కేరళ బాధితుల కోసం ‘ఆర్‌ఎక్స్‌ 100’ వేలం | RX100 Movie Bike Auction For Helping Kerala Flood Victims | Sakshi
Sakshi News home page

Aug 21 2018 10:43 AM | Updated on Aug 21 2018 1:58 PM

 RX100 Movie Bike Auction For Helping Kerala Flood Victims - Sakshi

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఆర్‌ఎక్స్‌ 100. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీకేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కూడా సాధించింది.

తాజాగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్రయూనిట్‌ తమ పెద్ద మనసును చాటుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ కోసం తమ వంతుసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బాదితుల కోసం సినిమాలో ఉపయోగించిన ఆర్‌ఎక్స్‌ 100 వాహనాన్ని వేలానికి పెట్టారు. వేలం ద్వారా వచ్చిన మొత్తానికి కేరాళ వరద బాధితుల సహాయనిధికి అందించనున్నారు. ఈ మేరకు హీరో కార్తీకేయ, దర్శకుడు అజయ్‌ భూపతి వీడియో మేసెజ్‌లు రిలీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement