా ఈ స్టేజ్‌కు రావడానికి కారణమైన నిర్మాత అశోక్ రెడ్డిగారికే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. కొందరు హీరోలు, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి తర్వాత మూవీ ఏంటనేది తెలుస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment